Top story: మోసం చేసిన వెండి, మహిళలని ముంచేసిన వెండి… మూడు నెలల్లో 40% డౌన్…!

ఆడవాళ్ళందరూ దారుణంగా మోసపోయారు. బంగారం కంటే వెండి చాలా స్పీడ్ గా రేటు పెరుగుతుందని భావించి లక్షల పోసి కిలోల కొద్దీ వెండి కొన్నారు. ఊహించని విధంగా మూడు నెలల్లో కిలోకి రెండు లక్షల రూపాయలు పడిపోయింది వెండి రేటు.

Post Published By: dialnews
Updated : 1 May 2026, 10:13 AM IST

ఆడవాళ్ళందరూ దారుణంగా మోసపోయారు. బంగారం కంటే వెండి చాలా స్పీడ్ గా రేటు పెరుగుతుందని భావించి లక్షల పోసి కిలోల కొద్దీ వెండి కొన్నారు. ఊహించని విధంగా మూడు నెలల్లో కిలోకి రెండు లక్షల రూపాయలు పడిపోయింది వెండి రేటు. కిలో నాలుగు లక్షలు దాటినప్పుడే అమ్ముకొని ఉంటే ఇబ్బడి ముబ్బడి గా లాభాలు వచ్చేవి. కిలో వెండి 5 లక్షలకి వెళుతుందని ఆశపడి కిలో లక్షన్నర, నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొన్న వెండిని అలాగే లాకర్లో భద్రంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అది రెండు లక్షల 37 వేలకు పడిపోయింది.4 లక్షల,40 వేలకు వెళ్ళినప్పుడు అమ్ముకొని ఉంటే ఇప్పుడు కిలోకి ఒక్కొక్కరికి రెండు లక్షల లాభం వచ్చేది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సిల్వర్.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రెండు మూడు నెలల కింద 4 లక్షలు దాటిన రేటు.. ఇప్పుడు దాదాపుగా సగం తగ్గింది.

కేవలం మూడు నెలల్లోనే రేటు పతనం కావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. చాలామంది సామాన్య జనాలు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేశారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మూడు నాలుగు నెలల్లో రెండు నుంచి నాలుగు లక్షల పైకి దూసుకుపోయిన వెండి.. ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవిష్యత్‌లో ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోయిన వెండి ధరలు.. ఇప్పుడు అంతే వేగంగా కిందికి దిగి వస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే కిలో వెండి ధర ఏకంగా 2 లక్షల వరకు పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. 2025లో 170 శాతం.. 2026 జనవరిలో 74 శాతం వృద్ధిని నమోదు చేసిన వెండి.. జనవరి 29న కిలోకు 4 లక్షల 40 వేల వద్ద ఆల్-టైమ్ రికార్డును తాకింది. అయితే అప్పటి నుంచి వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోకు సుమారు 2.38 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపుగా 40 శాతానికిపైగా పతనమైంది.

వెండి ధరల పతనానికి నిపుణులు ఐదు కారణాలు చెబుతున్నారు. గత నెల రోజుల్లో సిల్వర్ ధర భారీగా పెరగింది. దీంతో.. లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. రెండవది అమెరికా డాలర్ బలపడటం. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ సూచీ పెరగడంతో.. వెండి కొనుగోలు ఇతర దేశాలకు ఖరీదైనదిగా మారింది. దీంతో.. సిల్వర్‌కు డిమాండ్ తగ్గింది. మూడో రీజన్ చూస్తే.. యూఎస్ ఫెడ్ నిర్ణయాలు. వడ్డీ రేట్ల కోతలో జాప్యం జరుగుతుందనే భయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. దీంతో.. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. నాలుగవది.. ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్స్ పతనం కావడం. దీని ప్రభావం కమోడిటీ మార్కెట్లపైనా పడింది. ఇక చివరి కారణం.. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల ప్రతిపాదనలు, కాల్పుల విరమణ ప్రతిపాదనలు రావడంతో.. సురక్షిత పెట్టుబడిగా వెండికి ఉన్న డిమాండ్ తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు సుమారు 3 శాతం తగ్గి 73.10 డాలర్లకు చేరింది. ప్రస్తుత పతనాన్ని నిపుణులు ఒక మార్కెట్ కరెక్షన్‌గా పరిగణిస్తున్నారు. ఇవాళ మరింత తగ్గి 72.12 డాలర్ల స్థాయికి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌ ఎలా ఉంటుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం.. వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు దీనికి పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. ధరలు తగ్గినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో లాభాల స్వీకరణ, బలమైన డాలర్ ప్రభావం కొనసాగేలా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలికంగా వెండి ఒక బలమైన పెట్టుబడిగా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే పెట్టుబడిపెట్టే సమయంలో ఆచితూచి అడుగేయాలని సూచిస్తున్నాయి.ఇప్పుడు ఆచితూచి అడిగేయడానికి కూడా మహిళలు భయపడుతున్నారు. వెండి కిలో 5 లక్షల రూపాయలు దాటుతుందని రకరకాల మార్కెట్ విశ్లేషణలు చూసి కొని పెట్టుకున్నారు . చివరికి అది ఇప్పుడు రెండు లక్షల పడిపోవడంతో మహిళలు లో ఉన్నారు. వెండి ఇంత మోసం చేసిందా అని లబోదిబోమంటున్నారు.

 

 

Published : 
  • 1 May 2026, 10:13 AM IST