పుష్ప రాజ్‌ ఇమేజ్‌ పోవాలంటే..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి దృష్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలపైనే ఉంది. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో సృష్టించిన ఇంపాక్ట్, సాధించిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Post Published By: dialnews
Updated : 14 August 2026, 8:15 PM IST

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి దృష్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలపైనే ఉంది. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో సృష్టించిన ఇంపాక్ట్, సాధించిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప రాజ్’గా ఆయన చూపించిన మేనరిజమ్‌లు, విలక్షణమైన నటన ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసాయి.అయితే, అంతటి బలమైన ‘పుష్ప రాజ్’ ఇమేజ్ నుంచి ప్రేక్షకులను బయటకు తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. కానీ, ఇప్పుడు తమిళ అగ్ర దర్శకుడు అట్లీ ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.

దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌కు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టే మిషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాతో 'పుష్ప రాజ్' మాస్ లుక్ అండ్ మేనరిజమ్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేసి, బన్నీని మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారట. ‘రాకా’ చిత్రాన్ని ఒక బిగ్ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా అట్లీ రూపొందిస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ ఒక డివైన్ వారియర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.అట్లీ తీయబోయే ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ వండర్, అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద బెంచ్‌మార్క్‌గా నిలవనుందని అంచనా వేస్తున్నారు. 'పుష్ప'తో సాధించిన గ్లోబల్ మేజిక్‌ను మించి ఈ సినిమా విజయం సాధిస్తుందేమో వేచి చూడాలి.

Published : 
  • 14 August 2026, 8:15 PM IST