కేజీఎఫ్' సినిమాలో 'రాకీ భాయ్'గా వచ్చి ఇండియా మొత్తం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ గురుంచి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా! 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ తదుపరి సినిమా ఏంటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూశారు.
అలాంటి టైమ్‌లో వచ్చిన ప్రాజెక్ట్ ప్రకటనే 'టాక్సిక్'.గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ మైండ్ బ్లోవింగ్ న్యూస్ బయటకొచ్చింది. సాధారణంగా మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతుంటాయి.
పెద్ద హీరోల సినిమాలైతే కొన్ని వందల స్క్రీన్లలో వేస్తుంటారు. కానీ 'టాక్సిక్' సినిమాను యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా ఏకంగా 2,000 కి పైగా స్క్రీన్లలో అత్యంత భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు! ఒక ఇండియన్ సినిమాకు యుఎస్ఓవర్సీస్ మార్కెట్లో ఈ స్థాయిలో స్క్రీన్స్ దక్కడమంటే అది చిన్న విషయం కాదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఓవర్సీస్లో రాకింగ్ స్టార్ యష్‌కున్న క్రేజ్ ఏ స్థాయికి చేరిందో! ఇక ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలోకి రాబోతోంది.
ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. కేవలం తెలుగు, కన్నడ, హిందీ వంటి భారతీయ భాషల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఇంగ్లీష్‌తో సహా పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు.టాక్సిక్' సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, యష్ కూడా స్వయంగా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సౌత్ టాప్ హీరోయిన్ నయనతార మరియు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, బాలీవుడ్ నుంచి హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్ లతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు డారెల్ డి'సిల్వా, కైల్ పాల్, మరియు బీట్రిజ్ టోఫెన్బాచ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.భారతీయ సినీ నటులు, హాలీవుడ్ స్టార్స్ కలసి నటిస్తున్న ఈ పాన్-గ్లోబల్ యాక్షన్ మూవీ థియేటర్లలోకి వస్తే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు మళ్లీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.