600 కోట్ల సూపర్ స్టార్.. వన్ @ నేనొక్కడినే…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆల్ ఆఫ్ సడన్ గా 600 కోట్లకు ఎగబాకాడంటే నమ్ముతారా? ఇది ఇండియన్ ఫిల్మ ఇండస్ట్రీనే షేక్ చేసే వార్త.. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు సూపర్ స్టార్.

Post Published By: dialnews
Updated : 23 April 2026, 6:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆల్ ఆఫ్ సడన్ గా 600 కోట్లకు ఎగబాకాడంటే నమ్ముతారా? ఇది ఇండియన్ ఫిల్మ ఇండస్ట్రీనే షేక్ చేసే వార్త.. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు సూపర్ స్టార్. కట్ చేస్తే 600 కోట్లతో ఖాన్లు, కపూర్లే కాదు, రజినీకాంత్ నుంచి ప్రభాస్ వరకు అందరిని దాటేస్తున్నాడు. ఇంకా వారణాసి రిలీజ్ కాలేదు. దానికింకా ఏడాది పైనే టైం ఉంది. ఇది వచ్చి వండర్స్ చేస్తే సరే పాన్ వరల్డ్ మూవీ కదా, 600 కోట్లకు తన రెమ్యునరేషన్ పెరిగిందనుకోవచ్చు. కాని అలాంటి పరిస్థితులేవి లేవు.. ఐనా విచిత్రంగా, ఎన్టీఆర్ 370 కోట్ల రెమ్యునరేషన్ ని, ప్రభాస్ 550 కోట్ల పారితోషికాన్ని మించిపోయాడు. ఇదెలా సాధ్యం అవుతోంది? ఇందులో నిజం ఎంతుంది? ఈప్రశ్నకి మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్స్ వారనాసి లెక్కలే ఇస్తున్నాయి... అవేంటో చూడండి.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ పూనకాలు వచ్చే టైం ఇది... మహేశ్ బాబు రెమ్యునరేషన్ కి రెక్కలు కాదు, రాకెట్లు తోడవుతున్నాయి..అమాంతం 150 కోట్ల నుంచి 600 కోట్లకి రెమ్యునరేషన్ ఎగబాకేసింది. ఆల్ మోస్ట్ ఇది ఫైనల్.. అయితే మరో వందో రెండోందలకోట్లో లేదంటే 1000 కోట్లుకూడా తనపారితోషికం పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు... లీస్ట్ నెంబరే 600 కోట్లు, మ్యాగ్జిమమ్ నెంబర్ 1000 కోట్ల పైమాటే.. ఇంత రెమ్యునరేషన్ ఎవరూ తీసుకోలేదు..ఇప్పుడప్పట్లో తీసుకునే అవకాశం ఉందా అంటే చెప్పే పరిస్థితి లేదు. కాని ఈ లెక్కలు బయట పడటానికి రీజన్ మాత్రం పుష్పరాజే... అల్లు అర్జున్ వల్లే సూపర్ స్టార్ ఇప్పుడు ఇండియాలోనే నెం.1 వన్ స్టార్ గా ఫోకస్ అయ్యేలా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మహేశ్ బాబు గుంటూరు కారం వరకు ఎన్ని సినమాలు చేసినా, 200 కోట్ల నుంచి 300కోట్ల వసూళ్లే తనకి పరిచయం... అందులో తన రెమ్యునరేషన్ 120 కోట్ల నుంచి 150 కోట్లే... అలాంటి తను ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్లు పడలేదు. అయినా 600కోట్ల స్టార్ గా ఎలా మారాడు.

అంతా వారణాసి మహిమే... ఇది రాజమౌలి సినిమా కావొచ్చు.. 1400 కోట్లు లో మహేశ్ బాబుకి 100 కోట్లే పారితోషికంగా ఇచ్చి ఉండొచ్చు.. కాని సూపర్ స్టార్ కి ఇంకా 500 కోట్ల నుంచి 900 కోట్లు అదనంగా రాబోతున్నాయి... పాన్ వరల్డ్ మూవీగా వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాకే 600 కోట్ల స్టార్ అవుతాడో? వెయ్యికోట్ల స్టార్ గా ఎదుగుతాడో తేలబోతోంది. పుష్పమూవీకి పారితోషికం నామమాత్రంగానే తీసుకున్న బన్నీ,వాటామాత్రం గట్టిగానే తీసుకున్నాడు. ఫలితంగా, రెండు భాగాల పుష్ప 2 వేల కోట్ల వరకు రాబడితే, అందులో 620 కోట్లు బన్నీకి దక్కాయి.అంటే మొదటి భాగానికి 220 కోట్లు రెండో భాగానికి 400 కోట్లు.. ఆలెక్కన బన్నీ 400 కోట్ల స్టార్ గా మారినట్టు... అయితే ఆరెండో హిట్లతర్వాతే బన్నీ రెమ్యూనరేషన్ పెరిగింది. కాని వారణాసి మూవీ రాకముందే మహేశ్ రేంజ్ 600 కోట్ల నుంచి 1000 కోట్లకు చేరేలా ఉంది.వారణాసి ఓటీటీ రైట్సే 1000 కోట్లు పలుకుతున్నాయి. ఇక 55 వేల థియటేర్స్ లోరిలీజ్ అంటే, థియేట్రికల్ బిజినెస్సే ఈ సినిమా యావరేజ్ గా ఆడితే 3 వేల కోట్లు, కొద్దిగా పర్లేదనిపిస్తే 4 వేల కోట్లు రాబట్టొచ్చు.

ఏమాత్రం టాక్ బాగున్నా 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్లు రాబట్టే స్టామినా వారనాసికి ఉంది. సో వారణాసి ప్రాఫిట్స్ లో ప్రొడ్యూసర్ కి 50శాతం, డైరెక్టర్ కి 35 శాతం, హీరోకి 15 శాతం వాటా పరంగా చూస్తే... మినిమమ్ 600 కోట్ల నుంచి మ్యాగ్జిమమ్ 1000 కోట్ల వరకు మహేశ్ రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చేలా ఉన్నాయి. ఇది ప్రీరిలీజ్ బిజినెస్ టైంలోనే జరగొచ్చని కూడా తెలుస్తోంది. అంటే ఖాన్లు, కపూర్లే కాదు, 370 నుంచి 450కోట్ల మధ్య ఉన్న ఎన్టీఆర్ పారితోషికం కంటే, 550 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ... అలాంటి వండర్ విడుదలకు ముందే వారణాసి రూపంలో మహేశ్ కి సాధ్యం కాబోతున్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 23 April 2026, 6:00 PM IST