100 కోట్ల డైరెక్టర్.. భయంకరమైన ఊచకోత..?

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం బాలయ్య కత్తి పడితే, సమర సింహా రెడ్డి.. కత్తి తిప్పితే నరసింహ నాయుడు..అప్పట్లో ఆ ఊచకోతకి బాక్సాఫీస్ షేక్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 4 February 2026, 5:00 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం బాలయ్య కత్తి పడితే, సమర సింహా రెడ్డి.. కత్తి తిప్పితే నరసింహ నాయుడు..అప్పట్లో ఆ ఊచకోతకి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పడు కనీ విని ఎరుగని రీతిలో రప్పా రప్పా రక్త పాతానికి బాలయ్య సిద్దమయ్యాడా? మలయాళంలో 100 కోట్ల సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ ఇప్పడు బాలయ్య కోసం రంగంలోకి దిగాడు. తనని సందీప్ రెడ్డి వంగకంటే కూడా భయంకరమైన రక్త పాతం చూపించే దర్శకుడంటారు.. నిజానికి ఈమధ్య వచ్చిన ధురంధర్ లోకూడా వెన్ననులో వనుకు పుట్టించేంత వయోలెన్స్ ఉంది. కాకపోతే టెర్రర్ మీద మనోళ్ల ఆపరేషన్ కాబట్టి, ఆ వయోలెన్స్ కి జెస్టిఫికేషన్ దక్కింది. ఐతే అంతుకుమించిన వయోలెన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన మలయాళ మాంత్రికుడి చేతిలోకి బాలయ్య సినిమా వెల్లిందా? చాలా కాలం తర్వాత బాలయ్య ఊహాతీతమైన, రియలిస్టిక్ రక్తపాతం వెండితెరమీద మళ్ళీ కనిపించబోతోందా?

నటసింహం బాలయ్య అఖండ లెవల్లో అఖండ 2 ఆడితే, 1000 కోట్ల సునామీ వచ్చేది. కాని బోయపాటి పెన్ను పనిచేయలేదో, తను కథ మీద కంటే, ఫైట్లమీదే ఫోకస్ పెట్టాడో కాని, పాన్ ఇండియాను షేక్ చేసే గోల్డెన్ ఆపర్చునుటి ని మిస్ చేసుకున్నాడు. బాలయ్యని కూడాఓరకంగా మోసం చేసిన వాడిగా బోయపాటి తన క్రెడిబిలిటినీ డైలామాలో పడేశాడు.ఏదేమైనా బోయపాటిలు, సందీప్ రెడ్డి వంగలను మించే వయెలోన్స్ ని వందకోట్ల దర్శకుడు బాలయ్య సినిమాలో నింపేయబోతున్నాడు. తలలు ఎగిరిపోవటం, చేతులు, కాల్లు, వేల్లు ఇలా అన్నీ నరియేటం, రక్తంలో హీరో మొత్తం మునిగిపోవటం.. ఓరకంగా చెప్పాలంటే యానిమల్ లో కూడా సందీప్ రెడ్డి వంగ ఈ స్థాయి వయోలెన్స్ ని చూపించలేదు.

ఈమధ్యే 1200 కోట్లు రాబట్టిన ధురందర్ ని కూడా అతి భయంకరమైన సినిమా అన్నారు. కాని అది కూడా ఓ మలయాళ దర్శకుడు తీసిన సినిమా ముందు నథింగ్... అదే మార్కో... మలయాళంలో విడుదలై 100 కోట్లు రాబట్టిన మార్కో మూవీ ని మించే సినిమా టాలీవుడ్ లో రెడీ అయ్యేలా ఉంది. దాని పనులే మొదలైనట్టు కనిపిస్తున్నాయి.మొన్నటి వరకు ఇది సాధ్యం కాదన్నట్టుగానే ప్రచారం జరిగింది. కాని దిల్ రాజు మొత్తానికి అనుకున్నది సాధించేలా ఉన్నాడు.మార్కో దర్శకుడు హనీఫ్ మేకింగ్ లో బాలయ్య సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య ప్రాజెక్ట్ నడుస్తోంది. దాని తర్వాతే మార్కో మేకర్ హనీఫ్ మేకింగ్ లో బాలయ్య ఊచకోత మొదలౌతుంది.

ఇది ప్యూర్ రివేంజ్ డ్రామాగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బేసిగ్గా రివేంజ్ డ్రామా అంటేనే, రక్తపాతానికి అవకాశం ఎక్కువ.. ఐతే మార్కోలోనే బ్లడ్ బాత్ చూపించిన డైరెక్టర్ హనీష్, బాలయ్య లాంటి గాడ్ ఆఫ్ మాసెస్ దొరికితే, యాక్షన్ ఎమోషన్ స్కేలే మారిపోతుంది. సో వచ్చే ఏడాది యానిమల్, ధురందర్ ని మించే రక్త పాతం పాన్ ఇండియా లెవల్లో నటసింహం మూవీలో రీసౌండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 
  • 4 February 2026, 5:00 PM IST