D ఫర్ డిసిప్లేన్.. 10 కేజీల వెనక టన్ను నిర్ణయం…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డిసిప్లీన్ ఎంత పవర్ ఫులో ప్రూవ్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు పది కేజీల వేయిట్ ని ఏడు వారాల్లో తనెలా తగ్గాడో ఇప్పుడు న్యూస్ రూపంలో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది

Post Published By: dialnews
Updated : 23 March 2026, 5:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డిసిప్లీన్ ఎంత పవర్ ఫులో ప్రూవ్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు పది కేజీల వేయిట్ ని ఏడు వారాల్లో తనెలా తగ్గాడో ఇప్పుడు న్యూస్ రూపంలో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బేసిగ్గా 7 వారాల్లో 10 కిలోల వేయిట్ తగ్గటం ఆల్ మోస్ట్ ఇంపాజిబుల్... ఓరకంగా వారానికి కేజీంబావు తగ్గినట్టే... రెండు మూడు కేజీలు లేదంటే నాలుగు కేజీల వరకు ఇలా తగ్గొచ్చేమో కాని, పది కిలోల వేయిట్ తగ్గటం, అది 14 కిలోలుగా మార్చటం అంటే, ఆల్ మోస్ట్ లైఫ్ తో రిస్క్ చేసినట్టే.. ఆ రిస్క్ నే పక్కన పెట్టాలంటే డీ ఫర్ డిసిప్లేనే దారి.. ఇదే మాట ప్రూవ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఎక్కడా లైపో సక్షన్ లు, లేదంటే ఆర్టిఫీషియల్ పద్దతులు పాటించలేదు.. అంతా న్యాచురల్.. అయినా లైఫ్ రిస్క్ చేసినట్టే.. అంతగా లైఫ్ ని, కెరీర్ నే రిస్క్ చేసేంతగా డ్రాగన్ లో ఎన్టీఆర్ కి ఏం నచ్చింది? ఎందుకింత రిస్క్ చేయాల్సి వచ్చింది?

ఎన్టీఆర్ హెల్త్ రిస్క్, వేయిట్ లాస్, అందుకోసం తను పడ్డ కష్టం ఇవి ఇప్పుడు సడన్ గా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వార్తలు వైరలౌతున్నాయి. కారణం తనకోసం పని చేసిన టీం, ఎన్టీఆర్ తన లైఫ్ తో ఎంత రిస్క్ చేశాడో రివీల్ చేయటం. ముందు సన్నబడటం, మల్లీ బొద్దుగా, లేదంటే మజిల్స్ పెంచటం ఎన్టీఆర్ కొత్త కాదు.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.. కాని ఎన్టీఆర్ ప్రజెంట్ లుక్ చూస్తే ఎవరికైనా షాక్ తగులుతుంది. డ్రాగన్ కోసం బక్కపలుచగా తయారవ్వాలని ప్రశాంత్ నీల్ అంతా అలా అయ్యాడు. దాని ఎఫెక్ట్ వార్ 2 మూవీలో తన లుక్ మీద కూడా పడినా, అలానే కంటిన్యూ చేశాడు. కట్ చేస్తే డ్రాగన్ లో రెండో పాత్ర కోసం మరింతగా 4 కిలోలు తగ్గాడు.. మొత్తంగా ఒకసారి పదికిలోల వేయిట్ తగ్గాడు. తర్వాత తండ్రి పాత్రో లేదంటే తాత పాత్ర ఫ్లాష్ బ్యాక్ కోసమో మరో 4 అంటే మొత్తంగా 14 కిలోల వేయిట్ తగ్గాడు.

ఇది అప్పట్లోనే షాకింగ్ న్యూస్ గా మారింది. కాకపోతే ఇప్పడు మళ్లీ వార్తల్లోకి రావటానికి రీజన్, షార్ట్ టైంలో అలా ఎలా ఎన్టీఆర్ బక్కపలుచగా తయారయ్యాడో తన టీం రివీల్ చేయటం. కేవలం 7 వారాల్లో ఎన్టీఆర్ పది కిలోల వేయిట్ తగ్గాడని తేల్చింది తన ఫిట్ నెస్ టీం. త్రిబుల్ ఆర్ కోసం కండలు పెంచి, దేవరకోసం కాస్త బొద్దగా తయారైన ఎన్టీఆర్, ఆల్ ఆఫ్ సడన్ గా సన్న బడాల్సి వచ్చింది.ఐతే అది షార్ట్ పీరియడ్ లో అవటంతో, అంతా షాకయ్యారు. కాని ఇందుకోసం తనేం షార్ట్ కట్ లు వాడలేదు. డైట్ మార్చి, రోజుకి 90 నిమిషాల వర్కవుట్లు చేసే, న్యాచురల్ గానే 10 కిలోలు ముందు తగ్గాడు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వన్ వీక్ లో రెండు కిలో ల వేయిట్ కూడా తగ్గొచ్చు.. అలా నాలుగు కిలోల వరకు రిస్క్ లేకుండా రెండు వారాల్లో తగ్గొచ్చు. కాని అంతకు మించి వెంట వెంటనే వేయిట్ తగ్గితే, బాడీలో ఆర్గాన్స్ రిస్క్ లో పడే ఛాన్స్ఉంది

ముఖ్యంగా గుండె, కిడ్నీల మీద ఎఫెక్ట్ భారీగా ఉంటుందట. అందుకే 7 వారాల్లో 10 కిలోలు తగ్గటమంటేనే లైఫ్ రిస్క్.. అలాంటిది రెండో పాత్రకోసం మరో 4 కిలోలు వేయిట్ తగ్గటం అంటే, రిస్క్ లోకి లైఫ్ ని మరింతగా నెట్టేయటమే. అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఒకే ఒక్క ఆయుధం తోడైంది. దటీజ్ డిసిప్లేన్.. తను నీల్లు తాగటం మానలేదట. డైట్ లో ఫుట్ మార్చలేదట. కంటిన్యూయస్ గా 7 వారాలు ఒకటే డైట్, ఒకటే పద్దతిలో వర్కవుట్లు..ఎక్కడా డిసిప్లేన్ లో లోపం లేకుండా కష్టపడ్డాడు.. నిద్ర విషయంలో కూడా ఛాన్స్ తీసుకోలేదు.. అందుకే హెల్త్ రిస్క్ తగ్గి, చాలా సహజ పద్దతిలో మొత్తంగా 14 కిలోల వేయిట్ తగ్గాడు.. ఇంత లైఫ్ రిస్క్ చేయటానికి కారణం, చైనీస్ లెజెండ్ బ్రూస్లీ రియల్ లైఫ్ ఇన్స్ డెంట్స్ కి బేస్ చేసుకుని, తీస్తున్న ఫిక్షన్ డ్రామా అవటం, కథలోనే కాదు పాత్రల్లో కూడా చాలా వేరియేషన్స్ ఎన్టీఆర్ కి నచ్చటం... చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తను నమ్మాడు కాబట్టే, ఇంతగా లైఫ్ రిస్క్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

Published : 
  • 23 March 2026, 5:15 PM IST