DRAGON”పాయింట్ బ్లాంక్ లో GUN.. ఆన్సర్ ప్లీజ్..?

డ్రాగన్ టీం ఇప్పుడు ఊహించనంత ప్రెజర్ లోఉంది. మరింత ప్రెజర్ ని డ్రాగన్ టీం ఫేస్ చేయాల్సి వస్తోంది. అంతటికీ కారణం యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ తో పుకార్లే నిజాలనేంతగా ప్రచారం ఊపందుకోవటం.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 10:15 PM IST

డ్రాగన్ టీం ఇప్పుడు ఊహించనంత ప్రెజర్ లోఉంది. మరింత ప్రెజర్ ని డ్రాగన్ టీం ఫేస్ చేయాల్సి వస్తోంది. అంతటికీ కారణం యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ తో పుకార్లే నిజాలనేంతగా ప్రచారం ఊపందుకోవటం. డ్రాగన్ ఆగిపోయిందన్న మాట, ఒక్కో వారం ఒక్కో వార్తలా మారి వైరలౌతోంది. ఇది నిజమా? కావాలని చేస్తున్నారా? నిజంగానే డ్రాగన్ టీం కన్ ఫ్యూజన్ లో ఉందా? లాంటి ఎన్నో డౌట్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పెరిగిపోయాయి. అందుకు మలయాల స్టార్ టొవినో థామస్ కూడా ఒక కారణమే... తను ఈ మూవీనుంచి ఎందుకు తప్పుకున్నాడో సాఫ్ట్ గా చెప్పాడు కాని, ఇంతవరకు ఫిల్మ్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. హీరోయిన్ విషయంలో కూడా ఆలియా పేరు కొత్తగా యాడ్ అవటం మీదా ఎలాంటి క్లారిటీ రావట్లేదు. రిలీజ్ డేట్ 2027 సంక్రాంతి కాదుకదా, కనీసం వచ్చే ఏడాది దసరా, దీపావలికి కూడా ఛాన్స్ లేదంటున్నారు... అంటే మొదలైన మూడేళ్ల వరకు ఈమూవీ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదా? అసలేం జరుగుతోంది? ఇవి పుకార్లా? ప్రచారాలతో పెరిగిన బ్రమలా?

డ్రాగన్ టీం కన్ ఫ్యూజన్ లో ఉందా? కన్ ఫ్యూజ్ చేస్తోందా?యాంటీ ఫ్యాన్స్ నెగెటీవ్ వార్తలకే సోషల్ మీడియా ఎఫెక్ట్ అవుతోందా? ఈ మూడు ప్రశ్నలు డ్రాగన్ టీంకి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినట్టు ఎదురౌతున్న ఇబ్బందులు. నిజానికి డ్రాగన్ మూవీ షూటింగ్ మొదలై ఏడాదిన్నరౌతోంది. అందుకే కథ లో మార్పులు, రీషూట్లు, రిపేర్ల మీద వస్తున్న రూమర్స్ నిజమేమో అన్న డౌట్లు ఫ్యాన్స్ లోకూడా పెరిగుతున్నాయి.ఎందుకంటే ఆరునెల్లుగా ఇవే రూమర్స్ వస్తున్నాయి.. కాని డ్రాగన్ టీం నుంచి అప్ డేట్స్ లేవు.. మరి ఇదే ఛాన్స్ అని యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి, ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అంటే, అది కూడా అయ్యుండొచ్చు.. కాని రూమర్లు కూడా నిజమేనేమో అనిపించేలానే డ్రాగన్ టీం సైలెన్స్ కూడా ఫ్యాన్స్ నికంగారు పెట్టిస్తోంది. అందుకే డ్రాగన్ టీం అర్జెంట్గా కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ముందుగా, ఇందులో షాహిద్ కపూర్ విలన్ అంటూ ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా? ఎందుకంటే తనని ఓ ఐరన్ లెగ్ అనంటున్నారు. తనెక్కడ అడుగుపెడితే అక్కడ మూవీ మటాష్... దీనికి తోడు ఆలియా ఇందులో హీరోయిన్ అంటే, మరి రుక్మినీ వసంత ఇందులో మేయిన్ లీడ్ కాదా? ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కాదు కదా, ఈ దసరా దాటి, వచ్చే దసరా దాటీ, దీపావలికి కూడా రిలీజ్ కాదంటున్నారు.మరో ఏడాదిన్నరైతే తప్ప రిలీజ్ కాదంటే, ఈ క్రిస్మస్ కాకుండా వచ్చే క్రిస్మస్ కే డ్రాగన్ రాక అంటే, ఫ్యాన్స్ లో బ్లడ్ ప్రెజర్ బౌండరీస్ దాటొచ్చు. ఇది కాకుండా మలయాల స్టార్ టొవినో థామస్ ఎందుకు ఈమూవీనుంచి వెళ్లిపోయాడు.. విలన్ రోల్ వేయాల్సిన తను, మిగతా కమిట్మెంట్స్ వల్లే టైం కేటాయించేలకపోతున్నా అన్నాడు. కాని రియాలిటీ చూస్తే, అనుకున్న టైం కి కాకుండా, డ్రాగన్ షూటింగ్ డిలే అవటం,.. కథలో మార్పులు, రీషూట్లు, రిపేర్లు వీటికి భయపడే టొవినో థామస్ వెనక్కి తగ్గాడా?

ముందు కమిటై ఇప్పుడు ఉన్న పలంగా టొవినో థామస్ విలన్ రోల్ నుంచి పక్కకు తప్పుకోవటానికి రీజన్, బయట వినిపిస్తున్న కథమార్పులు, షూటింగ్ షెడ్యూల్ లో కన్ఫ్యూజన్సే కారణమా? ఇలాంటి డౌట్లు ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉన్నాయి. సో వీటికి క్లారిటీ ఇస్తూనే రిలిజ్ డేట్ ని తేల్చకపోతే, ఆ విషయం ఎన్టీఆర్ బర్త్ డే ఎనౌన్స్ మెంట్ లో ఉండకపోతే, మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ ఫైర్ మొదలయ్యేలా ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అగ్రెసివ్ గా, ఫిల్మ్ మేకర్స్ మీద మీమ్స్, ట్వీట్స్ దాడి పెంచారు.. ఇంకా పెంచేలా ఉన్నారు.

Published : 
  • 17 April 2026, 10:15 PM IST