కోలీవుడ్‌లో టాలీవుడ్ చిత్రాల వెనుకబాటు లోపమే శాపమా?

తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు లభించడం లేదనే ఆందోళన టాలీవుడ్‌లో ఉంది. తమిళ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రేక్షకులు మన డబ్బింగ్ సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Post Published By: dialnews
Updated : 18 July 2026, 4:10 PM IST

తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు లభించడం లేదనే ఆందోళన టాలీవుడ్‌లో ఉంది. తమిళ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రేక్షకులు మన డబ్బింగ్ సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరత కాదు, మన సినిమాల అనువాదంలో జరుగుతున్న పొరపాట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.తమిళ ప్రేక్షకులు తమ భాషను ఎంతో ప్రేమిస్తారు. సినిమా చూస్తున్నప్పుడు అది తమ సొంత సినిమా అనే ఫీలింగ్ కలగకపోతే వారు అస్సలు ఆదరించరు. కోలీవుడ్ నుండి తెలుగులోకి వచ్చే సినిమాలు ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మారుతాయి.

కానీ, మన తెలుగు సినిమాలు తమిళంలోకి వెళ్లేటప్పుడు కేవలం పదాలను ఒక భాష నుండి మరో భాషలోకి మార్చినట్టు ఉంటున్నాయే తప్ప, ప్రేక్షకుల మనసులను తాకడం లేదు. మన రైటర్స్ అక్కడి పదాలను వాడుతున్నారు కానీ, ఆ భాషలోని భావాన్ని, ఆత్మను పట్టుకోలేకపోతున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగులో విజయవంతం కావడానికి ఇక్కడి లిరిక్ రైటర్లు పాటలను తెలుగు సంస్కృతికి తగినట్టుగా మార్చడమే కారణం. అయితే, మన తెలుగు పాటలు తమిళంలోకి వెళ్ళేసరికి కేవలం డబ్బింగ్ పాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సహజత్వం కనిపించడం లేదు. తమిళ ప్రేక్షకుల పల్స్, వారి రోజువారీ సామెతలు, హ్యుమర్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

వాటిని అధ్యయనం చేయకుండా కేవలం సినిమాను అక్కడ రిలీజ్ చేస్తే థియేటర్లు ఖాళీగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి", "పుష్ప" వంటి సినిమాలు తమిళనాట భారీ విజయం సాధించడానికి కారణం వాటిలోని ఎమోషన్స్ మరియు అక్కడి మార్కెట్ కోసం ప్రత్యేకంగా తీసుకున్న శ్రద్ధే. మీడియం బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే, మన మేకర్స్ కేవలం ఒక ఫార్మాలిటీ కోసం మాత్రమే డబ్బింగ్ చెప్తున్నారు. ఈ కంటెంట్ అనువాదంలో నాణ్యతా లోపాల వల్లే తమిళ డిస్ట్రిబ్యూటర్లు మన సినిమాలు కొనడానికి, థియేటర్లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. తమిళనాడులో మన సినిమాలకు మార్కెట్ పెరగాలంటే కేవలం థియేటర్లు కావాలని డిమాండ్ చేస్తే సరిపోదు.
తమిళ ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకుని, వారి సంస్కృతికి తగినట్టుగా రీ-రైటింగ్, డబ్బింగ్ క్వాలిటీని పెంచాలి. ఎప్పుడైతే మన సినిమా వారికి ఒక డబ్బింగ్ చిత్రంలా కాకుండా, ఒక స్ట్రెయిట్ తమిళ సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుందో, అప్పుడు థియేటర్లు వాటికంతట అవే వెతుక్కుంటూ వస్తాయి అనేది సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Published : 
  • 18 July 2026, 4:10 PM IST