Top story: వరుస స్కాంలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి… జనంలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు..!

ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి మొదలైందా ? వరుస కుంభకోణాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయా ? ఎన్ని వేషాలు వేసినా...బీజేపీకి జనంలో ఇమేజ్‌ పెరగడం లేదా ? వరుసగా 12 ఏళ్లుగా అధికారంలో ఉండటం.

Post Published By: dialnews
Updated : 6 July 2026, 10:00 AM IST

ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి మొదలైందా ? వరుస కుంభకోణాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయా ? ఎన్ని వేషాలు వేసినా...బీజేపీకి జనంలో ఇమేజ్‌ పెరగడం లేదా ? వరుసగా 12 ఏళ్లుగా అధికారంలో ఉండటం...కేంద్ర మంత్రుల వివాదాలతో సతమతం అవుతోందా ? ఇదే అసంతృప్తి జనంలో కంటిన్యూ అయితే...వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదా ? ఇప్పుడిదే దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.కేంద్రంలోని ఎన్డీఏకి ప్రజల్లో క్రమంగా మద్దతు తగ్గుతోంది. ఈ వర్గం...ఆ వర్గం అనే తేడా ఏం లేదు. అన్ని వర్గాల జనం...బీజేపీ పాలన అంటే మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితులు మొదలయ్యాయి. వరుసగా జరుగుతున్న స్కాంలు బీజేపీకి తలనొప్పిగా మారుతున్నాయి. జెన్‌ జీ...సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయని స్కాంలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కేంద్రం తప్పిదాలను ఎప్పటికపుడు ఎండగడుతోంది. దీంతో బీజేపీ అంటే ప్రజలకు క్రమంగా విరక్తి కలుగుతోంది. 12 ఏళ్ల పాటు అధికారంలోకి ఉన్న బీజేపీకి...ప్రస్తుత పరిణామాలు ఊహించని షాక్‌ ఇస్తున్నాయి.

ప్రజలకు తెలియకుండానే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇథనాల్‌ వినియోగించిన కార్లు ఒకదాని వెంట మరొకటి పాడవడం...కొన్ని కార్లు షెడ్డుకు వెళ్లడంతో బీజేపీ అడ్డంగా బుక్కయింది. 2030లో ప్రవేశపెట్టాల్సిన పాలసీని..2025లో అమలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోషించింది. 2జీ స్కాం కంటే...ఇథనాల్‌ కుంభకోణం పెద్దదని...కేంద్రంపై యూత్ విరుచుకుపడుతోంది. సుప్రీంలో అటార్నీ జనరల్‌ ఈ 20 ఆన్‌గోయిగ్‌ పర్మిట్‌ అంటూనే 2027వరకు ఏం చెప్పలేమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. దీన్నే టీం భారత్‌తో పాటు అనేక యూత్‌ సంస్థలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. నిరసనలకు సిద్ధం అవుతున్నాయి. పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ కూడా ప్రజలకు వివరించలేకపోతున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తనయులు...నిఖిల్, సారంగ్‌ గడ్కరీలు సియాన్ అగ్రో సంస్థ...ఈ20 వ్యాపారం చేయడం మరింత వివాదంగా మారింది. ఈ20 అమలుకు ముందు ఆ కంపెనీ నెట్ వర్త్‌ 89 కోట్లు ఉంటే...దీన్ని అమలు చేశాక అమాంతంగా పెరిగిపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ పాలసీ బీజేపీ మంత్రులకే మేలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్‌ అంటూ కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. దీనిపై ఎందుకు దర్యాప్తు జరగదని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.

మరోవైపు అయోధ్య నిధుల కుంభకోణం...బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రస్ట్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్‌...8 మంది నిందితులను అరెస్టు చేసింది. ట్రస్ట్‌ ఛైర్మన్ చంపత్‌రాయ్‌...పదవికి రాజీనామా చేశారు. ప్రణాళికబద్ధంగా నిధులను కాజేసి...ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. కుంభమేళా సమయంలోనే భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. 8 నెలల సీసీ టీవీ ఫుటేజ్‌ ధ్వంసం చేసినట్ల తెలుస్తోంది. 2015-17 మధ్యకాలంలో 14వందల కోట్లు, క్వింటాళ్ల కొద్దీ బంగారం స్వాహ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 125 మంది ఉద్యోగుల నియామకంపై సిట్‌ ఫోకస్ చేసింది. నిధుల దుర్వినియోగంపై కాంగ్రెస్‌...సీబీఐ విచారణ డిమాండ్‌ చేస్తోంది. ఈ వ్యవహారం బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ స్కాం నుంచి ఎలా బయట పడాలో తెలియక సతమతం అవుతోంది.

అంతకుముందు నీట్‌ పేపర్‌ లీక్‌...దేశవ్యాప్తంగా దుమారం రేపింది. మే 3న జరిగిన పరీక్ష పేపర్‌ లీక్ కావడంతో...మళ్లీ జూన్‌ 21న పరీక్ష నిర్వహించడం...అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం...కేంద్రానికి తలనొప్పిగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 పరీక్ష పేపర్లు లీక్‌ అయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. పేపర్ల లీకేజ్‌ వెనుక...బీజేపీ నేతలు ఉండటం...బీజేపీకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. రాజస్థాన్‌ కేంద్రంగా నీట్‌ పేపర్‌లీక్‌...అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉండటం...దేశంలోని యువత, స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక్కో పేపర్‌ను 25 లక్షలకు అమ్మారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీవీ కులకర్ణి ప్యానెల్‌లో ఉండటం...అరెస్టు కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ వ్యవహారంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ...కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగింది. 2002 నుంచి సర్‌ను లెక్కలోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సమాచారం సరిగా లేకపోయినా...అనేక డాక్యుమెంట్లు సమర్పించినా...తాము భారతీయులం కాదా అని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రగాల్బాలు పలికింది. 4వందల సీట్లే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసినా...అవి సక్సెస్‌ కాలేదు. మిత్ర పక్షాల మద్దతు ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. టీఎంసీ, ఆప్‌, శివసేన ఉద్దవ్ థాక్రే ఎంపీలను చీల్చేసింది. వారికి ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీలను వరుసగా చీల్చుతూ పోతోంది. జమిలి ఎన్నికల పేరుతో ఒకేసారి అన్ని రాస్ట్రాల్లో అధికారం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీకి బలం లేని కింద స్థాయి నేతలతో పాటు అసంతృప్తి నేతలను చేర్చుకొని కీలకబాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది. ఇలా బీజేపీ చేస్తున్న కుట్రలు, కుంభకోణాలు, వివాదాలు...ఆ పార్టీ ఇమేజ్‌న్ ఘోరంగా దెబ్బ తీస్తున్నాయి.

Published : 
  • 6 July 2026, 10:00 AM IST