850 కోట్లు+1250 కోట్లు = 2100 కోట్ల పరుగులు…!

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన మూవీ అంటే కల్కీ. దాని సీక్వెలే ఈ మంథ్ ఎండ్ లోగా సడన్ గా మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

Post Published By: dialnews
Updated : 21 February 2026, 5:26 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన మూవీ అంటే కల్కీ. దాని సీక్వెలే ఈ మంథ్ ఎండ్ లోగా సడన్ గా మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్పిరిట్ మూవీ చేసేప్పుడు మరో సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగ కండీషన్ పెట్టినా, కల్కీ సీక్వెల్ పనులు మొదలవ్వక తప్పట్లేదు.. ఆల్రెడీ ఫౌజీ పెండింగ్ షూటింగ్ తలనొప్పిగా అవుతుంటే, సీన్ లోకి సలార్ 2 వచ్చేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ మూవీ తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అది కూడా రెండు భాగాలు.. ఒకటో పార్ట్ ఏప్రిల్ లోగా పూర్తవుతుంది. రెండో భాగం దసరాలోగా పూర్తవుతుంది. ఆతర్వాతే సలార్ 2 మొదలౌతుందా? మొత్తంగా ఇటు సలార్, అటు కల్కీ సీక్వెల్స్ మధ్యలో సందీప్ రెడ్డి వంగ తీసే స్పిరిట్ చిక్కుకుందా?ఒకేసారి ప్రభాస్ సినిమాలు ఇలా వేగంగా పట్టాలెక్కినా, తెరకెక్కుతున్నా దర్శకులకి, హీరోకి ఇబ్బంది కావొచ్చు.. కాని ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూసే... ఈ హెవీ ప్రెజర్ నుంచి ప్రభాస్ ని బయట పడేసేందుకు, సందీప్ రెడ్డి వంగ పెద్ద బాంబే పేల్చబోతున్నాడు.. ఇంతకి ఏంటా ఆటమ్ బాంబ్..?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ ప్లాన్ చేసినప్పుడు, ఈ సినిమా చేసేప్పుడు మరో మూవీ చేయకూడదనే కండీషన్ పెట్టాడు. అందుకే రాజాసాబ్ అయిపోయే వరకు వేయిట్ చేశాడు. ఫౌజీ సగం పూర్తయ్యే వరకు కూడా వేయిట్ చేశాడు. కట్ చేస్తే స్పిరిట్ పట్టాలెక్కింది. ఇంతలో ఇప్పుడు ఈ నెలాఖర్లో కల్కీ 2 పట్టాలెక్కబోతోంది.. ఇదే కథలో ట్విస్ట్.దానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ డేట్లు, వాళ్ల కమిట్మెంట్లేకారణం.. విచిత్రంఏంటంటే, సరే ఈ విషయంలో కన్విన్స్ అయిన సందీప్ రెడ్డి స్పిరిట్ షూటింగ్ మధ్యలో బ్రేకులిచ్చి, కల్కీ సీక్వెల్ కోసం గ్యాప్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడనుకోవచ్చు.. కాని ఇలాంటి టైంలో సలార్ సీక్వెల్ మీద కూడా భారీగానే ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా పట్టాలెక్కేటైం వచ్చినట్టుంది. జై హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి ప్రభాస్ డేట్లిచ్చాడని ప్రచారం జరుగుతున్న వేల, ప్రశాంత్ నీల్ మేకింగ్ లోసలార్ 2 అంటుడంటమే షాకింగ్ గా ఉంది. ఇంకా ఫౌజీ పూర్తి కాలేదు. ఇంతలోనే స్పిరిట్ మొదలైంది. అది సగం పూర్తి కాలేదు. అంతలోనే కల్కీ 2 మొదలౌతోంది. ఈలోపే సలార్ సీక్వెల్ మీద ప్రచారం మొదలైంది..ఇవన్నీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అంశాలే.. కాని ప్రభాస్ కి మాత్రం పెద్ద హెడ్డేకే.. తనెలా ఇన్ని సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేస్తాడు. దీనికి తోడు తన లుక్ ఒక్కో మూవీకోసం ఒక్కోలా మార్చుకోవాలి.. కల్కీ 2 లుక్ కి వచ్చిన ఇబ్బందేం లేదు.. కారణం లాంగ్ హేయిర్ అనేది విగ్ అని తేల్చారు.. కాని సలార్ కి మాత్రం తన లుక్ మారాలి..

స్పిరిట్ కోసం పూర్తిగా గుండు కాదుకాని, మలిట్రీ కటింగ్ కంటే చిన్న జుట్టుతో అంటే గుండు చేయించుకున్నాక నెలకి పెరిగే జుట్టు ఎలా ఉంటుందో, ఆలుక్ లో కనిపించబోతున్నాడని తేలింది. ఆ లుక్ కి, సలార్ లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది? కాబట్టి లుక్స్ ని ఎలా మ్యానేజ్ చేస్తాడు.. మరో వైపు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని దసరాలోపు పూర్తి చేసేందుకు వేగం పెంచాడు.. అంటే దసరా లోపు మాత్రం సలార్ సీక్వెల్ మొదలవ్వదు.. ఏదున్నా దసరా తర్వాతే, అంటే ఈలోపు ఫౌజీ పూర్తవుతుంది. స్పిరిట్ సగానికి పైగా పూర్తవుతుంది. కల్కీ కూడా గతంలోనే సీక్వెల్ తాలూకు 30శాతం షూటింగ్ పూర్తైందంటే,మరో 30శాతం షూటింగ్ కూడా దసరాలోపు పూర్తవ్వొచ్చు.. ఎలాచూసినా ఫౌజీ, స్పిరిట్, కల్కీ 2, సలార్ 2 ఇలా వరుసగా రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తున్నాయి.. అందుకే రెబల్ పూనకాలకు టైం వచ్చినట్టుంది.

Published : 
  • 21 February 2026, 5:26 PM IST