దేవరకి సీక్వెల్ ఉంటుంది.. ఉండదు.. ఉంటుంది కాని కాస్త లేటుగా.. కాదు కాదు వచ్చేనెల్లోనే మొదలు కాబోతోంది. గత నాలుగు నెలలుగా ఇలాంటి వార్తలే వస్తున్నాయి.. అంతటికీ కారణం, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ వినిపించిన కథలు.. మాటల మాంత్రికుడి వెన్ను పోట్లు. కట్ చేస్తే కొరటాల శివ చేస్తున్న ఏర్పాట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో ఓ ఊపు కనిపిస్తోంది. చాలా పెద్ద అప్ డేట్ ఏదో రెడీ అవుతోంది. డెఫినెట్ గా త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని తేలింది. సందీప్ రెడ్డి సినిమా కూడా కన్ఫామ్ అనే తెలుస్తోంది. కాకపోతే వాటి కోసం దేవర సీక్వెల్ ని వాయిదా వేసే పరిస్తితే లేదని ఆల్ మోస్ట్ కన్ఫామ్ అవుతోంది. కొరటాల శివ చేస్తున్న ఏర్పాట్లే ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి.. దేవరసీక్వెల్ లో ఈసారి సౌత్ ఫ్యాన్స్ కంటే, నార్త్ ఫ్యాన్స్ కోసమే హెవీ సర్ ప్రైజులు ఉండేలా ఉన్నాయట...అవేంటి? సీక్వెల్ షెడ్యూల్స్ ఎప్పుడు ఎలా ఉండబోతున్నాయి.
దేవర 2 ఇప్పడు మొదలౌైతుంది.. అప్పుడు మొదలౌతుందన్న రూమర్లకు గతంలో ఎన్టీఆరే చెక్ పెట్టాడు.. దేవర సీక్వెల్ మొదలౌతుందన్నాడు. కాకపోతే ఈలోపే డ్రాగన్ మొదలవ్వటం,మధ్యలో త్రివిక్రమ్ మూవీ, నెల్సన్ దిలీప్ ప్రాజెక్ట్ తోపాటు సందీప్ రెడ్డి వంగ కూడా రావటంతో, లెక్కలు మారుతూ వచ్చాయి. ఏదేమైనా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సంగతి ఎలా ఉన్నా...కొరటాల శివకి టైం వచ్చినట్టుంది. దేవర2 ప్రీ ప్రొడక్షన్ పనులవ్వటం కాదు, ఏకంగా సెట్ వర్కే జరుగుతోంది. ముందుగా ఈసినిమా కోసం 18 సెట్ల మినియేచర్లు..అంటే ఒక టేబుల్ మీద చిన్న నగరాల సైజులో సెట్లేసి, సినిమాటోగ్రాఫర్, గ్రాఫిక్స్ సూపర్ వైజర్ తో షూటింగ్ కి పేపర్ మీదే ప్లాన్ రెడీ చేయటం.. ఇదే జరుగుతోంది.ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అప్రూవల్ లేకుండా కొరటాల శివ ఇలా స్టెప్ తీసుకోడు..
మినియేచర్ తో 18 సెట్లేసినా కనీసం కోటి పైనే ఖర్చుంటుంది.. అంటే డెఫినెట్ గా దేవర 2 కి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అనితెలుస్తోంది. లేదంటే కోట్లు పెట్టి డమ్మీ సెట్ల ప్రాక్టీస్ అనేది జరగదు... దసరా వరకు డ్రాగన్ ఆతర్వాత నవంబర్ నుంచి దేవర సీక్వెల్ అని ఎప్పుడో అన్నారు. కాని ఇప్పుడు ఎందుకో లెక్కలు మారినట్టే ఉన్నాయి.డ్రాగన్ రెండు భాగాలని ఒకేసారి తీసి, ఆతర్వాత దేవర 2, త్రివిక్రమ్ మూవీ ఒకేసారి పట్టాలెక్కించాలనుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈలోపు ఎన్టీఆర్ మనసు మారిందో.. లేదంటే ప్లాన్ మార్చాల్సి వచ్చిందో కాని, మోస్ట్ లీ జూన్ నుంచి దేవర 2 కి రూట్ క్లియర్ అయ్యేలా ఉంది.
ఎందుకంటే, జూన్ ఎండ్ లోగా డ్రాగన్ మొదటి పార్ట్ పూర్తౌతుంది.. డ్రాగన్ సెకండ్ పార్ట్ దసరాలోపు పూర్తి చేస్తూనే, ప్యార్ లల్ గా దేవర 2 ని షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.కారణం డ్రాగన్ సెకండ్ పార్ట్, దేవర సీక్వెల్ రెండీట్లో ఎన్టీఆర్ లుక్ పరంగా ఎక్కువ వేరియేషన్ లేకపోవటంతో, చిన్న మార్పులతో కూడా ఒకేసారి రెండు సెట్ల మధ్య ఎన్టీఆర్ చక్కర్లు కొట్టొచ్చు.. రెండీంటి కోసం డేట్లు కేటాయించొచ్చు.. అందుకే రెండీంట్లో లుక్స్ పరంగా మార్పులేని, గ్రాఫిక్స్ బాగా అవసరమైన సీన్లు జూన్ నుంచి మొదలౌతాయని తెలుస్తోంది. అందుకే కొరటాల శివలో ఊపొచ్చింది. తన టీం సెట్ల పనులను, మినియేచర్ రూపంలో టేబుల్ మీద మొదలుపెట్టింది.