మహేశ్ VS రాజమౌళి.. వణికిస్తున్న ఫోటో..?

సూపర్ స్టార్ వర్సెస్ రాజమౌలి... ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వివాదాల వర్మ పోస్ట్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ బేస్డ్ ఇమేజ్ నిజంగా ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది.

Post Published By: dialnews
Updated : 25 February 2026, 6:55 PM IST

సూపర్ స్టార్ వర్సెస్ రాజమౌలి... ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వివాదాల వర్మ పోస్ట్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ బేస్డ్ ఇమేజ్ నిజంగా ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది. ఇలాంటి ఏఐ బేస్డ్ ఫోటేలే కాదు, వీడియోలు కూడా ఇవ్వాల రేపు కామన్ గా రెడీ చేసి వదులుతున్నారు. హీరోలు కూడా తమ లుక్ ని ఎవరూ మిస్ యూజ్ చేయకుండా, కోర్టుకెళ్లి కేసులేస్తున్నారు.. ఐతే ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు వరకు అంతా కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రెబల్ స్టార్ ఒకవైపు సంతోషపడుతూనే భయపడాల్సి వస్తోందట. ముందు అంతా చిన్న పిల్లల ఆటలా, లేదంటే సరదా ప్రయోగంలా అనుకున్నా, ఇప్పుడు ఇండస్ట్రీనే కుంగిపోయేలా చేస్తోందా ఫోటో... అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి భవిష్యత్తే లేకుండా చేసేలా ఉంది.. ఇది నిజంగా దర్శక నిర్మాతలకు ఒక యాంగిల్ లోకలిసొచ్చే విషయమే అయినా, మరో కోణంలో చూస్తే హీరోలెవరూ సేఫ్ కాదు... అసలు ఇండస్ట్రీనే సేఫ్ కాదు.. అంతగా ఏఐ వల్ల ఇక్కడ తలరాతలు కాదు, తలలే మారిపోయేలా ఉన్నాయి... అందుకే ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ టీమ్ కూడా చిరు, రజినీకాంత్ దారిలో జాగ్రత్త పడుతోందా? అంతా కలిసి ఏం చేయబోతున్నారు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళి గల్ల పట్టుకుని, తనని ఎందుకో బెగిరించినట్టున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. రామ్ గోపాల్ వర్మ ఈ ఏఐ జెనరేటెడ్ వీడియోని పోస్ట్ చేసి సరదాగా కమెంట్ పెట్టాడు. అందులో చాలా ఫ్రేములు ఫోటోల రూపంలో సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇక వీడియో కూడా మరీ రియలిస్టిక్ గా కనిపిస్తోంది.సెడాన్స్ 2.0 ఏఐ వల్లే ఈ వీడియో సాధ్యమైందట. అసలు మహేశ్ కాని, రాజమౌళి కాని ఎవరూ లేకున్నా వాళ్ల ఇమేజ్ లను తీసుకుని, ఏఐ తో ఇలాంటి వీడీయో ఒకటి క్రియేట్ చేయటంతో, అసలు సమస్య మొదలైంది.ఇదేంకొత్తకాదు, గతంలో చిరు నుంచి బాలయ్య వరకు, మహేశ్ బాబు నుంచి పవన్ వరకు వాళ్ల ముఖాలని వాడి, చిత్ర విచిత్రమైన వీడియోలు, ఏఐ జెనరేటెడ్ ఇమేజ్ లు తయారు చేశారు. సోషల్ మీడియాలో పెట్టారు.

అయితే ఇప్పుడు వీటితో వచ్చిన సమస్య, హీరోల సాయం లేకుండానే వాళ్ల ముఖాలతో సినిమాలొచ్చేలా రోజులు మారేలా ఉన్నాయి.. అలాని హీరోలు లేకుండా వాళ్ల ముఖాలు,వాయిస్ లు వాడే అవకాశం ఉండదు.. అలాంటప్పుడు సమస్య ఏంటి? కేవలం ఇల్లీగల్ గా హీరోల ముఖాలు, వాయస్ లను ఏఐ తో వాడేసి, తప్పగా వాడితేనే సమస్యలు వస్తాయి.లీగల్ గా నటుల పర్మీషన్ తీసుకుని, సినిమాలు తీస్తే తప్పే కాదు. కాని అక్కడే తప్పు జరిగేలా ఉంది. ఇప్పటికే హరి హర వీరమల్లు, రాజాసాబ్ లో హీరోల బదులు డూప్ లని వాడి సినిమా క్వాలిటి తగ్గేందుకు కారణమయ్యారనే కామెంట్స్ ఉన్నాయి. అలాంటిది హీరోలు సెట్ కి రాకుండానే ఇలా ఏఐ రూపంలో వాళ్ల ఇమేజ్, వాయిస్ ని వాడి మూవీలు తీస్తే అంతకుమించిన బద్దకస్తులుగా హీరోలు మారే ఛాన్స్ఉంది.

ఇదే ట్రెండ్ రాను రాను, నటులతో పనిలేకుండా చేస్తుంది... అప్పుడు వాల్ల భవిష్యత్తే డైలామాలో పడే ఛాన్స్ఉంది.ఇందులో సమస్య తీవ్రత అర్ధం కావాలంటే, తెలుగు సినిమా స్టైల్లోనే చెప్పుకుందాం... ఒక హీరో తనలాంటి వాడినే చూసి, తన స్థానంలో తన ఇంటికి పంపిస్తాడు.. చివరికి ఆ డూపే అసలోడి ప్లేస్ లో తిష్టవేసి, అసలు హీరోనే జీరో గా మారుస్తాడు.. ఇదే ఇక్కడ జరిగేలా ఉంది.హీరోలకి ఏజ్ పెరుగుతుంది.. లుక్ మారుతుంది..కాని వాళ్ల పర్మీషన్ తో ఒకసారి లీగల్ గా వాళ్ల లుక్, వాయస్ ల మీద రైట్స్ సొంతం చేసుకున్న బ్యాచ్ ఎలా అంటే అలా వాళ్ల ని ఏఐలో వాడేసుకోవచ్చు... అప్పుడు హీరోలతో చాలా కంపెనీలకు పని ఉండదు.. ఎప్పుడూ కొత్త మార్కెట్ క్రియేట్ అయినా, కొత్త టెక్నాలజీ వచ్చినా దాని పర్యవసానాలనేవి, లీగల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలే తెలిసేలా చేయవు.. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎవరికీ తెలియదు.. అది అందరికీ కొత్తే, సో ఏఐ తో హీరోలు టై అప్ అయితే, భవిష్యత్తు లీగల్ ఇష్యూస్ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.. ఇది కూడా అందరికి కొత్తే.. కాబట్టి కష్టపడకుండా, ముఖాలు, వాయిస్ లను హీరోలు అద్దెకిచ్చే అలావాటు మొదలైతే, ఇదేదో బాగుందని ఇప్పడనిపించొచ్చు, తర్వాత అసలుకే ఎసరు రావొచ్చు.. ఈ మాటల్నే నిజం చేస్తోంది రాజమౌళి, మహేశ్ బాబు కొట్టుకునే ఏఐ వీడియో.

Published : 
  • 25 February 2026, 6:55 PM IST