కొరియా కుర్రాడు కావాలి.!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న కథానాయికలలో రితికా నాయక్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ, మోడలింగ్ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు

Post Published By: dialnews
Updated : 13 August 2026, 4:06 PM IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న కథానాయికలలో రితికా నాయక్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ, మోడలింగ్ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. వరుస విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్న రితికా, ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
2022లో వచ్చిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ద్వారా రితికా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' చిత్రంలో ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు.

2025లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ 'మిరాయ్' లో 'విభా' అనే పాత్రలో నటించి ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకని, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రంలో రితికా 'చైత్ర' అనే కీలక పాత్రలో కనిపించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది.సినిమాకు బాక్సాఫీస్ వద్ద లభించిన విశేష స్పందనతో రితికా ఖాతాలో మరో హిట్ చేరినట్లయింది. బ్యాక్-టు-బ్యాక్ విజయాలు సాధిస్తుండటంతో అభిమానులు మరియు సినీ వర్గాలు ఆమెను 'గోల్డెన్ లెగ్' అని కొనియాడుతున్నారు. 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రమోషన్లలో భాగంగా రితికా నాయక్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ ఆమెను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు: "మీ మొబైల్ ఫోన్ వాల్‌పేపర్‌గా ఎవరి ఫోటో ఉంటుంది?"

దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రితికా వెంటనే తన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను కెమెరా ముందే చూపించారు. అందులో ప్రపంచ ప్రఖ్యాత దక్షిణ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS గ్రూప్ ఫోటో కనిపించడంతో ఇంటర్వ్యూలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాను బిటిఎస్ కి ఎంత పెద్ద అభిమానినో ఈ సంఘటనతో స్పష్టమైంది.సంగీత ప్రియులకు ప్రపంచవ్యాప్తంగా BTS గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ "BTS బ్యాండ్‌లో మీ ఫేవరెట్ మెంబర్ ఎవరు?" అని అడగ్గా, రితికా క్షణం కూడా ఆలోచించకుండా 'సుగా' పేరు చెప్పారు. ఒకవేళ సుగాను నేరుగా కలిసే అవకాశం వస్తే ఏం చేస్తారు?" అని ప్రశ్నించగా, రితికా తీవ్ర ఉద్వేగానికి, ఎగ్జైట్‌మెంట్‌కు లోనయ్యారు.

నవ్వుతూ స్పందిస్తూ— "సుగాను చూస్తే నేను ఎక్కువగా మాట్లాడలేనేమో! అతని వైపే చూస్తూ ఉండిపోతాను. 'హాయ్.. ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు' అని మాత్రమే చెబుతాను" అని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇండియాలోకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, వారి కోసం తాను కూడా సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ పేజీలను ఫాలో అవుతున్నానని వెల్లడించారు. ఏదో ఒక రోజు BTS తప్పకుండా ఇండియాకు వస్తుందని, వారు వస్తే భారతీయ అభిమానులకు అది అతిపెద్ద పండగ లాంటిదని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కొరియన్ బ్యాండ్ భారత్‌లో పర్యటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ రితికా నాయక్ BTS పై చేసిన ఈ వ్యాఖ్యలు, ఫోన్ వాల్‌పేపర్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Published : 
  • 13 August 2026, 4:06 PM IST