మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ నిజానికి ఈ నెల్లో వచ్చి ఉండాలి.. లేదంటే జూన్ నెలలో రాబోతోందని ప్రచారం మొదలవ్వాలి... కాని అలా జరగలేదు. ఈ జూన్ కాకుండా, వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ వస్తుందని ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేయాల్సి వచ్చింది. అసలెందుకు 365 రోజుల తర్వాత కాని ఈ సినిమా రాదని తేల్చారు? ఎప్పుడో ఏడాదిన్నర క్రితం మొదలైన షూటింగ్ ఇంకా ఈ సినిమాను ఒక కొలిక్కి తీసుకురాలేదా? కొంత షూటింగ్ అయ్యాక ఎన్టీఆర్ సన్నబడ్డాడు.. కట్ చేస్తే ఇప్పుడేమో కండలు పెంచుతున్నాడు. అంతా తను వేస్తున్న రెండు పాత్రలకోసమే అన్నారు. ఈ వార్తలు నిజమే అనిపించేలా ఉన్నాయి.. కథ లోపాలు, షూటింగ్ రిపేర్ల మీదొస్తున్న రూమర్లు నిజమేమో అన్నంతగా ఇంటర్నెట్ ని కుదిపేస్తున్నాయి.. ఇంతకి ఇందులో ఏది నిజం? రెండవ డ్రాగన్ వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్ 365 రోజుల తర్వాతకు మార్చాల్సివచ్చిందా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే, కేజీయఫ్, త్రిబుల్ ఆర్ సెన్సేషన్ అన్నారు. కానిఈ మాట అనే ఏడాదిన్నర దాటింది. కట్ చేస్తే 40శాతం షూటింగ్ మాత్రమే పూర్తైంది. ఐనా ఈ జూన్ కాదు, అసలు ఈ దసరా కూడా కాదు, కనీసం వచ్చే సంక్రాంతికి కూడా కాకుండా, 2027 జూన్ కి డ్రాగన్ రిలీజ్ ప్లాన్ చేయాల్సి వస్తోంది. ఇదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా కంగారు పెట్టిస్తోంది.కనీసం రిలీజ్ డేట్ వాయిదా పడ్డా, ఒక డేట్ మాత్రం కన్పామ్ అయ్యిందని సంతోషపడాలో, బయట వినిపిస్తున్న రూమర్స్ ఎక్కడ నిజం అవుతాయేమోనని కంగారు పడాలో తెలియని పరిస్తితుల్లో ఉన్నారు ఫ్యాన్స్ . రియాలిటి చెక్ చేస్తే, నిజంగానే డ్రాగన్ మొదలై ఏడాదిన్నరౌతోంది. గతంలో ఎనౌన్స్ చేసిందాని ప్రకారం చూస్తే ఏప్రిల్ లో మూవీ రిలీజ్ అవ్వాలి.. లేదంటే కనీసం జూన్ కి రిలీజ్ వాయిదా అన్న మాట ప్రకారం, రాబోయే జూన్ లో రిలీజ్ ప్లాన్ చేయాలి.
అలా కాకుండా ఏకంగా ఏడాది వాయిదా వేశారు. వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ రిలీజ్ అంటున్నారు. కాబట్టే కథ మారి ఉంటుంది. షూటింగ్ చేసిన ఫుటేజ్ కి రిపేర్లు జరుగుతున్నాయనే మాటే నిజమైఉంటుందనే మాటే వినిపిస్తోంది. కాని రియాలిటీ చెక్ చేస్తే, నిజం మాత్రం రెండోవ డ్రాగనే అని తేలుతోంది. ఔను ఇది రెండు భాగాలుగా వస్తోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.ఐతే, ఒకే మూవీలో రెండు డ్రాగన్స్ ని ఎన్టీఆర్ కనిపించటం మంచి ట్విస్టే కాని, అదుర్స్ నుంచి దేవర వరకు రెండు పాత్రలంటే, హీరో లుక్ కి చిన్న మార్పులే కనిపించేవి.. కాని డ్రాగన్ కి అలా కాదు... పాన్ ఆసియా, పాన్ వరల్డ్ సినిమా గా ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. సో వరల్డ్ ఆడియన్స్ కి డ్రాగన్ నచ్చాలంటే, అన్నీ నెక్ట్స్ లెవల్ లోనే ఉండాలి.అందుకే రెండు పాత్రల లుక్ కోసం ఎన్టీఆర్ నిజంగా చాలా త్యాగాలు చేసినట్టు తెలుస్తోంది.
డ్రాగన్ మూవీలో ఒక పాత్రకోసం 14 కిలోల వేయిట్ తగ్గి బక్క చిక్కిన ఎన్టీఆర్, అలా తగ్గేందుకు మూడేనెల్లు కష్టపడ్డాు. ఇప్పడు రెండో పాత్రకోసం మజిల్స్ పెంచుతున్నాడు. సో ఆ పాత్రకోసంమరో రెండు నెల్ల కష్డపడాల్సి వస్తోంది. అంటే హీరో లుక్ కోసమే ఇక్కడ హాఫ్ ఇయర్ గడిచినట్టే... ఇక కథ కూడా ముందు ఒకే భాగం అనుకుని, తర్వాత రెండు భాగాలన్న ప్లాన్ మార్చారు.అందుకే కథని రీ వ్రైట్ చేసి, రెండు భాగాల స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసందుకు మధ్యలో 3 నెల్లకు పైనే బ్రేక్ తీసుకున్నాడు ప్రశాంత్ నీల్... అంటే పాన్ వరల్డ్ లెవల్లో మూవీ రావాలంటే, కథపరంగా, మేకింగ్ పరంగా, ఆఖరికి హీరో లుక్స్ పరంగా అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉండాలి కాబట్టే, ఇంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందట. పర్ఫెక్షన్ వల్లే ఇలా డ్రాగన్ షూటింగ్ టైం పడుతోంది. కాని కథలోపాలు, షూటింగ్ రిపేర్లు అన్న రూమర్లకు అర్దం లేదనే మాటే ఫిల్మ్ టీం నుంచి వినిపిస్తోంది.