మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొండి కాదు జగమొండి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన సింగిల్ స్టేట్ మెంట్ ఇది.. విచిత్రం ఏంటంటే నాలుగున్నర నిమిషాల డ్రాగన్ గ్లింప్స్ ఎంత వైరలైందో... అదే టైం లైన్ లో వచ్చిన ప్రశాంత్ నీల్ ఇంటర్వూ అంతకంటే వైరలైంది. ఎందుకంటే అందులోనే చాలా విషయాలు రివీల్ చేశాడీ డైరెక్టర్. ఇప్పటి వరకు 14 కిలోల వేయిట్ తగ్గిన ఎన్టీఆర్ అన్న ప్రచారంతో తప్పును సరిచేశాడు. ఇక ఎన్టీఆర్ ముఖం లో కండె తగ్గటం కోసం ఎంత రిస్క్ చేశాడో తేల్చాడు.. అసలు సిసలు దేశ భక్తి సినిమా డ్రాగన్ అన్న ఒక్క మాటతో, అండర్ కవర్ కాన్సెప్ట్ వాడారనే ఊహాగానాలు పెరిగాయి.. అండర్ డాగ్, అండర్ కవర్ ఈ రెండు ఐడియాలే డ్రాగన్ మూవీ కథకి పునాదులా..? ఇంతవరకు ఈ ఫార్ములాలను విడి విడిగా వాడారు.. కాని హాలీవుడ్ లో కూడా ఈ రెండు ఫార్ములాలను ఒకే సినిమా మీద ప్రయోగించలేదా? డ్రాగన్ ప్రపంచ సినిమాగా, ఈ కోణంలో రికార్డు క్రియేట్ చేయటం కన్ఫామా? ఇంతకి ఏంటా రెండు ఫార్ములాల మిక్చర్ ప్రయోగం?
ఎన్టీఆర్ మొండి కాదు జగమొండి.. తన లుక్ విషయంలో, హెల్త్ రిస్క్ విషయంలో ప్రతీ అంశంలో తన మాటిస్తే, సెట్లో తూటా పేలాల్సిందే. ఇదే మాట ప్రశాంత్ నీల్ అనటంతో, ఆ మాటలే ఇప్పుడు వైరలయ్యాయి. ఇంతవరకు డ్రాగన్ కోసం ఎన్టీఆర్ 14 కిలోల వేయిట్ తగ్గాడనుకున్నారు.కాని 14 కాదు 15 కిలోల వేయిట్ ని కేవలం 4 నెలల గ్యాప్ లోనే తగ్గాడట ఎన్టీఆర్.ఈ ఒక్క మాటతో, తన లుక్ వెనకున్న చాలా రూమర్స్ కి బ్రేకులు పడ్డాయి. బరువు తగ్గే క్రమంలో హెల్త్ ఇష్యూ వచ్చిందని చాలా మంది కామెంట్లు చేశారు. వార్ 2 మూవీలో సన్నగా కనిపించినప్పుడు, తర్వాత కొన్ని యాడ్స్ లో ఎన్టీఆర్ ముఖంలో కల తగ్గిందన్న మాటలు కూడా వినిపించాయి... అప్పుడు కూడా బరువు తగ్గే క్రమంలో ఎన్టీఆర్ హెల్త్ రిస్క్ లోపడింది కాబట్టే, డ్రాగన్ షూటింగ్ మధ్యలో ఆగిందని కూడా అన్నారు.
అవన్ని ఇప్పుడు గాలిమాటలు, కుల్లు కామెంట్లని తేలిపోయాయి. నిజానికి డ్రాగన్ మూవీలో ఎన్నిఆర్ వేసిన రెండు పాత్రల్లో ఒకటి లూగర్.. ఆ పాత్ర చాలా కఠినాత్ముడిదని తెలుస్తోంది. ఆ పాత్రకోసం తన ముఖంలో కండ కరిగి, కటినత్వం కొట్టొచ్చినట్టు కనిపించాలి... అందుకోసమే 15 కిలోల వేయిట్ తగ్గాల్సి వచ్చిందట. కేవలం టెన్ ప్యాక్స్ కోసమో, సిక్స్ ప్యాక్స్ కోసమో ఈ ప్రయత్నం కాదని తెలుస్తోంది.ముందు ముఖంలో కండ కరిగి, మరీ రగ్గుడుగా కనిపిస్తే, ఆతర్వాత మజిల్స్ పెంచి మరింత లుక్ మార్చొచ్చని ప్రశాంత్ నీల్ అన్నమాటకోసం, నిజంగానే హెల్త్ ని రిస్క్ లో పెట్టాడు ఎన్టీఆర్. అన్నట్టుగానే తన లుక్ తో దర్శకుడికి షాక్ ఇచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు గ్లింప్స్ తో షేక్ చేస్తున్నాడు. అంతేకాగు ఇది ప్రశాంత్ నీల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ పేట్రియాటిక్ మూవీ అన్నాడు.
అంటే ఇందులో ఎన్టీఆర్ దేశభక్తుడిగా కనిపిస్తాడా? అంటే లూగర్ పాత్రలో తను వేసింది అండర్ కవర్ ఏజెంట్ పాత్రా? ఈ డౌట్లకు కారణం ప్రశాంత్ నీల్ స్టేట్ మెంట్లే. అంతేకాదు ఇది ఒక అండర్ డాగ్ కథని కూడా తెలుస్తోంది. తండ్రి అండర్ కవర్, అయితే, తన వారసుడిగా డ్రాగన్ వచ్చి అండర్ డాగ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. అసలు అండర్ కవర్ ఏజెంట్లు, అండర్ కవర్ కాప్ లంటేనే హిట్ ఫార్ములా.. ఇక అండర్ డాగ్ రోల్ లో హీరో కనిపిస్తే ఎమోషన్ సెన్సేషన్ గా మారుతుంది. గుండెల్ని పిండేస్తుంది. అలాంటి ఈరెండు ఫార్ములాలు ఒకే మూవీ డ్రాగన్ లో ఉండటం అంటే, ఈ సారి ప్రశాంత్ నీల్ కథ, కదిలిస్తుంది.. వణికిస్తుందని తెలిపోతోంది. ఫ్యాన్స్ లో కూడా ఊపు మొదలైంది.