ఎన్టీఆర్ తర్వాత ప్రభాసే దిక్కు… ఎవ్వరినీ వదలని ఐకాన్ …!

రెబల్ స్టార్ ప్రభాస్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. స్పిరిట్ ప్రజెంట్ షెడ్యూల్ కి బ్రేక్ వేసి, ఫౌజీ పెండింగ్ షూటింగ్ కి గేట్లు తెరిచాడు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 01:55 PMLast Updated on: Jan 27, 2026 | 1:55 PM

Allu Arjun Copying Other Heros Movies

రెబల్ స్టార్ ప్రభాస్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. స్పిరిట్ ప్రజెంట్ షెడ్యూల్ కి బ్రేక్ వేసి, ఫౌజీ పెండింగ్ షూటింగ్ కి గేట్లు తెరిచాడు.. ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అచ్చుగుద్దినట్టు, రెబల్ స్టార్ నే కాపీ చేస్తున్నాడు. తన దారిలోనే నడుస్తున్నాడు. ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దారిలో నడుస్తూ, తన స్ట్రాటజీని ఫాలో అవుతున్న బన్నీ, సడన్ గా రెబల్ స్టార్ దారిలోకి ఎందుకు వచ్చాడు… సందీప్, సుకుమార్, లోకేష్ కనకరాజ్, ఇలా ఒకరి తర్వాత ఒకరితో మూవీలు ప్లాన్ చేస్తున్నాడు. వరుసగా ఎనౌన్స్ మెంట్లు ఇస్తూ వస్తున్నాడు… అంతా త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఇచ్చిన ఝలక్ ఎఫెక్టేనా? ఇప్పటికిప్పుడు ఆట్లి మూవీ తప్ప మరే సినిమా చేసే పరిస్థితి లేకున్నా, బన్నీ ఇలా కావాలనే వరుసగా ప్రాజెక్టులు ఎనౌన్స్ చేస్తున్నాడా? దానికి త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా తో ఉన్న లింకేంటి? హావేలుక్

ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తే, వాల్లతోనే బన్నీ టచ్ లోకెళ్లటం మొన్నటి వరకు చూశాం… ప్రశాంత్ నీల్ తో అలానే టచ్ లో కెళ్లాడు. దేవర హీరోయిన్ జాన్వీతో జోడీకట్టేందుకు ప్రిపేర్ అయ్యాడు. కట్ చేస్తే లోకేషన్ ముందుగా ఎన్టీఆర్ నే కలిస్తే, తను నో చెబితే, ఆ కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు..ఇలా ప్రతీ అంశంలో ఎన్టీఆర్ రూట్లోనే వెళుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న కామెంట్లు వచ్చాయి.కట్ చేస్తే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రాటజీని కూడా వాడేస్తున్నాడు ఐకాన్ స్డార్ అల్లు అర్జున్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ స్పిరిట్ చేస్తూ, చిన్న బ్రేక్ ఇచ్చిన ఫౌజీ పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత కల్కీ 2 కి డేట్లు ఇచ్చేశాడు. సలార్ 2 విషయంలో కూడా ప్రశాంత్ నీల్ కి గ్రీన్ సిగ్నల్స్ వచ్చినట్టు తెలుస్తోంది… అసలు వేటికి ఎలా డేట్లు అడ్జెస్ట్ చేస్తాడనేది తర్వాత సంగతి.. ముందు ప్రాజెక్టులు పట్టాలెక్కాల్సిందే..

ఇలా ఒకటి సెట్లో, కనీసం రెండు సెట్ మీదకు వెళ్లటం, మరో కటి ప్లానింగ్ లో ఉండటం.. ఇది పాన్ ఇండియా జర్నీలో రెబల్ స్టార్ ప్రభాస్ ని కంటిన్యూయస్ గా మార్కెట్ ని శాసించేలా చేసింది. అందుకే అదే స్ట్రాటజీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నట్టున్నాడు.. అందుకే ఆట్లీతో మూవీ ఇంకా పూర్తే కాలేదు.. అంతలోనే లోకేష్ కనకరాజ్ తో సినిమాను ఎనౌన్స్ చేయించాడు.మోషన్ టీజర్ కూడా వచ్చేసింది. కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగతో గతంలో అనుకున్న ప్రాజెక్ట్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టించాలంటున్నాడు. యానిమల్ సీక్వెల్ తర్వాత అది పట్టాలెక్కాలని, దానికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా ప్లాన్ చేయిస్తున్నాడు. ఇక సుకుమార్ తో అనుకున్న పుష్ప మూడో సీక్వెల్ తాలూకు మోషన్ టీజర్ ఎనౌన్స్ మెంట్ ఇప్పించే పనిలో ఉన్నాడు.

సో ఇలా తన చేతినిండా మూడు నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉంటే, పాన్ ఇండియా మార్కెట్ లో తన జర్నీకి, తన రీచ్ కి ఎలాంటి ఇబ్బందులుండవనుకుంటున్నాడో.. లేదంటే దర్శకులను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఇన్ సెక్యూరిటీనో మొత్తానికి బన్నీతో ఇలాంటి ప్లానింగ్స్ చేయిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్, ప్రభాస్ దారిలో నడుస్తూ, బన్నీ పాన్ ఇండియా మార్కెట్ లో సాలిడ్ గా పాతుకుపోయేందుకు ఇంకా, ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాడు.