DRAGONతో పెట్టుకుంటే.. డ్రమ్ములు పేలిపోతాయ్..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా మారాడు.. ఇప్పుడీ డ్రాగన్ తో పెట్టుకుంటే, డ్రమ్ములు పేలిపోతాయ్.. ఏదో మాట వరసకు కాదు.. నిజంగానే డ్రమ్ములు సిద్దంగా ఉన్నాయి. ఆల్రెడీ పది డ్రమ్ముల్ని జోర్డాన్ లో పేల్చిందట డ్రాగన్ టీం

Post Published By: dialnews
Updated : 24 March 2026, 6:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా మారాడు.. ఇప్పుడీ డ్రాగన్ తో పెట్టుకుంటే, డ్రమ్ములు పేలిపోతాయ్.. ఏదో మాట వరసకు కాదు.. నిజంగానే డ్రమ్ములు సిద్దంగా ఉన్నాయి. ఆల్రెడీ పది డ్రమ్ముల్ని జోర్డాన్ లో పేల్చిందట డ్రాగన్ టీం. బేసిగ్గా బ్లూకలర్ డ్రమ్స్ అంటే అందరికి గుర్తొచ్చేది, క్రైమ్ న్యూస్... బ్లూ డ్రమ్ములంటేనే భాయ్ ఫ్రెండ్స్ కోసం భర్తను లేపేసి, డ్రమ్ లో పార్సిల్ చేసే భార్యల వార్తలే గుర్తొస్తాయి...కాని ఇప్పుడు డ్రమ్ములంటే డ్రాగనే గుర్తుకొచ్చేలా ఉంది. డ్రమ్ము బాంబుల ట్రెండ్ ని డ్రాగన్ క్రియేట్ చేసేలా ఉంది. వియాత్నం, ఇండోనేషియా, మలేషియాలో ఒకప్పుడు సొసైటినే కుదిపేసిన డ్రమ్ము బాంబుని డ్రాగన్ కోసం రియలిస్టిగ్ గా వాడారా? అసలు డ్రమ్ము బాంబేంటి? డ్రాగన్ లో అదెందుకు అంత క్రూషియల్ ?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, లైఫ్ రిస్క్ చేసి, అన్న సన్నబడి, రెండు పాత్రల కోసం రెండు సార్లు, తన లుక్ ని మార్చుకున్నాడంటే, కంటెంట్ లో ఏదో దమ్ముందనుకున్నారు. కాని ఆ దమ్ముతోపాటు, ఇందులో డ్రమ్ము కూడా ఉందని ఇప్పడే తెలుస్తోంది. డ్రమ్ముబాంబుతో ట్రెండ్ సెట్ చేసేందుకు డ్రాగన్ టీం రెడీ అయినట్టుంది. బేసిగ్గా బకెట్ బాంబ్ అంటే, జమనాలో నక్సల్స్ బాంబ్ గా ఫోకస్ అయ్యింది.అలానే డ్రమ్ము బాంబంటే, డ్రగ్ మాఫియాలో మరి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇండోనేషియా,మలేషియా, వియాత్నాంలో ఫేమస్..ఔను అక్కడ డ్రమ్ములో బాంబులు పెట్టి పేల్చటం, లేదంటే శత్రువుని బాంబులతో పాటు బాంబులో ఉంచి పార్శిల్ చేసి, పేల్చేటం ఈ రెండు అక్కడ బాగా పాపులరైన సంఘటనలు... ఇవే ఇప్పడు డ్రాగన్ లో కనిపించబోతున్నాయా?

జోర్జాన్ లో 10 రోజుల్లో 15 కోట్లు అంటే రోజుకి కోటిన్నర ఖర్చయ్యింది, ఈ డ్రమ్ముబాంబుకేనా? ఈ ప్రశ్నలకు ఆల్ మోస్ట్ ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి మెక్సికోలో డ్రగ్ డీలర్స్, మాఫియా డాన్లు, వాళ్ల శత్రువులని చంచి, బట్టల్లేకుండా, వాళ్ల శవాలను, ఫ్లైఓవర్లకు వేలాడ దీస్తారు.. కొన్ని బాడీలకు తలలు కూడా ఉండవు.. ఇలాంటి సంఘటనుకు మెక్సికోలో కోకొల్లలు...అలా వాల్లని టచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేలా చేసే వార్నింగ్స్ ఇవి.. అచ్చింగా వియత్నంలో ఇలానే డ్రమ్ముల్లో శత్రువులని పెట్టి పార్శిల్ చేయటం. ఆ పార్శిల్ ఓపెన్ చేయగానే, డ్రమ్ము పేలటం ఇదక్కడ ఏయిటీస్ లో వణికించే అంశాలు.. అవే ఇప్పుడు డ్రాగన్ లోకనిపించబోతున్నాయి. మామూలుగా మందుగుండుని, అరచేతి సైజు డబ్బాలో పెట్టి పేలిస్తే, అది గ్రానైడ్ లా రియాక్ట్ అవుతుంది..అదే డ్రమ్ము సైజు గ్రెనైడ్ ని పేలిస్తే ఎలా ఉంటుంది.. ఆ ఫైట్ సీన్ల కోసమే యాక్షన్ కొరియోగ్రాఫీ టీం, భారీగా ప్రయోగాలు చేయటం, ఒరిజినాలిటికోసం రియల్ బాంబు పేలితే వచ్చే ఔట్ పుట్ కోసం ఫిల్మ్ టీం ప్రయత్నించటం వల్లే, జోర్జాన్ లో రోజుకి కోటిన్నర ఖర్చయినట్టు తెలుస్తోంది. ఇంతకి ఈ డ్రమ్ము బాంబు డ్రాగన్ కి ఎంత ప్లస్ అవుతుందో, ఎలాంటి ట్రెండ్ సెట్టర్ గా మారుతుందో, కనీసం టీజర్ వస్తే అయినా ఒక క్లారిటీ వచ్చేచాన్స్ఉంది.

 

Published : 
  • 24 March 2026, 6:15 PM IST