బ్రూస్లీ చివరి క్షణాలతో స్టోరీ.. డ్రాగన్ మామూలోడు కాదు..?

డ్రాగన్ టీం ఒకేసారి రెండు భాగాలు షూటింగ్ చేయటం కాదు, అసలు కథని ఎత్తుకునే విషయంలోనే గట్టి పాయింట్ ని ఎత్తుకున్నట్టుంది.

Post Published By: dialnews
Updated : 25 February 2026, 3:53 PM IST

డ్రాగన్ టీం ఒకేసారి రెండు భాగాలు షూటింగ్ చేయటం కాదు, అసలు కథని ఎత్తుకునే విషయంలోనే గట్టి పాయింట్ ని ఎత్తుకున్నట్టుంది. ఇది ముందు పాన్ ఏషియా సినిమాగా రిలీజ్ చేసి, పాన్ వరల్డ్ మూవీగా రీచ్ పెంచే గట్టి ప్రయత్నమే జరుగుతోంది. ఆ ప్రయత్నం వెనక ప్రశాంత్ నీల్ కాన్ఫిడెన్స్ కి చైనీస్ లెజెండ్ బ్రూస్లీనే కారణం. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా బ్రూస్లీ గురించి చాలా సినిమాలు వచ్చాయి. డాక్యుమెంటరీలు కదిలించాయి.. కాని ఎవరూ బ్రూస్లీ చివరి రోజుల్లో తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఫోకస్ చేయలేదు. ఇప్పుడు అవే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి కథా వస్తువులుగా మారాయా? వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని పెట్టి, ఇప్పుడు బ్రూస్లీగా టైటిల్ మార్చాలనుకోవటానికి ఇదే రీజనా? ఇంతకి బ్రూస్లీ రియల్ లైఫ్ ఇన్స్ డెంట్స్ కి ఎన్టీఆర్ డ్రాగన్ కథకి ఉన్న లింకేంటి? అది నిజమైతే పూనకాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనే కాదు, చైనాలో బ్రూస్లీ ఫ్యాన్స్ నుంచి కూడా మొదలౌతాయి... ఇదే ఈమూవీని వరల్డ్ ప్లాట్ ఫాం మీద దూసుకెళ్లేలా చేస్తుందా? అదే కాన్ఫిడెన్స్ తో ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ రెండు భాగాలు ఒకేసారి తీస్తువబన్నాడా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇది కేవలం వర్కింగ్ టైటిలే అన్నారు. బ్రూస్లీ పేరుని పరిశీలిస్తున్నట్టు ప్రచారం పెంచారు. కట్ చేస్తే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రేరణ కూడా కూంగ్ ఫూ వీరుడు బ్రూస్లీ రియల్ లైఫ్ ఇన్స్ డెన్సే అని తెలుస్తోంది. అది సినిమా డిస్క్లైమర్స్ లో వేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.చైనీస్ మార్షియల్ ఆర్ట్స్ ని వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయ్యేలా చేసిన బ్రూస్లీ, హాలీవుడ్ ని ఒకానొక దశలో కుదిపేశాడు. కాని స్టార్ గా తను ఓ స్థాయికి చేరుకున్న టైంలో అకస్మాత్తుగా చనిపోయాడు. ఇంతవరకు ఆ అంశం డాక్యుమెంటరీగా వచ్చింది..లేదంటే తన మీద, తన జర్నీ మీద సినిమాలు, వెబ్ సీరీస్ ల ప్రయోగాల సందడి కనిపించింది.

కాని ఎవరూ కూడా తన మరణం తాలూకు అంశాన్ని ఎక్కువగా టచ్ చేయలేదు. కాని అక్కడే అదే పాయింట్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రాగన్ మూవీ కథ మొదలయ్యేలా ఉంది. ఏదో కేవలం డ్రాగన్, లేదంటే బ్రూస్లీ టైటిల్ పెట్టి కొన్ని చైనా ముఖాలను రంగంలోకి దింపేస్తే చైనీస్ చూసేస్తారా అంటే కానే కాదు. అందుకే సాలిడ్ పాయింట్ నే పట్టుకుని, అంతకంటే బలమైన కథనంతోనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. బ్రూస్లీ మరణించిన టైంలో జరిగిన కొన్ని సంఘటనల్నే డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ తండ్రి పాత్రకు అప్లై చేస్తున్నారన్న లీకులే తప్ప, ఎలా ఆ అంశాలు వాడుతున్నారో అఫీషియల్ గా అయితే తేలలేదు. అసలు గ్లింప్స్, టీజరే రాకముందు అదిఅంచనాకు కూడా అందదు.ఏది ఏమైనా కేవలం బ్రూస్లీ రియల్ లైఫ్ ఇన్స్ డెంట్స్ తో వచ్చే కథగా ఈ మూవీ చైనా, కొరియా ను టార్గెట్ చేయగలిగితే, మొదటి భాగంతో పాన్ ఆసియా మార్కెట్టు, రెండో భాగంతో పాన్ వరల్డ్ మార్కెట్ ని గట్టిగా కొట్టొచ్చని ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈవిషయంలోనే బ్రూస్లీ కుటుంబాన్ని డ్రాగన్ టీం సంప్రదించిందనే ప్రచారం జరుగుతోంది. బ్రూస్లీ మరణాంతరం, తన కూతురు షానన్ లీ, బ్రూస్లీ ఫౌండేషన్ ద్వార ఇంకా బ్రూస్లీ లెగెసీని కాపాడుతోంది.

అక్కడే డ్రాగన్ టీం, బ్రూస్లీ మరణం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎన్టీఆర్ మూవీ కథలో వాడుకునేందుకు లీగల్ రైట్స్ తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, అదే ఈ సినిమా డిస్ క్లైమర్ లో పడితే, కొంత రియలిస్టిక్ అప్రోచ్ వల్ల రీచ్ పెరుగుతుంది. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయిన ఎన్టీఆర్, అది కూడా త్రిబుల్ ఆర్ నాటు నాటు పాటతో గ్లోబల్ గా గుర్తింపు పొందాక, ఇలా బ్రూస్లీని బేస్ చేసుకుని మూవీ చేస్తున్నాడంటే, డెఫినెట్ గా చైనా, కొరియాలో డ్రాగన్ దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.ఇక టైటిలే బ్రూస్లీగా మారిస్తే సౌత్ ఆసియా మొత్తం ఈమూవీ ఈజీగా రీచ్ అవుతుంది. కథ, కథనాలు మేకింగ్ బాగుంటే, మాత్రం పంట పండినట్టే.. అదే జరిగి చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాల్లో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ దూసుకెలితే, పార్ట్ 2 రిలీజ్ టైం కి ఇది పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసే ఛాన్స్ఉంటుంది.

Published : 
  • 25 February 2026, 3:53 PM IST