లేడీ రెబల్ స్టార్ గా మారే ఛాన్స్.. అమితాబ్ వల్లే…!

రెబల్ స్టార్ సడన్ గా కల్కీ సీక్వెల్ కి డేట్లిచ్చాడు.. కాని దీని వెనక చాలా పెద్ద వ్యవహరామే నడిచింది. నిజానికి స్పిరిట్ మూవీ చేసేప్పుడు ఆ సినిమాకు తప్ప ప్రభాస్ మరే మూవీకి పనిచేయకూడదు..

Post Published By: dialnews
Updated : 11 February 2026, 8:52 PM IST

రెబల్ స్టార్ సడన్ గా కల్కీ సీక్వెల్ కి డేట్లిచ్చాడు.. కాని దీని వెనక చాలా పెద్ద వ్యవహరామే నడిచింది. నిజానికి స్పిరిట్ మూవీ చేసేప్పుడు ఆ సినిమాకు తప్ప ప్రభాస్ మరే మూవీకి పనిచేయకూడదు.. ఇది సందీప్ రెడ్డి పెట్టిన మొదటి కండీషన్... అందుకోసం తను ఏకంగా స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టకుండా, ఏకంగా ఏడాది వేయిట్ చేశాడు... కాబట్టి తన కండీషన్ పాటించటం న్యాయ బద్దమైందే.. కాని అదే కుదరట్లేదు. సడన్ గా కల్కీ 2 ని మొదలుపెట్టేందుకు టీం రెడీ అయ్యింది. ఏకంగా స్పిరిట్, ఫౌజీ షూటింగ్ కి బ్రేక్ వేసి, 2 షెడ్యూల్స్ కల్కీ 2 షూటింగ్ కి రంగం సిద్దమౌతోంది. దీనంతటికి కారణం బాలీవుడ్ బడా బచ్చన్ అమితాబే అని తెలుస్తోంది. కమల్ హాసన్ డేట్లైనా అడ్జెస్ట్ అవ్వొచ్చు కాని, అమితాబ్ అందుబాటులో ఉండేలా లేడు. తనకోసమే ఇప్పుడు సాయిపల్లవిని ఇందులోకి తీసుకుంటున్నారా? మొన్నటికి మొన్న దీపికా పదుకొనే ప్లేస్ లో సాయిపల్లవి రాబోతోందనగానే, అంతా ఉత్తదే అని ఫిల్మ్ టీం తేల్చింది. కట్ చేస్తే అమితాబ్ కండీషన్ వల్ల , ఇప్పుడు సాయిపల్లవిని తీసుకోవాల్సి వస్తోందట. ఎందుకు? అసలు ప్రభాస్ కూడా కల్కీ సీక్వెల్ కోసం ఇంత హడావిడిగా డేట్లివ్వటం ఏంటి? ఈ అర్జెన్సీ వెనకున్న అసలు కారణం ఏంటి?

కల్కీ 2 సడన్ గా సెట్స్ పైకెళుతోంది. ఈనెల్లోనే ఈ సీక్వెల్ లాంచ్ అయ్యి, మేనుంచి రెగ్యులర్ షూటింగ్ లేదంటే, జులై నుంచి అన్నారు. తీరా చూస్తే ఏకంగా 20రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. పన్నెండు రోజులు ఒక షెడ్యూల్, 8 రోజులతో మరో షెడ్యూల్ లో కల్కీ సీక్వెల్ షూటింగ్ జరగబోతోంది. అందుకోసం స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ వేస్తున్నారు. ఫౌజీ షూటింగ్ కి కూడా బ్రేక్ పడేలా ఉంది..ఆల్ ఆఫ్ సడన్ గా కల్కీ 2 మొదలవ్వటానికి రీజన్ బాలీవుడ్ స్టార్ అమితాబచ్చనే.. అంతేకాదు, ఈ సినిమాలో దీపినా పదుకొనే వద్దు, తన ప్లేస్ లో మరోకరిని తీసుకుందమని ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యాక.. ఎవరా లేడీ అనుకుంటుంటే సాయిపల్లవి పేరు వినిపించింది. కాని తర్వాత అదేంలేదు, తను ఇందులో లేదని నిర్మాతలు తేల్చారు. కట్ చేస్తే ఇప్పడు తననే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కూడా అమితాబ్ బచ్చనే కారణమని తెలుస్తోంది.

కల్కీ లో అమితాబ్, ప్రభాస్ కాంబినేషన్ సెన్సేషనైంది. 1200 కోట్ల వసూళ్లకి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇక దాని సీక్వెల్ తాలూకు 30శాతం పని గతంలోనే పూర్తి చేసిన టీం, మిగతా 70 శాతం పనిని, ఈనెల్లోనే మొదలుపెడుతోంది. ఐతే ఇందులో అమితాబ్ బచ్చన్ తో ప్రభాస్ కాంబినేషన్ సీన్స్, అలానే కమల్ హాసన్ తో ప్రభాస్ కాంబినేషన్స్ సీన్స్ ని ముందుగా తీయాలనుకుంటున్నారు.వీల్లతో హీరోయిన్ కి ఉన్న కాంబినేషన్ సీన్లు కూడా ఇప్పుడే తీయాలి.. అందుకోసం సాయిపల్లవినే దీపికా ప్లేస్ లో తీసుకోవటానికి ఫిక్స్ అయ్యారట. తను కూడా ఒప్పుకోవటంతో, సడన్ గా షూటింగ్ ప్లాన్ చేయటమే కాదు, వేగంగా 20 రోజుల్లో కాంబినేషన్ సీన్లు తీయబోతున్నారు. వాటికోసమే ప్రభాస్ తన స్పిరిట్, ఫౌజీకి బ్రేక్ వేసి, కల్కీసీక్వెల్ ని మొదలు పెడుతున్నారు.

అంటే 20రోజుల్లో కమల్, అమితాబ్, ప్రభాస్ కాంబినేషన్లు తీసి, ఆతర్వాత కమల్, అమితాబ్ తాలూకు సీన్లు షూట్ చేస్తారట. అలా వాళ్ల షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తే, ఆ ఇద్దరు మిగతా కమిట్ మెంట్స్ తో బిజీ అవ్వొచ్చు.. అందుకోసం ఇలా సడన్ గా కల్కీ 2 నిమొదలు పెట్టడమే కాదు,హీరోయిన్ తో కాంబినేషన్ సీన్లు ఉండటం వల్ల కూడా, సాయిపల్లవిని సడన్ గా తీసుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. అంతా అమితాబ్ కమిటైన కొత్త ప్రాజెక్టుల ప్రెజర్ వల్లే ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. కల్కీ 2 మేజర్ షూటింగ్ పార్ట్, ఈనెల, వచ్చేనెలలో జరగొచ్చని తెలుస్తోంది.

Published : 
  • 11 February 2026, 8:52 PM IST