మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే . టాక్సిక్ అట్టర్ ప్లాప్ తో శతమాతమవుతున్న ఎష్ పై భారీగా రోలింగ్ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్మాత అల్లు అరవింద్ ఎస్ పై చేసిన కామెంట్స్. యాష్ అనే వాడు సుడిగాడని, కే జి ఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సడన్ గా వచ్చేసింది తప్ప.... యష్ కి పెద్ద సీన్ లేదని , కొందరు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇది కౌంటర్ గా యశ్ తల్లి పుష్ప చేసిన కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. తన కొడుకు ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ నే వుద్దేశించే ఆమె ఇలా ఘాటుగా స్పాందించారా? అని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది.
రెండేళ్ల క్రితం జరిగిన 'కోటబొమ్మాలి' టీజర్ ఈవెంట్లో అల్లు అరవింద్ కెజిఎఫ్ను ఎగ్జాంపుల్‌గా మాట్లాడిన మాటలు టాక్సిక్ రిలీజ్ టైంలో పెద్ద దుమారం రేపాయి. చిన్న హీరో అయినా.. పెద్ద హీరో అయినా.. సినిమాను పెద్దగా చూపిస్తే తప్ప ఆడడం లేదని చెబుతూ.. కెజిఎఫ్‌కు ముందు యశ్ ఎవరంటూ ఉదాహరణగా చెప్పాడు అల్లు అరవింద్.
రెండేళ్ల క్రితం అల్లు అరవింద్ మాట్లాడిన మాటలను అప్పట్లో అందరూ లైట్‌గా తీసుకున్నాడు. అయితే టాక్సిక్ రిలీజ్‌కు ముందు ఇది మళ్లీ హైలైట్ అయింది. టాక్సిక్ ప్రమోషన్లో సందర్భంగా చేసిన యష్ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాటల ప్రస్తావన వచ్చింది. దీనికి యశ్ స్పందిస్తూ.. ఒక యాక్టర్ వలనే సినిమా సక్సెస్ కాదని.. దీని వెనుక ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టం వుంటుందన్నాడు. అయితే.. ప్రధాన పాత్రలో నటించేవారు సరిగ్గా చేయకపోతే.. సినిమా హిట్ కాదన్నాడు.ప్రేక్షకులు పెద్ద సినిమానే చూస్తున్నారని చెప్పడానికి అల్లు అరవింద్ యశ్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే..ఇప్పుడా విషయాన్ని బూతద్దంతో చూస్తున్నారు కన్నడిగులు. 'కెజిఎఫ్‌కు ముందు యశ్ ఎవరన్న వ్యాఖ్యలపై యశ్ తల్లి మాట్లాడుతూ.. కెజిఎఫ్‌కు ముందు యశ్‌కు వరుసగా ఐదు హిట్స్ వున్నాయని.. మీరనుకున్నట్టు... యశ్ గుర్తిపులేనివాడు కాదని ఇప్పుడెందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
యశ్ తల్లి వ్యాఖ్యలు కన్నడనాటే కాదు.. పాన్ ఇండియావైడ్ వైరల్‌గా మారాయి. తన కొడుకేమీ ఉగ్రవాది కాదని.. అతని ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతురన్నారని ఘాటుగా స్పందించింది. ఒక బస్ డ్రైవర్ కొడుకు ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడని ఒక తల్లిగా అతడిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. యశ్ తల్లి ఎవరి పేరునూ ప్రస్థావించకపోయినా.. గతంలో ఈ కామెంట్స్ చేసింది అల్లు అరవింద్ కావడంతో.. అందరూ ఆయన్ని వుద్దేశించే పుష్ప కౌంటర్ ఇచ్చారన్న కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మొత్తానికి అల్లు అరవింద్ టార్గెట్ కావడంతో.. అల్లు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. అల్లు అరవింద్ యశ్‌ను ఎందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాడో చూడకుండా.. 'కెజిఎఫ్ ముందు యశ్ ఎవరన్న' మాటనే ఎందుకు పట్టుకున్నారు?
టాక్సిక్ డిజాస్టర్ ఫస్ట్రేషన్ నుంచి బైటకొచ్చి కామ్‌గా ఆలోచించాలంటూ.. అల్లు సైన్యం ఫైర్ అవుతోంది.ఈమధ్యకాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై టాక్సిక్ లాంటి డిజాస్టర్ రాలేదు. సినిమాను వరల్డ్‌వైడ్ 450 కోట్లకు అమ్మితే..250 కోట్ల షేర్ కలెక్ట్ చేయలేకపోయింది. ఇలాంటి కథ ఓకె చేసిన యశ్.. తీసిన గీతూ మోహన్‌దాస్‌ను వదిలేసి.. అల్లు అరవింద్ మీద పడడంతో.. అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టాక్సిక్‌పై ఎదురుదాడికిదిగింది.టాక్సిక్ డిజాస్టర్ అని తెలిసినా.. కన్నడ స్టార్స్ మాత్రం.. యశ్‌కు అండగా నిలిచారు. యశ్ కన్నడ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని రిషబ్ శెట్టి ప్రశంసించాడు. కెజిఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రొటీన్ ఫార్ములాను సెలెక్ట్ చేసుకోకుండా.. ఎక్స్పెరిమెంట్ చేయడం గొప్ప విషయమని.. ఇందుకు ఎంతో ధైర్యం కావాలని సుదీప్ యశ్‌ను మెచ్చుకున్నాడు. 'టాక్సిక్' ఒక సరికొత్త ప్రపంచమని.. నటీనటులు..టెక్నీషియన్స్ కష్టాన్ని అభినందించాడు ఉపేంద్ర.తెలుగులో స్టార్ మూవీ హిట్టయినా.. ఫ్లాప్ అయినా.. ఒకరిని మరొకరు పట్టించు కోరు కన్నడ స్టార్స్ మాత్రం కష్ట సమయంలో ఎస్ కి అండగా నిలిచారు.