USలో 90 కోట్ల ధురందర్ 2.. ఇప్పటికీ ప్రభాసే కింగ్…!

ధురందర్ 2 దుమ్ముదులుపుతోంది. రెండురోజుల్లో 330 కోట్లుకి మించేలా వసూళ్లొచ్చాయి. కాని ఇక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ మాత్రమే కాదు, డాలర్స్ లోకూడా తానే కింగ్ అనిపించుకున్నాడు

Post Published By: dialnews
Updated : 23 March 2026, 4:45 PM IST

ధురందర్ 2 దుమ్ముదులుపుతోంది. రెండురోజుల్లో 330 కోట్లుకి మించేలా వసూళ్లొచ్చాయి. కాని ఇక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ మాత్రమే కాదు, డాలర్స్ లోకూడా తానే కింగ్ అనిపించుకున్నాడు. బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యేలా ధురందర్ 2 మూవీ యూఎస్ లో పది మిలియన్ డాలర్లు అంటే ఆల్ మోస్ట్ 90 కోట్లు రాబట్టింది. కేవలం రెండు మూడు రోజుల్లో ఇన్ని వందలకోట్లు యూఎస్ లో రావటం అంటే రికార్డే.. కాని ఆ రికార్డు రెబల్ స్టార్ రికార్డుల ముందు తేలిపోతోంది. 2 ఏళ్ల క్రితం ప్రభాస్ మూవీ కల్కీ చేసిన మ్యాజిక్ ముందు ఈ ధురందర్ 2 రికార్డు సౌండ్ కాస్త తగ్గింది.. ధురందర్ 2 వసూళ్ల వరద చూసి అంతా షాక్ అయ్యారు. కాని రికార్డుల లెక్కలు బయటికొచ్చాకే, కల్కీ రేంజ్ ఏంటో ఒక్కొక్కరికి నిదానంగా అర్ధమౌతున్నట్టుంది. పరోక్షంగా ధురందర్ 2 హిట్టై, రెబల్ స్టార్ పాత రికార్డులకి రెక్కలోచ్చేలా చేస్తోంది.

హిందీ మూవీ ధురందర్ సీక్వెల్ ధురందర్ 2 మూవీ కేవలం 2 రోజుల్లో 330 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. పేయిడ్ ప్రివ్యూ, ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలిపి 190 కోట్లు రావటమే షాకింగ్ న్యూస్... బాలీవుడ్ మొత్తం షేకయ్యే రెస్పాన్స్ ఇది... దీనికి తోడు నార్త్ అమెరికాలో 90 కోట్ల రికార్డు క్రియేట్ చేసింది ధురంధర్ మూవీ.. ఆ రికార్డు దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కీ రీసౌండ్ పెరిగిపోయింది.నిజానికి ధురందర్ సీక్వెల్ కి వసూళ్ల రికార్డు క్రియేట్ అయితే, రణ్ వీర్ సింగ్, లేదంటే దర్శకుడి పేరు మారుమోగాలి. కాని కల్కీ పేరు రీసౌండ్ చేస్తోంది. కారణం కల్కీ క్రియేట్ చేసిన హిస్టారికల్ రికార్డు... రెండేళ్ల క్రితం రెబల్ స్టార్ మూవీ కల్కీ సినిమా వచ్చింది. బాహుబలి తర్వాత దేశం మొత్తం ఒక సినిమాకోసం మళ్లీ థియేటర్స్ ముందు క్యూ కట్టిందంటే అది కల్కీకోసమే అన్నారు.

అలాంటి మూవీ నార్త్ అమెరికా రికార్డు ఇప్పుడు ధురందర్ సీక్వెల్ క్రియేట్ చేసిన రికార్డు పుణ్యమాని హైలెట్ అవుతోంది. ఎందుకంటే నార్త్ అమెరికాలో ధురందర్ 2 విడుదలై మొదటి మూడు రోజులలో 10. 8 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 90 కోట్లకు సమానం. కాని కల్కీ మూవీ రెండేళ్ల క్రితమే విడుదలై, 11.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయలు... సో పాన్ ఇండియాలెవల్లో ఇన్ని భాషల్లోరిలీజైనా ధురందర్ 2 మాత్రం కల్కీ రికార్డుని టచ్ చేయలేకపోయింది.

కల్కీ ఫస్ట్ హాఫ్ కామెడీ గా ఉండొచ్చు.. కాని సెకండ్ హాఫ్ లో కర్ణుడిగా ప్రభాస్ కాసేపు కనిపించిన సీన్ దెబ్బకి బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంది కల్కీ... అందుకే అప్పట్లో దాని రికార్డు విలువ తెలియని వాళ్లకి ధురందర్ 2 వచ్చి దాని రికార్డు ఎలాంటిదో ప్రూవ్ చేస్తోంది.. నిజం చెప్పాలంటే ధురందర్ హిట్ వల్ల ధురందర్ 2 కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.ఈరేంజ్ హైప్ లో కూడా కల్కీ రికార్డుని ధురందర్ 2 నార్త్ అమెరికాలో టచ్ చేయలేకపోయింది. అందుకే కల్కీ తాలూకు నార్త్ అమెరికా రికార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే కాదు బాహుబలి 2 రికార్డుని కూడా ధురందర్ 2 టచ్ చేయలేకపోయింది. పుష్ప2 రికార్డులైనా బద్దలయ్యాయి కాని, బాహుబలి 2, కల్కీ రికార్డుల్ని మాత్రం ధురందర్ టచ్ చేయలేకపోయింది.

Published : 
  • 23 March 2026, 4:45 PM IST