కల్కీ మూవీకి సీక్వెల్ గా కర్ణ 3102 బీసీ టైటిల్ తో కల్కీ 2 రెడీ అవుతోందా? మొన్నటి వరకు ఇదిగో అదిగో అన్నారు. తీరా చూస్తే ఆల్రెడీ సెట్లో సీక్రెట్ గా షూటింగ్ మొదలైంది. నెల రోజుల క్రితమే సెట్ ని రెడీ చేసిన టీం, చడిచప్పుడు చేయకుండా కల్కీ సీక్వెల్ షూటింగ్ షురూ చేసింది. ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒకవైపు యాడ్స్ తో పాటు కపుల ఫ్రెండ్లీ మూవీ ప్రమోషన్ కోసం ఒక రోజంతా కేటాయించి బిజీ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. మరో వైపు తను లేకుండానే కల్కీ 2 షూటింగ్ ని నాగ్ అశ్విన్ మొదలుపెట్టేశాడు. మంగళ వారం నుంచి రెబల్ స్టార్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడట. ఇంతకి ఇంత రహస్యంగా ఎందుకు కల్కీ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు? అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ సెట్లో ఉండగా సెన్సేషన్ అవ్వాల్సిన న్యూస్, ఎందుకు సైలెంగ్ గా ఉండిపోతోంది?
కల్కీ 2 షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. అదిగో, ఇదిగో అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కట్ చేస్తే సైలెంట్ గా కల్కీ 2 సెట్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చేశారు. యాస్కిన్ పాత్రలో కమల్, అశ్వథ్దామ గెటప్ లో అమితాబ్, ఇద్దరూ కల్కీ 2 సెట్లో సందడి చేస్తున్నారు. కర్ణ 3102 బీసీ పేరుతో కల్కీ సీక్వెల్ ని రెడీ చేస్తోంది ఫిల్మ్ టీం కల్కీ మొదటి భాగం తీసేప్పుడే కల్కీ 2 తాలూకు షూటింగ్ 30 శాతం షూటింగ్ పూర్తి చేశారని నిర్మాతే తేల్చటంతో, ఇప్పుడు ఈ పదిరోజుల్లో 20శాతం పూర్తి చేసి, సగం షూటింగ్ పూర్తి చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ప్రభాస్ లేకుండా, కమల్, అమితాబ్ మాత్రమే సెట్లో సందడి చేయటం షాకింగ్ గా ఉంది. ఐతే ఈ ఇద్దరి కాంబో సీన్లతోనే షూటింగ్ మొదలు పెట్టిందట ఫిల్మ్ టీం.
మంగళవారం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా సెట్లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ఐతే అంతా బానే ఉంది కాని, ఇక్కడ సమస్య ఏంటంటే, కల్కీ 2 షూటింగ్ మొదలైందని ఎందుకు అఫీషియల్ గా తేల్చలేదు. ఇంత సడన్ గా మొదలు పెట్టిన టీం, ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేకుండా, రహస్యంగానే ఎందుకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది..దీనికి కారణం ఒకటే, నెలక్రితమే కల్కీ 2 కోసం 12 కట్లతో ఒక స్పెషల్ సెట్ వేసిందట సినిమా టీం. అంతేకాదు కమల్ హాసన్ లుక్ కూడా రెండో భాగంలో వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. మొదటి భాగానికి పూర్తి భిన్నమైన లుక్ లో తను కనిపిస్తాడని తెలుస్తోంది.
అది రివీల్ కాకూడాదనే, టోటల్ సినిమా టీం లో ఎవరి దగ్గర సెల్ ఫోన్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడట నాగ్ అశ్విన్.చాలా వరకు మూడు ఫ్లోర్ల ఎత్తులో గ్రీన్ మ్యాట్లు కూడా పెట్టడం, సెట్ రివీల్ కాకుండా ఉండాలని, మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నాగ్ అశ్విన్.. ఇది ఇప్పడు కొత్తగా ఇండస్ట్రీ సర్కిల్ లో రీసౌండ్ చేస్తోన్న రీజన్. ఫౌజీ, స్పిరిట్ పరిస్థితి ఎలా ఉన్నా, ఇక మీదట కూడా షూటింగ్ స్పాట్ లో జాగ్రత్తలు మరింత టైట్ చేయబోతున్నారు.ఎందుకంటే కల్కీ 2 లో 90శాతం ప్రభాస్ కర్ణుడి పాత్రలోనే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ కర్ణుడిగా తానెలా ఉంటాడో మొదటి భాగంలోనే చూశాక, ఎందుకు ఇంతగా తన లుక్ కాని, మిగతా పాత్రల లుక్ కాని రివీల్ కాకూడదనేకుంటున్నారనే చర్చే పెరిగింది. ఒకవేళ రెండో భాగంలో వీల్లందరి లుక్స్ పూర్తిగా మారిపోతాయేమో అన్న డౌట్లు పెరిగాయి.