చిరంజీవి, బాబీ కాంబోలో మరో సెన్సేషన్.. మెగా 158 టైటిల్ ఏంటో తెలుసా.. మాస్ ఊరమాస్..!

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తో వింటేజ్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే ఊపులో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 07:15 PMLast Updated on: Jan 24, 2026 | 7:15 PM

Another Sensation From The Chiranjeevi And Bobby Combination

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తో వింటేజ్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే ఊపులో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం కాకా అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాకా అంటే నాయకుడు అని అర్థం. టైటిల్ వింటుంటేనే ఇది మాస్ ఆడియెన్స్‌కు ఏ రేంజ్‌లో కనెక్ట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కథాంశం చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. ఇది బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ మాఫియా డ్రామా అని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్‌లో చూపించి మెప్పించిన బాబీ.. ఈసారి సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్‌ను ప్రెజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బెంగాల్ పోర్ట్ ఏరియా మాఫియా చుట్టూ ఈ కథ తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి తన వయసుకు తగిన పాత్రలో అంటే కనిపించనుండటం విశేషం. ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా, 50 ఏళ్లు పైబడిన పవర్ ఫుల్ లీడర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. కమర్షియల్ అంశాలు ఉంటూనే, కథలో బలమైన ఎమోషన్స్ ఉండేలా బాబీ ఈ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. గ్లామర్ హంగుల కంటే కథా బలంతో సాగే ఈ పాత్ర చిరంజీవి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్ దుబాయ్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి, బాబీ, రచయితల బృందం అక్కడ కథపై తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం టెక్నీషియన్ల ఎంపిక కూడా జరుగుతోంది. ఇక విడుదల విషయానికి వస్తే, మెగాస్టార్ సినిమాలకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్‌నే టార్గెట్ చేశారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికే వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో కాకా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.