కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, మలయాళ భామ మమితా బైజు కథానాయకిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డ్రామాపై ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. సూర్య కెరీర్‌లో ఈ చిత్రం మరొక బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు.
అయితే, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మరియు బాక్సాఫీస్ టార్గెట్‌కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి ఈ సినిమా మొత్తం 60 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ టార్గెట్‌తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ సహా మిగతా మార్కెట్లలో కలిపి మరొక 30 కోట్లు వరకు టార్గెట్ సెట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ టార్గెట్‌తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది.
ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం... 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ రికవరీ కావాలంటే, థియేట్రికల్ షేర్లు మరియు ట్యాక్స్ అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా కనీసం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే తప్ప సేఫ్ జోన్‌లోకి వెళ్లలేదని అంటున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్, సూర్య నటన కలగలిసిన ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో, అలాగే బాక్సాఫీస్ వద్ద అనుకున్న 200 కోట్ల భారీ టార్గెట్‌ను అందుకొని క్లీన్ హిట్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.