3 సినిమాలు.. 3 ఏళ్లు.. 15000 కోట్లు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇది మాత్రం అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ రాకున్నా, ఆల్ మోస్ట్ కన్పామ్ అయిన వార్తే.. అదే 2027 నుంచి వరుసగా నాలుగేళ్లు ప్రతీ ఏడాది బాక్సాఫీస్ మీద సూపర్ స్టార్ దాడి ఉండబోతోందని

Post Published By: dialnews
Updated : 28 April 2026, 5:30 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇది మాత్రం అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ రాకున్నా, ఆల్ మోస్ట్ కన్పామ్ అయిన వార్తే.. అదే 2027 నుంచి వరుసగా నాలుగేళ్లు ప్రతీ ఏడాది బాక్సాఫీస్ మీద సూపర్ స్టార్ దాడి ఉండబోతోందని. డెడ్ లైన్ కూడా సంక్రాంతే.. అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇక మీదట తను సంక్రాంతి బుల్లోడిగా మారబోతున్నాడా? వారనాసి వళ్ల కోల్పోయిన 3 ఏళ్ల టైం ని మూడు మూవీలతో రీసెట్ చేయబోతున్నాడా? ఇవి డౌట్లు కాదు. ఆల్ మోస్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీసుకున్న సాలిడ్ నిర్ణయాలు. మైత్రీ మూవీ మేకర్స్ తో ఆల్రడీ డీల్ అయిపోయింది. ఇప్పుడు సీన్ లోకి సుకుమార్, సందీప్ రెడ్డి పేర్లు వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఇక మిగిలింది ప్రశాంత్ నీలే... ఇదంతా బానే ఉంది కాని, నిజంగా వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తర్వాత, అమాంతం పెరిగే మహేశ్ బాబు ఇమేజ్ భారాన్ని వీళ్లు మోయగలరా? అలా జరగాలంటే ఎలాంటి కథ కావాలి? అసలు వీళ్ల కాంబోలో ఇంకెలాంటి మూవీ రావొచ్చనే అంచనాలున్నాయి?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారనాసి ఈ ఏడాది ఆగస్ట్ లోగా షూటింగ్ పూర్తి కాబోతోంది. ప్యాచ్ వర్క్ దసరాలోగా పూర్తి చేసి, అప్పటినుంచే రియల్ ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నారు.. తర్వాతేంటి? ఈ ప్రశ్నకే ఒకసారి సుకుమార్ తో సినిమా, లేదు సందీప్ రెడ్డి తోమూవీ అని రకరకాల రూమర్స్ వచ్చాయి.. అయితే ఎవరితో మూందు సినిమా మొదలౌతుందనేదానికంటే కూడా, మరో అంశం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.అదే మూడేళ్లే మూడు సినిమాలు, ప్రతీ సంక్రాంతికి సూపర్ స్టార్ మాస్ దండయాత్రలు.. ఇది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ తో చాలా పెద్ద డీల్ కి ఓకే చేశాడు మహేశ్ బాబు.. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఈ డీల్ వల్ల, తను చేసే ప్రతీ మూవీకి 30శాతం ప్రాఫిట్ లో షేర్ ని సొంతం చేసుకోబోతున్నాడు మహేశ్ బాబు.

వారణాసి పుణ్యమాని ఆల్రెడీ ఏడాది మీద 10నెల్ల టైం గడిచింది. మరో ఏడాది కూడా ఇటు షూటింగ్, అటు ప్రమోషన్ కోసం పోయేలా ఉంది. అంటే వారణాసీ వల్ల 3 ఏళ్లు సమర్పయామి..అందుకే అలాంటి గడిచిని టైం ని మూడు సినిమాలతో, గ్యాప్ ని ఫిల్ చేయబోతున్నాడు మహేశ్. అందుకే ఒకే సారి మూడు మూవీలను ఓకే చేసేలా ఉన్నాడు.2027 దసరాకు సూపర్ షాక్ వేవ్ రాబోతోంది. అంటే విజయ దశమికి ఒకే రోజు ఒకేసారి, మూడు మహేశ్ బాబుసినిమాలు మొదలయ్యేలా ఉన్నాయి. ఇప్పటికిది మైత్రీ మూవీమేకర్స్ ప్రపోజల్ మాత్రమే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నట్టు ప్రచారంజరుగుతోంది. సుకుమార్ చెప్పిన కథ, సందీప్ రెడ్డి వంగ చెప్పిన కథ, ఈరెండీంటికి సూపర్ స్టార్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక తేలాల్సింది ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పరిస్థితే.. రామ్ చరణ్ మూవీ తర్వాత సుకుమార్ తో మహేశ్ మూవీ మొదలౌతుంది. ఇక స్పిరిట్ తర్వాత వెంటనే యానిమల్ 2 చేయాల్సిన సందీప్, రణ్ బీర్ రామాయణం 2 తో బిజీ అవటం వల్ల, మహేశ్ బాబుకే షిఫ్ట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ కూడా డ్రాగన్ రెండు భాగాలు, అలానే త్రివిక్రమ్ మూవీ వల్ల కొరటాల దేవర2 ని హోల్డ్ లో పెట్టేశాడు. అందుకే సందీప్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడప్పుడే మొదలు కాకపోవచ్చుఎలా చూసినా సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్టులు మహేశ్ బాబుతోనే కన్పామ్ అవుతున్నాయి. డ్రాగన్ 2 భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ కూడా మహేశ్ తోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఆలెక్కన 2027 ఏప్రిల్ లో వారణాసి వస్తే 2028 సంక్రాంతికి సుకుమార్ సినిమా, 2029 సంక్రాంతికి సందీప్ రెడ్డి మూవీ, 2030 కి ప్రశాంత్ నీల్ మూవీ రావొచ్చు.. ఇలా 3 ఏళ్లలో మూడు సినిమాలు, ఏడాదికోసారి సినీ సంక్రాతి వచ్చేలా మహేశ్ బాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇదే నిజమైతే, వారనాసితో కలుపుకుని వరుసగా 4 ఏళ్ళు నాలుగు సినిమాలతో సూపర్ సునీమీ రావటం ఖాయం.. గడిచిన 3 ఏళ్ల గ్యాప్ ని ఇలా ఫిల్ చేయగలిగితే, వారణాసి తర్వాత వేగం పెంచి, పెరిగిన మార్కెట్ ని మహేశ్ బాబు క్యాష్ చేసుకోవటం ఖాయం.

Published : 
  • 28 April 2026, 5:30 PM IST