భారతీయ సినీ చరిత్రలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పాన్-వరల్డ్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఏదైనా ఉందంటే అది నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ' అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటీనటుల ఎంపిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై సినీ ప్రియుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ గ్లింప్స్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ గ్లింప్స్ కి వచ్చిన షాకింగ్ రెస్పాన్స్ సినిమా రేంజ్ ఏంటో ముందే ప్రామిస్ చేసింది. అయితే ఆ గ్లింప్స్ కంటే మిన్నగా, అంతకుమించిన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఇప్పుడు 'రామాయణ' ట్రైలర్ ను మేకర్స్ ఎట్టకేలకు విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ, మూవీ లవర్స్ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది.వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి కొందరిలో కొన్ని రకాల అనుమానాలు, అపోహలు ఉండేవి. అసలు ఆధునిక కాలానికి తగ్గట్టుగా రామాయణాన్ని ఎలా ప్రెసెంట్ చేస్తారు? గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి? క్యాస్టింగ్ సరిగ్గా సెట్ అయిందా లేదా? అని రకరకాల ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్ కట్ ఆ అనుమానాలన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చింది.హాలీవుడ్ రేంజ్లో రూపొందించిన గ్రాఫిక్స్, అద్భుతమైన ఫ్రేమింగ్, భారీతనం చూస్తుంటే ఈ సినిమా అంచనాలను ఏ స్థాయిలో పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు. మేకర్స్ రాజీ పడకుండా ప్రతి సీన్ ను అత్యంత సహజంగా, కళ్లకు కట్టినట్టుగా తీర్చిదిద్దారు.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హాలీవుడ్ స్థాయిలో అత్యుత్తమ నాణ్యతను అందించడానికి ఏకంగా 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విఎఫ్ఎక్స్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు పనిచేసింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు మనం వేరే ఏదో ఊహాలోకంలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఒరిజినల్ లొకేషన్లలో షూట్ చేసినంత సహజంగా ప్రతి సన్నివేశం ఉండటం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది. ఒకటి రెండు చోట్ల మినహా, మిగతా ట్రైలర్ అంతా విజువల్ వండర్ లానే అనిపిస్తుంది.ట్రైలర్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం 'రాకింగ్ స్టార్' యష్ పోషించిన రావణాసురుడి పాత్ర. యష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన హావభావాలు, ఆ పాత్రలో చూపించిన క్రోధం, అహంభావం ప్రతి ఒక్కరినీ భయపెట్టేలా ఉన్నాయి.
భీకరమైన యుద్ధ సన్నివేశాలలో యష్ లుక్ మరియు ఆయన డైలాగ్ డెలివరీ పీక్స్ లో ఉన్నాయి. రావణుడి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రలో యష్ జీవించేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.ఇక బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా, ఎనర్జెటిక్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో మెప్పించగలడా అని కొందరు సందేహించారు. కానీ ట్రైలర్ లో రణబీర్ లుక్ చూసాక ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి.
శ్రీరాముడి లోని సౌమ్యత, శాంతం, అదే సమయంలో ధర్మాన్ని కాపాడే క్రమంలో కనిపించే వీరత్వం.. రెండింటినీ రణబీర్ తెరపై అత్యంత ప్రకాశవంతంగా ఆవిష్కరించారు.వనవాస ఘట్టాల్లో ఆయన చూపించిన ఎమోషనల్ పండించిన తీరు గుండెలను పిండేసేలా ఉంది.
రాముడిగా రణబీర్ కపూర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.
సహజ నటి సాయి పల్లవి ఈ సినిమాలో 'సీతాదేవి' పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పాత్ర విషయంలో కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. సీత పాత్రకు ఆమె సరిపోతుందా లేదా అని డౌట్స్ ఉన్నవారికి దర్శకుడు నితీష్ తివారీ తన మేకింగ్ తో గట్టి షాక్ ఇచ్చారు. ఆమెలోని సున్నితమైన కరుణ, ఎమోషన్స్‌ను మాత్రమే కాకుండా, కథకు అవసరమైన యుద్ధ నైపుణ్య సన్నివేశాల్లో కూడా సాయి పల్లవిని చాలా కొత్తగా, శక్తివంతంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.ట్రైలర్ చూస్తుంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ వచ్చే ఎమోషనల్ అండ్ డివైన్ మ్యూజిక్ ప్రేక్షకులను కథలో మమేకం చేస్తుంది. ఆస్కార్ విజేతలతో కూడిన సాంకేతిక బృందం రాత్రింబవళ్లు శ్రమించి ఈ దివ్యమైన కావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి చేసిన కృషి ప్రతి ఫ్రేమ్‌లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.