డ్రాగన్ టీం అర్జెంట్ గా డ్రాగన్ మూవీ అప్ డేట్ ఇచ్చితీరాల్సిందే...మే 20కి ఎన్నిరోజుల టైం లేదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా విషయాల్లో కోపంగా ఉన్నారు.. టైటిల్ విషయంలో క్లారిటీ లేదు.. అది మారుతుందని నిర్మత అనటం, ఎన్టీఆర్ బర్త్ డేకి టీజర్ రాదని ఫీలర్స్ పెరిగటం తోపాటు... గత రెండు నెలలుగా కథమారిందన్న పుకార్లు పెరిగాయి. రీషూట్లు, రిపేర్లు ఇలా చాలా విషయాల్లో డ్రాగన్ మీద పుకార్ల దాడి పెరిగింది. పెరుగుతూనే ఉంది. అందుకే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పని పడింది.. డ్రాగన్ దర్శక నిర్మాతలు ఈ విషయంలో ఏదో ట్వీట్లు, లేదంటే పోస్టర్ల లాంచ్ తో సరిపెడితే ఫ్యాన్స్ఊరుకునేలా లేవు. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఎప్పుడు? గ్లింప్స్ ఇంకెప్పుడు? లాంటి హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియా మీద దాడి పెంచేశారు... మరి డ్రాగన్ టీం చాలా పుకార్లకు మే 20న ఆన్సర్ ఇస్తుందా? వాటికి బ్రేక్ వేస్తుందా?
డ్రాగన్ మీద ప్రెజర్ ఇప్పుడు రోజురోజుకి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికే తప్ప, ఈలోపు డ్రాగన్ రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. అలా చూస్తే డ్రాగన్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ పెరగటంలో అర్ధం లేదు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే.. కాబట్టి ఆరోజు డ్రాగన్ టీం ఏ కారణం చెప్పి తప్పించుకోలేదు.. టీజరో, సాంగో, మోషన్ వీడియోనో ఏదో ఒకటి వదలాల్సిందే.కేవలం పోస్టర్ రిలీజ్ చేస్తే సరిపోదు.. ఒకవేల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి సరిపెట్టుకుందామంటే, రిలీజ్ డేట్ పక్కగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రెజర్ మామూలుగా ఉండదు.. ఆల్ మోస్ట్ యాష్ ట్యాగ్ వార్ మొదలౌతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తట్టుకోలేని పరిస్థితి.. అంత ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కాబట్టే, పాన్ ఇండియా లెవల్లో దేవర దుమ్ముదులిపింది.
అది కూడా రాజమౌళి సాయం లేకుండా... అయితే ఇప్పటికిప్పుడు డ్రాగన్ టీం తేల్చాల్సినవి ఏమైనా ఉన్నాయంటే పుకార్లే.. వాటికి అర్జెంట్ గా బ్రేక్ వేయాలి.. ముందుఅసలు టైటిల్ ఏంటో చెప్పాలి... డ్రాగన్ వర్కింగ్ టైటిలే తప్ప అసలు టైటిల్ వేరే ఉందని నిర్మాత అన్నాడు..అదేంటో కనీసం ఎన్టీఆర్ బర్త్ డే రోజైనాతేల్చాలి... ఇక రిలీజ్ డేట్ మాటి మాటికి వాయిదా పడటానికి రీజన్ తేల్చాలి.ఎందుకంటే, ఎన్టీఆర్ కి కథ నచ్చలేదని, అందుకే స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయని పుకార్లొచ్చాయి... అవి నిజాలా, కాదంటే కాదని క్లారిటీ ఇవ్వాలి... ఈమధ్య షూటింగ్ ఆగిపోయిందన్న పుకారొస్తే, అవి పుకార్లని ఫిల్మ్ టీం తేల్చింది. అంతవరకు బానే ఉంది. కాని ఈ మూవీ కథ రెండు భాగాలుగా తీస్తున్నారన్న పుకార్లు వస్తున్నాయి.. ఇదేకాదు డ్రాగన్ లో హీరో డ్యూయెల్ రోల్ వేస్తున్నాడని పుకార్లొచ్చాయి.
అవి నిజాలా? ఇందులో ఏది నిజం? రెండు భాగాలుగా మూవీ వస్తే, ఒకటి తీశాక, రిలీజ్ చేసి మరొకటి తీస్తారా? లాంటివి తేలాలి..దీనికి తోడు షాహిద్ కపూర్, ఆలియా స్పెషల్ రోల్స్ వేస్తున్నారన్న పుకార్లు పెరిగాయి. బ్రూస్లీని బేస్ చేసుకుని హీరో పాత్ర డిజైన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ మరీ అంత బక్కచిక్కేంతగా ఎంతుకు తన లుక్ ని ఇంతగా మార్చారు? రెండు పాత్రలేస్తున్నాడా? లేదంటే రెండు గెటప్సా? ఇలా చాలా విషయాలకు సమాధానం దొరకాలి.. ఇందులో టైటిల్, రిలీజ్ డేట్, హీరో పాత్ర మీద వస్తున్న పుకార్లకు ఫిల్మ్ టీం బ్రేక్ వేయాలి.. అది కూడా మే 20 లోపే... లేదంటే ఫ్యాన్స్ నుంచి ఫిల్మ్ మేకర్స్ కి సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ వార్ మొదలౌతుంది.. ఆల్రెడీ ప్రెజర్ మొదలైంది.