మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొద్దిలో మిడిల్ ఈస్ట్ వార్ ప్రమాధం నుంచి బయట పడ్డాడని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ తో అమెరికా యుద్దం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో బాంబుల మోతకు కారణమైంది. కొందరు స్పోర్ట్స్ స్టార్స్, అలానే సినీమా నటులు కూడా దుబాయ్ లో చిక్కుకున్నారన్న వార్తలు నిన్నంత వైరలయ్యాయి. ఐతే ఈ విషయంలో జోర్డాన్ షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేసి డ్రాగన్ టీం మంచిపని చేసిందన్నారు. కొద్దిలో యుద్ద ప్రమాధం నుంచి డ్రాగన్ టీం బయట పడిందన్నారు. కాని అందులో పూర్తి నిజం లేదు. జోర్డాన్ లో ఇంకా 40 రోజుల షూటింగ్ ఉందని తెలుస్తోంది. కేవలం పదిరోజుల షూటింగ్ తర్వాత పెండింగ్ షూటింగ్ ని వర్షాకాలంలో ప్లాన్ చేయటం వల్లే, ఈ షెడ్యూల్ అనుకున్న దానికంటే ముందే పూర్తైందా... ? ఒకవేల 50 రోజులు అక్కడే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా? ఇంతకీ ఈ ప్లానింగ్ వెనకుంది అద్రుష్టమా? రియల్ స్ట్రాటజీనా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మొత్తంగా డ్రాగన్ టీం కొద్దిలో పెను ప్రమాధం నుంచి తప్పించుకోగలిగింది. అదే ఇరాన్, అమెరికా వార్ ఎఫెక్ట్... ఇరాన్ సుప్రిం లీడర్ ని అమెరికా అంతమొందించాక, ఇరాన్ కూడా కౌంటర్ ఎటాక్ తో పగతీర్చుకుంటోంది. అందులో భాగంగా దుబాయ్, సౌదీ ఇలా చాలా గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలటరీ బేస్ లమీద, అలానే సౌదీ లో చాలా ప్రాంతాల మీద మిసైల్ దాడుటు జరుగుతున్నాయి.అందులో భాగంగానే, దుబాయ్ లో బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో సహా చాలా మంది స్టార్స్ ఇరుక్కోవటం, తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం దేశ ప్రభుత్వం రంగంలోకి దిగటం జరిగాయి.కొద్దిలో ఉంటే ఇలానే డ్రాగన్ మూవీటీం కోసం మన దేశ ప్రభుత్వం పెద్ద ఆపరేషనే చేయాల్సి వచ్చేది. ఎందుకంటే జోర్డాన్ లో డ్రాగన్ టెన్ డేస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ అండ్ కో ఇండియాకి వచ్చాకే, అమెరికా, ఇరాన్ వార్ షురూ అయ్యింది.
ఐతే ఇక్కడతో సమస్య తీరిపోలేదు. నిజానికి జోర్డాన్ లో డ్రాగన్ తాలూకు షూటింగ్ షెడ్యూల్ 50 రోజులు ప్లాన్ చేశారట. కాని 10రోజుల షూటింగ్ తర్వాత, రైన్ ఎఫెక్ట్, లైటింగ్ తో పాటు కొంత వెథర్ జూన్ లో మారుతుంది కాబట్టి మిగతా షెడ్యూల్ ని అప్పటికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.జోర్డాన్ లో హిస్టారికల్ ప్లేసెస్ కి కథలో ఉన్న ఇంపార్టెన్స్ వల్లే, అక్కడ షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. సో నిజంగా 50 రోజుల షెడ్యూల్ అక్కడే తీస్తూ ఉండి ఉంటే, ఈపాటికి మిడిల్ ఈస్ట్ లో డ్రాగన్ టీం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కునేది. సరే ఇప్పుడు 10 రోజుల షెడ్యూల్ పూర్తై వచ్చాకే కదా, అక్కడ వార్ మొదలైందని అనుకోవచ్చు. అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యేలా ఉంది.
అదేంటంటే, మిగటా 40 రోజుల షెడ్యూల్ జోర్డాన్ లోనే షూటింగ్ చేయాలి. అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ లో కొంతే షూటింగ్ చేశారు. కథ పరంగా ఆ లొకేషన్స్ లోనే మిగతా పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి. కాని జూన్ లోగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆగుతుందా? ఒకవేళ ఆగినా, మళ్లీ డ్రాగన్ టీం జోర్డాన్ వెళ్లాక షూటింగ్ జరుగుతున్న టైంలో, మళ్లీ యుద్దం మొదలైతే... డ్రాగన్ టీం కి కష్టాలే.. అందుకే ఆ పార్ట్ షూటింగ్ ని వాయిదా వేస్తారా? లేదంటే జోర్డాన్ లో 10 రోజులుండి తీసిన సీన్ల షూటింగ్ ని, ఇక్కడ సెట్ వేసి రీక్రియేట్ చేసి రీషూట్ చేస్తారా అన్నది ఇంకా తేలలేదు.. తేలేలా లేదు. ఏదేమైనా 100 కోట్ల ఖర్చుతో పెండింగ్ 40 రోజులు షూటింగ్ కంటిన్యూ చేసి ఉంటే, ఆ వందకోట్ల ఖర్చు ఆవిరైపోయుండేది.