Top story:టిప్పు సుల్తాన్ లేకపోతే అమెరికా లేదా..? అమెరికాకు స్వేచ్ఛనిచ్చిన మైసూర్ పులులు చరిత్రను షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్..!

జులై 4న అమెరికా తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటుందో మనందరికీ తెలుసు. కానీ, అమెరికాకు బ్రిటన్ గుప్పిటి నుండి స్వేచ్ఛ లభించడం వెనుక.. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చెందిన ఇద్దరు వీర పరాక్రమవంతుల సాయం

Post Published By: dialnews
Updated : 6 July 2026, 2:30 PM IST

జులై 4న అమెరికా తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటుందో మనందరికీ తెలుసు. కానీ, అమెరికాకు బ్రిటన్ గుప్పిటి నుండి స్వేచ్ఛ లభించడం వెనుక.. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చెందిన ఇద్దరు వీర పరాక్రమవంతుల సాయం ఉందనే నిజం మీలో ఎంతమందికి తెలుసు? అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ బ్రిటీష్ సైన్యంతో పోరాడుతున్నప్పుడు, ఇక్కడ ఇండియాలో బ్రిటన్ నడుము విరిచిన ఆ మైసూర్ పులులు మరెవరో కాదు.. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్.

18వ శతాబ్దం చివరి నాటికి బ్రిటీష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తోంది. ఒకవైపు అమెరికాలోని 13 కాలనీలు బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం కోసం విప్లవాన్ని ప్రారంభించాయి. సరిగ్గా అదే సమయంలో, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యాన్ని విస్తరించకుండా మైసూర్ పాలకుడైన హైదర్ అలీ సింహస్వప్నంలా మారారు. జార్జ్ వాషింగ్టన్ మరియు హైదర్ అలీల మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, మైసూర్ నుండి సైన్యం కూడా అమెరికా వెళ్ళలేదు. కానీ, వీరిద్దరి శత్రువు మాత్రం ఒక్కడే.. అదే బ్రిటన్. ఈ ఇద్దరు వీరులు ప్రపంచానికి రెండు వైపులా ఉంటూ బ్రిటీష్ సైన్యంపై ఏకకాలంలో దాడికి దిగారు.

1780లో జరిగిన రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో, కాంచీపురం సమీపంలోని పొల్లిలూర్ వద్ద హైదర్ అలీ బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూస్తూ ఏకంగా 3,000 మంది బ్రిటీష్ సైనికులు చనిపోయారు. ఈ దెబ్బతో బ్రిటన్ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికాలో యుద్ధం గెలవడానికి పంపించాల్సిన సైన్యాన్ని, నౌకాదళాన్ని, కోట్ల రూపాయల ధనాన్ని ప్రాణభయంతో ఇండియాకు మళ్లించాల్సి వచ్చింది. రాయల్ నేవీకి చెందిన ఐదో వంతు యుద్ధనౌకలు మైసూర్ పులులను ఆపడానికే సరిపోయాయి. ఫలితంగా అమెరికాలో ఉన్న జార్జ్ వాషింగ్టన్ సైన్యానికి బ్రిటన్‌ను ఓడించడం చాలా సులువైంది.

ఇక్కడే అసలైన హైప్ మొదలవుతుంది. హైదర్ అలీ సాధించిన విజయాల వార్తలు అమెరికాకు చేరడంతో, అక్కడి విప్లవకారులు ఆయనను ఒక హీరోలా ఆరాధించారు. 1781లో అమెరికాలోని పెన్సిల్వేనియా తమ ఒక భారీ యుద్ధనౌకకు ఏకంగా ‘హైదర్ అలీ’ అని పేరు పెట్టి గౌరవించింది. అమెరికా కవులు హైదర్ అలీని పొగుడుతూ పవర్‌ఫుల్ పద్యాలు రాశారు. అంతేకాదు, అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో బ్రిటన్ కమాండర్ కార్న్‌వాలిస్ లొంగిపోయినప్పుడు.. న్యూజెర్సీ వీధుల్లో అమెరికన్లు మద్యం గ్లాసులు చేతబూని "బ్రిటన్ అహంకారాన్ని అణచిన వీరుడు హైదర్ అలీ" అంటూ జై కొట్టారు. ఆ తర్వాత వచ్చిన టిప్పు సుల్తాన్ పరాక్రమాన్ని కూడా అమెరికా పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. అమెరికా సూపర్ పవర్ కావడానికి మన భారతీయ వీరుల పరాక్రమం ఎలా ఉపయోగపడిందో. అందుకే చరిత్ర ఎప్పుడూ ఒకరితోనే ముగిసిపోదు, దానికి గ్లోబల్ కనెక్షన్స్ ఉంటాయి.

Published : 
  • 6 July 2026, 2:30 PM IST