వారణాసి మూవీ రెండు భాగాలు అని తేలటంతో, ఒకరికి మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది.. అది ఎవరో కాదు లెక్కల మాస్టారు సుకుమార్. పుష్ప2 తర్వాత రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్న తను, ప్రజెంట్ తన శిష్యుడు తీస్తున్న పెద్దికి రిపేర్లు చేస్తున్నాడు. సమ్మర్ ఎండ్ లోగా రామ్ చరణ్ ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. ఐతే వారణాసి వల్ల ఇప్పుడు తన జేమ్స్ బాండ్ మూవీకి మోక్షం వచ్చేలా ఉంది. ఈ ఏడాది దసరా తర్వాత మహేశ్ బాబు పూర్తిగా ఫ్రీ కాబోతున్నాడు.. అప్పుడే వారణాసి షూటింగ్ పూర్తి కాబోతోంది. కాబట్టే దసరా దద్దరిల్లేలా మహేశ్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ కి కాల్లొచ్చేలా ఉన్నాయి. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తో సందీప్ రెడ్డి బిజీ అవుతుండటంతో, మహేశ్ డేట్లు గంపగుత్తగా సుకుమార్ కి దక్కేలా ఉన్నాయి... అందుకే జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ కి కాలం కలిసొచ్చేలా ఉంది. మరి ఈ సినిమా పట్టాలెక్కేలోపు రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తవుతుందా? ఛాన్సెంత? దశాబ్ధాలుగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ కి అలవాటు పడ్డ జనానికి సుకుమార్ కొత్తగా ఏం చూపిస్తాడు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారడానికి ఇంకో ఏడాదిన్నరే ఉంది.. వారణాసి వచ్చి పాన్ వరల్డ్ లెవల్లో తెలుగు సినిమాను వెలిగిస్తుందనే అంతా ఆశపడుతున్నారు. 55 వేల థియేటర్స్ లో మన సినిమా హౌజ్ ఫుల్ అవుతుందో లేదోకాని, 10 వేల కోట్ల వసూళ్లే టార్గెట్ గా ఈ సినిమా ప్లాన్ చేశారంటున్నారు. కాని అదంతా ప్రచారంలో భాగం అంటున్నారు.ఐదు వేలకోట్లే ప్రస్థుత టార్గెట్ అన్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు రియాలిటీ చూస్తే, వారనాసి రెండు భాగాలు కాదు, ఒకే భాగం అని రాజమౌళి తేల్చాడు. కాబట్టి ఈ దసరాలోపు షూటింగ్ పూర్తవుతుంది. నెల మహేశ్ బాబు రెస్ట్ తీసుకున్నా, ఆతర్వాత తను ఫ్రీ... సో సందీప్ రెడ్డి సినిమా చేస్తాడా అంటే, ఛాన్సేలేదు. తన స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ ఇయర్ఎండింగ్ వరకు నడిచేలా ఉంది.
తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ప్లాన్ చేస్తున్నట్టు తేల్చాడు. అంతే మహేశ్ బాబుతో సందీప్ సినిమా 2029 వరకు పట్టాలెక్కే ఛాన్స్ లేదు. మరైతే, తనేం చేస్తాడు.. ఈ ప్రశ్నకే సుకుమార్ నుంచి సాలిడ్ ఆన్సర్ రెడీ అయినట్టుంది. ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ లాంటి సినిమా చేయాలనేది మహేశ్ బాబు డ్రీమ్. తన తండ్రి దారిలోనే ఒకసారి కౌబాయ్ మూవీ చేశాడు.కాని గూఢచారి మూవీవిషయంలో తన కల కలగానే ఉంది. స్పైడర్ సినిమా చేసినా, అదేం జేమ్స్ బాండ్ జోనర్ లో లేదు... ఇక వారణాసి లో ఇండియానా జోన్స్ తరహా సాహసాలు తను చేస్తున్నాడంటున్నారు. కొంతవరకు జేమ్స్ బాండ్ స్టైల్లో సాహసాలున్నా, దీంతో వారణాసిని పోల్చలేం. అందుకే మహేశ్ డ్రీమ్ ప్రాజెక్ట్ విసయంలో సుకుమార్ నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి.
తనిప్పుడు తన శిష్యుడు తీస్తున్న పెద్ది ప్రాజెక్ట్ రిపేర్లు చేస్తున్నాడు. అది ఈ సమ్మర్ లో రాబోతోంది. వేసవి ఎండింగ్ లోగా చరణ్ తో సుకుమార్ సినిమా మొదలౌతుంది. దాని టాకీ పార్ట్ 2027 జనవరిలోగా పూర్తవ్వొచ్చంటున్నారు. అదే జరిగితే, దసరా తర్వాత మహేశ్ ఫ్రీ అవుతాడు.. కాబట్టి 2027 లోనే మహేశ్ బాబుతో సుకుమార్ సినిమా మొదలవ్వొచ్చు.. ఆల్రెడీ స్టోరీ లైన్ వినిపించని సుకుమార్, మోస్ట్ లీ చాలా స్టైలిష్ స్పై మూవీ ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది జేమ్స్ బాండ్ జోనర్ లో వచ్చే సినిమానే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.