మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన డ్రాగన్ మూవీలో ఒకటి కాదు, డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆవిషయంలో ఎలాంటి డౌట్లు లేవని ఫిల్మ్ టీం ఎన్నో సార్లు హింట్లిచ్చింది..ఫీలర్స్ వదిలింది. ఇక్కడ సమస్య ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఈ డబుల్ డోస్ సరిపయేలా లేదా? తాతా, మనవడి కాన్సెప్ట్ తో ఊర మాస్ ఫ్లేవర్ తో, మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ వస్తోందని ప్రచారం జరుగుతోంది. కంటెంట్ ఏదైనా అయ్యుండొచ్చు.. జోనర్ ఏమైనా కావొచ్చు.. అయితే డ్యూయెల్ రోల్ ఎన్టీఆర్ కి కొత్త కాదు..తన ఫ్యాన్స్ కి ఇదేం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కాదు.. ఆల్రెడీ ఆంధ్రావాల నుంచి అదుర్స్, జైలవకుశ, దేవర వరకు చాలా సినిమాల్లో ఈ ఫార్ములా వాడారు.. అంటే ఇద్దరు సరిపోవట్లేదని, ముగ్గురు లేదంటే నలుగురు ఎన్టీఆర్స్ ని రంగంలోకి దింపాలా? ఈ ప్రశ్నకి ఆన్సర్ కూడా కానే కాదని వస్తోంది. డ్యూయెల్ రోల్ వేసినా డబుల్ డోస్ మిస్ అవటం వల్లే ఈ సమస్య వచ్చిందా? ఇంతకి డ్రాగన్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు? డబుల్ డోస్ కలిసొచ్చే చాన్స్ ఉన్నా, అది సరిపోదనే మాటకర్ధం ఏంటి?
ఎన్టీఆర్ కి డ్యూయెల్ రోల్ కొత్త కాదు... ఆ ఫార్ములా వాడిన ప్రతీసారి బాక్సాఫీస్ షేక్ అవుతూనే వచ్చింది. కాకపోతే ఫస్ట్ టైం ఈ ప్రయోగం చేసిన ఆంధ్రావాలాలో మాత్రం ఇదే ఫార్ములా కలిసి రాలేదు. కాని అదుర్స్, జైలవకుశ, దేవర అన్నీంట్లో డ్యూయెల్ లేదంటే త్రిబుల్ రోల్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దుమ్ముదులిపాడు. ఇప్పుడు డ్రాగన్ వంతొచ్చింది.కాబట్టే డ్రాగన్ లో డ్యూయెల్ రోల్ అంటే ఐదోసారి, దుమ్ముదులిపేస్తాడనే అంచనాలే కనిపిస్తున్నాయి. కాని ఈ డబుల్ డోస్ చాలదనే మాట కూడా తూటాలా భయపెట్టేలా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో డ్యూయెల్ రోల్ వేసినా, ఒక పాత్రే పేలుతూ వచ్చింది. ఇంకో పాత్ర నామ్ కే వాస్తే అన్నట్టు ఉండేది.. అదుర్స్ లో బ్రహ్మణుడి పాత్రలో ఎన్టీఆర్ పాత్ర పేలింది.
పోలిస్ కావాలనుకునే దొంగ పాత్ర కూడా బాగున్నా, అదుర్స్ హిట్ భారమంతా ఎక్కువగా బ్రాహ్మణుడిగా కనిపించే ఎన్టీఆర్ పాత్రే మోసింది. కట్ చేస్తే జైలవకుశలో కూడా మూడు పాత్రలు వేశాడు ఎన్టీఆర్. ఇందులో కూడా అమాయకుడి పాత్ర పర్లేదన్నారు. విలనిజం చూపించిన పాత్రలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ని అంతా మెచ్చుకున్నారు. కాని సినిమాకు అసలు హీరో అంటే, కామెడీ దొంగ పాత్రదే..ఇక దేవర విషయానికొస్తే, సినిమా అంతా తండ్రి పాత్ర మీదే నడిచింది. కొడుకు పాత్ర ఉందంటే ఉందనేలానే కనిపించింది. అందుకే ఇంతవరకు ఎన్టీఆర్ ఎన్ని డ్యూయెల్ రోల్ మూవీలైనా చేయొచ్చు.. కాని వేసిన ప్రతీ పాత్రకి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ ఎఫెక్టీవ్ నెస్ ఎక్కడో కొద్దిగా మిస్ అవుతూ వచ్చింది. ఆలోపమే లేకుండా డ్రాగన్ ని గట్టిగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది
అందుకు తగ్గట్టే డ్రాగన్ లో ఎన్టీఆర్ రెండు పాత్రలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకటి తాత పాత్ర, ఇంకొకటి మనవడి పాత్ర.. ఇక్కడే బాహుబలి ఫార్ములా వాడుతున్నాడట ప్రశాంత్ నీల్. అందులో ఇద్దరు బాహుబలులు.. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు ప్రభాస్.. కాకపోతే మొదటి భాగంలో ఇద్దరుంటారు.. రెండో భాగంలో ఇద్దరి పాత్రలు చూపిస్తారు.. అంటే రెండు భాగాల కథలో, రెండు పాత్రలని మార్చి మార్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పేరుతో చూపించొచ్చు..అదే ఫార్ములాని రెండు భాగాలుగా తెరకెక్కే డ్రాగన్ లో చూపించ బోతోందట ప్రశాంత్ నీల్ టీం. వాళ్లు కూడా డబుల్ డోస్ విసయంలో లైట్ తీసుకోకూడదనే, ఇలా జాగ్రత్తలుపెంచుతున్నారని తెలుస్తోంది. వచ్చే వారం గ్లింప్స్ తో ఇదే విషయం తేల్చేందుకు బర్డ్ డే గిఫ్ట్ ని రెడీ చేసింది ప్రశాంత్ నీల్ టీం.