Top story: త్రిష పరిస్థితి ఏమిటి? విడాకులు వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీత, త్రిష రూట్ ఎటు?

ఎవరు ఊహించని విధంగా తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత తన విడాకులు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. విజయ్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ ని సంగీత

Post Published By: dialnews
Updated : 8 August 2026, 8:00 AM IST

ఎవరు ఊహించని విధంగా తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత తన విడాకులు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
విజయ్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ ని సంగీత వెనక్కి తీసుకున్నారు.
పిటీషన్ ఉపసంహరణతో చెంగల్పట్టు కోర్టు ఈ కేసు ని క్లోజ్ చేసింది. దీంతో విజయ్ సంగీత విడాకులు వ్యవహారానికి తాత్కాలికంగా తెర్పడింది.2025 డిసెంబర్ 5న చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం సంగీత పిటిషన్ దాఖలు చేశారు. గత మూడుసార్లు పోటీ కేసును విచారించింది. సంగీత విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడంపై విజయ్ తరపు లాయర్లు అభ్యంతరం చెప్పలేదు. అంటే ముందుగానే ఒప్పందం ప్రకారం సంగీత విజయ్ అవగాహనకు వచ్చి ఉంటారని తెలుస్తుంది.

విడాకులు కేసు వాదనల సందర్భంగా సంగీత కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో విజయ్ పై పలు ఆరోపణలు చేశారు. విజయ్ కి చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. తనతో వాదనకు దిగితే పేర్లు కూడా బయట పెడతానంటూ హెచ్చరించారు. అయితే ఎన్నికలకు ముందు 200 కోట్లు రూపాయలకు పైగా ఆస్తులను సంగీత కు ఇవ్వడానికి విజయ అంగీకరించినట్లు సమాచారం. సంగీత పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి అక్కడ తన కుటుంబ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రమాణ స్వీకార ఉత్సవానికి కూడా ఆమె రాలేదు. కానీ ఆ తర్వాత విజయ్ తల్లిదండ్రుల చొరవతో ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం. దాని ఫలితమే విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు కథంతా ఇక్కడే ఉంది. విడాకులు పిటిషన్ ఉపసంహరించుకుంది కనుక సంగీత, పిల్లలు ఇద్దరు విజయ్ తోనే కలిసి ఉంటారా ? లేదా అన్నది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. విడాకులు వెనక్కి తీసుకుంది కాబట్టి: సంగీత విజయ్ మధ్య గొడవ సమస్య పోయినట్లేనని, ముఖ్యమంత్రి భార్యగా ఆమె ఇప్పుడు అన్ని హక్కుల్ని అనుభవించవచ్చని... భర్త సీఎం అవడం వల్లే తిరిగి వచ్చిందని, అందరూ కలిసి ఉంటారు అనే వాదన బాగా వినిపిస్తోంది.సంగీత విజయ్ తిరిగి కలసి కాపురం మొదలుపెడితే త్రిష పరిస్థితి ఏంటి? అసలు ఈ గొడవ అంతటికి మూల కారణం త్రిషా. డివోర్స్ కి అప్లై చేసిన తర్వాత గాని, ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని విజయ్ నిర్భయంగా త్రిషతో తిరుగుతూ కొన్నిసార్లు కెమెరాకి చిక్కాడు. త్రిష కూడా ఎటువంటి అరమరికలు లేకుండా విజయ్ ఇంటికి వెళ్లి వస్తోంది. విజయ్ తన పుట్టినరోజు కూడా త్రిష తో కలిసి చేసుకున్నాడు. సంగీత విజయ్ మధ్య విడాకులు మంజూరు అయితే, విజయ్ త్రిషాని పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు విడాకులు లేకపోవడంతో త్రిష ఒంటరిగా మిగిలిపోవడమేనా? లేక విజయ్ స్టోరీ ఇంట్లో ఇల్లాలు... బయట ప్రియురాలుగా టర్న్ తీసుకుంటుందా అని తమిళనాడులో చర్చ నడుస్తుంది.

 

 

Published : 
  • 8 August 2026, 8:00 AM IST