టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అంటే ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో' నుంచి మొన్నటి 'గుంటూరు కారం' వరకు పాటలు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరిద్దరి అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ తదుపరి చిత్రానికి థమన్ సంగీతం అందించడం లేదనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
త్రివిక్రమ్ తదుపరి సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ అనే ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో థమన్ బదులు మరొక సంగీత దర్శకుడు పని చేయబోతున్నారని సమాచారం.
సాధారణంగా త్రివిక్రమ్ ఒకసారి ఒక టెక్నీషియన్‌తో సెట్ అయితే, వరుసగా వారితోనే సినిమాలు చేస్తారు. కానీ ఈసారి ఆయన తన టీమ్‌ను మార్చాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వార్తలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించారు.మేమంతా దీని గురించి చర్చించుకున్నాం. 'ఆదర్శ కుటుంబం' సినిమా కోసం త్రివిక్రమ్ గారు ఒక కొత్త టీమ్‌తో పని చేయాలని ఆశపడ్డారు. మా తదుపరి భారీ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' కోసం మేమిద్దరం మళ్ళీ కలవబోతున్నాం. ఆ సినిమా చాలా పెద్దది కాబట్టి, ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి మేమిద్దరం సంతోషంగా అంగీకరించాం అని తమన్ రివీల్ చేశాడు. దీనిని బట్టి చూస్తుంటే, త్రివిక్రమ్ - థమన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం కథ డిమాండ్ మేరకు లేదా ఒక మార్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది.
థమన్ చెప్పినట్లు వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది త్రివిక్రమ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని, అందుకే ఈ సినిమా కోసం థమన్ ప్రత్యేకంగా సమయం కేటాయించబోతున్నారని తెలుస్తోంది. బహుశా అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్‌తో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌తో వరుసగా సినిమాలు చేసినప్పుడు ఆడియోలో ఒకే రకమైన ఛాయలు వస్తాయనే విమర్శలు కూడా త్రివిక్రమ్‌పై ఉన్నాయి. బహుశా అందుకే 'ఆదర్శ కుటుంబం' లాంటి క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఆయన కొత్త సంగీతాన్ని అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ మాటల తూటాలకు, థమన్ మాస్ బీట్స్‌కు చిన్న విరామం దొరికింది. కానీ అది కేవలం 'తుపాను ముందు ప్రశాంతత' లాంటిదే! 'గాడ్ ఆఫ్ వార్' తో వీరు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో వేచి చూడాలి.