మోసపోయారు.. మనసు మార్చుకున్నారు…!

నటసింహం బాలయ్య తన కెరీర్ లో ఎన్నడూ మోసపోనంతగా, ఎవ్వరూ తనని మోసం చేయనంతగా బోయపాటి మోసం చేశాడు.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 7:45 PM IST

నటసింహం బాలయ్య తన కెరీర్ లో ఎన్నడూ మోసపోనంతగా, ఎవ్వరూ తనని మోసం చేయనంతగా బోయపాటి మోసం చేశాడు. కావాలని చేయకున్నా, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కథ వినకుండా బోయపాటి ఏం చెబితే అది చేస్తా అనే, బాలయ్య కూడా గుడ్డిగా నమ్మ తప్పు చేశాడా? అచ్చంగా ఎన్టీఆర్ ఎలాగైతే మొన్నామధ్య వార్ 2 తో మోసపోయాడో, అఖండ 2 తో బాలయ్య అలానే మోసపోయాడన్నారు. కాకపోతే బాలీవుడ్ లో తోపు నిర్మాత అన్న కారణంతో ఎన్టీఆర్, వార్ 2 విషయంలో మోసపోతే, బాలయ్య మాత్రం తన వాడే తనని మోసం చేయడులే అని నమ్మటం వల్ల మోసపోయాడు. ఎవరూ కావాలని మోసం చేయకపోవచ్చు.. కాని కథ విషయంలో, పాత్రల విషయంలో కలిసి రావాల్సిన రెండు ప్రాజెక్టులు ఈ ఇద్దరు స్టార్స్ ని మోసం చేశాయి.. అందుకే ఈ ఇద్దరిలో ఒకరు షారుక్ కి గుడ్ బై చెబితే, ఇంకొకరు సూపర్ స్టార్ రజినీకాంత్ కి టాటా బైబై చెప్పారు... మంచి ఆఫరే అయినా, కొన్ని మోసాలు, ఇంకొన్ని సార్లు మనసు మారుస్తాయా? చూస్తే అదే అనిపిస్తోంది.. అదేంటో చూసేయండి...

నటసింహం బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటేనే సెన్సేషన్.. బాలయ్యకి బోయపాటి అంటే ఎంత గురి అంటే, కథ వినకుండా సినిమా ఓకే చేసేస్తాడు. ఇప్పుడా నమ్మకమే కొంపముంచింది. 1000 కోట్ల రేంజ్ టచ్ చేసే అంచనాలు అఖండ 2 సొంతం.. కాని కథే లేకుండా, ఏవేవో సీన్లతో నింపి బోయపాటి నిజంగా బాలయ్య నమ్మకం మీద దెబ్బతీశాడన్నారు..అఖండ 2 వచ్చి వెళ్లిపోయినా ఇన్నాళ్లు ఈ మాట తూటాలు, సోషల్ మీడియాలో ఫ్రెష్ గా పేలటానికి రీజన్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ. తను నెల్సన్ దిలీప్ మేకింగ్ లో చేస్తున్న జైలర్ సీక్వెల్ జైలర్ 2 లో నటించేందుకు ఒప్పుకున్నాడని ఆమధ్య ప్రచారం జరిగింది. డైరెక్టర్ అయితే బాలయ్య సీన్ లో కి వస్తే, ఆ ఇంటెన్సిటే వేరన్నాడు... కట్ చేస్తు ఇప్పడు నటసింహం మాత్రం జైలర్ 2 మూవీలో నటించట్లేదని తెలస్తోంది. ఆ ఆఫర్ ని పక్కన పెట్టేశాడనే మాటే వినిపిస్తోంది

రజినీకాంత్ కాల్ చేశాడని కథ విన్న బాలయ్యకి, కథ నచ్చలేదో, పాత్రే కనెక్ట్ కాలేదో కాని జైలర్ 2 లో గెస్ట్ రోల్ కి నోచెప్పాడు.. ఇదే వార్ 2 మూవీ ని గుర్తు చేస్తోంది. వార్ 2 లో గెస్ట్ రోల్ వేసినందుకు మోసపోయానన్న బాధలో ఉన్న ఎన్టీఆర్ కూడా ఇలానే, పటాన్2 మూవీ ఆఫర్ ని వద్దన్నాడు. షారుఖ్ సినిమాలో గెస్ట్ రోల్ వేసేందుకు సింపుల్ గా నో చెప్పాడు..ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, జైలర్ 2 లో రజినీతో కలిసి నటించేందుకు బాలయ్య నో చెప్పడం, తన ప్లేస్ లో షారుఖ్ ఖాన్ వస్తాడనే ప్రచారం మొదలవ్వటం జరిగాయి. అలానే అదే షారుఖ్ చేసే పటాన్ 2 లో ఎన్టీఆర్ నటించాల్సి ఉన్నా, తను హిందీ దర్శకుల మీద నమ్మకం లేక నో చెప్పటం జరిగాయి. ఇలా బాబాయ్, అబ్బాయ్ కొత్త నిర్ణయాల్లో పరోక్షంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పేరు రీసౌండ్ చేస్తోంది..

ఏదేమైనా వార్ 2 విషయంలో కూడా ఏదో బాలీవుడ్ లో పెద్ద బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ అని, అక్కడ తోపు నిర్మాత కాబట్టి ఆదిత్య చోప్రా మాటనమ్మి, వార్ 2 మూవీ చేశాడు ఎన్టీఆర్. ఏమైంది, వీక్ స్టోరీ, అంతకంటే వీక్ మేకర్ వల్ల సినిమా మునిగింది... నిజానికి ఏమాత్రం కథ బాగున్నా, ఇటు ఎన్టీఆర్, అటు హ్రితిక్ కాంబినేషన్ అంటే సెన్సేషన్ అవ్వాలి... సో గోల్డెన్ ఆపర్చినుటీనీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు వేస్ట్ చేశారు.బోయపాటి శీను కూడా అతి దర్శకత్వం, వీక్ స్టోరీతో, ఏదో అతుకుల బొంతలా, హిందుత్వాన్ని, చైనా, పాక్ ఇష్యూస్ ని, మధ్యలో మాయలు మాంత్రకుల అంశాన్ని అనవసరంగా నాగ సాధువు కాన్సెప్ట్ కి కనెక్ట్ చేశాడు. అసలు కథే వినాల్సిన పనిలేదనేంతగా తనని బాలయ్య నమ్మితే, నిండా ముంచేశాడు... అందుకే బాలయ్య ఇప్పుడు దర్శకులని బ్లైండ్ గా నమ్మే పరిస్థితిలేదు.. అందుకే జైలర్ 2 ని ఒప్పుకున్నా కూడా కథ విన్నాక నో చెప్పాడు. వార్ 2 పంచ్ పడ్డాక ఎన్టీఆర్ కూడా పటాన్ సీక్వెల్ కి నో చెప్పాడు.. ఏదేమైనా అఖండ 2 ఏమాత్ర కథ బాగున్నా 1000 కోట్ల రేంజ్ టచ్ అయ్యేది.. అదే మిస్ అయ్యింది.. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ ఆచితూచి అడుగులేస్తూ, కథ విని, దర్శకులని బ్లైండ్ గా నమ్మే పరిస్థితులనుంచి బయటికొచ్చినట్టే కనిపిస్తోంది.

Published : 
  • 3 February 2026, 7:45 PM IST