2 డ్రాగన్లు.. 3 సూపర్ స్టార్లు.. మాస్ మేకోవర్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క డ్రాగన్ మూవీ కోసం రెండు మేకోవర్లతో షాక్ ఇస్తున్నాడు. ఒకటి టెన్ ప్యాక్స్ లుక్ అయితే, ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్ పాత్ర కోసం జీరో సైజ్ లుక్.

Post Published By: dialnews
Updated : 3 March 2026, 8:45 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క డ్రాగన్ మూవీ కోసం రెండు మేకోవర్లతో షాక్ ఇస్తున్నాడు. ఒకటి టెన్ ప్యాక్స్ లుక్ అయితే, ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్ పాత్ర కోసం జీరో సైజ్ లుక్. అదే తండ్రి పాత్రని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సమస్య ఏంటంటే, జస్ట్ మేకోవర్ అంటే డ్రెస్ మార్చటమో, క్రాఫ్ మార్చటమో అయితే పర్లేదు. ఏకంగా కండలు కరిగించటం, లేదంటే కండలు పెంచటం.. ఇది ఒక్కరోజు లో అయ్యేది కాదు. మేకప్ మెన్ ఏదో మాస్క్ వేస్తే మారేది కాదు... విచిత్రం ఏంటంటే ఇలాంటి మూడు మేకోవర్లతో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వారణాసి లో రిస్క్ చేస్తున్నాడు. స్పిరిట్ కోసం ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నబడ్డాడు... ఇప్పుడు చరణ్, బన్నీ వంతొచ్చింది... నిజంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్రాజెక్టు లకోసం మన స్టార్లు లైఫ్ తో రిస్క్ చేస్తున్నారా? ఇక మీదట ఏ సినిమా చేసిన మేకప్ తో మ్యానేజ్ చేయటం కుదరదా?

ఎన్టీఆర్ ని డ్రాగన్ లో రెండు పాత్రల్లో చూడటం అనేది కన్పామ్ అయిన విషయమే.. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో, తండ్రిగా, కొడుగ్గా రెండు పాత్రల్లో, రెండు స్పెషల్ గెటప్స్ కోసం, బరువు తగ్గటం, తర్వాత పెంచటం లాంటివి చేస్తున్నాడు ఎన్టీఆర్. ఒకప్పుడు పాత్ర కోసం మేకోవర్ అంటే, విగ్ పెట్టుకోవటం, లేదంట మేకప్ తో మ్యానేజ్ చేయటం...ఇవే జరిగేవి.. కాని డ్రాగన్ కోసం ఎన్టీఆర్ రియాలిటీనే నమ్ముకుున్నాడు. అందుకే డ్రాగన్ లో రెండు పాత్రల కోసం తన లుక్ ని నిజంగా మార్చుకున్నాడు. సన్నగా ఒక పాత్ర, మరింత బక్కి చిక్క తండ్రి పాత్ర అది కూడా పెద్ద గడ్డంతో... ఇలా తన లుక్ మార్చుకోవాలంటే, డైట్ మేయింటేన్ చేయాలి.. జుట్టు, గెడ్డం పెంచాలి. అందుకోసం నెల, రెండు నెలలకు పైనే కష్టపడాలి.

పాన్ ఇండియాని షేక్ చేయాలన్నా, పాన్ వరల్డ్ ని కుదిపేయాలన్నా ఇలాంటి రిస్క్ చేస్తేనే, రీచ్ పెరుగుతుంది.అందుకే భారీ స్కేల్ లో సినిమాలు ప్లాన్ చేసే హీరోలంతా, వాళ్ల సొంత బాడితో కబాడి ఆడేస్తున్నారు... ఆవిషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈపాటికే వారణాసిలో మూడు పాత్రలకోసం రెండు మేకోవర్ల తో షాక్ ఇచ్చాడు.ఒకటి లాంగ్ హేయిర్, పొడవాటి గడ్డం లుక్ అయితే, మరొకటి రుద్రుడి పాత్ర... ఇక రామాయణం పాత్రకి గ్రాఫిక్స్ లో ఎంత కవరింగ్ చేసినా, రియాలిటీలో కూడా తన లుక్ లో మార్పులు అవసరం. అందుకే ఈ సారి బైసెప్స్, ట్రై సెప్స్ తో తన లుక్కే మార్చుకోబోతున్నాడు. మొత్తంగా మూడు పాత్రల కోసం, మూడు మేకప్ లు కాకుండా, మూడు లుక్స్ మారాలే, రియాల్ గా తనని తాను మార్చుకున్నాడు.. ఇంకా మార్చుకుంటున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ కూడా స్పిరిట్ మూవీ కోసం సన్నబడ్డాడు.. టెన్ ప్యాక్స్ లుక్ కోసం మోకాలికి సమస్య వచ్చినా వర్కవుట్లు ఆపలేదు... కల్కీ సీక్వెల్ కోసం ఇప్పుడు కండలు పెంచాల్సి వస్తే, పెంచకుండా ఉండట్లేదు. కాని దానికి స్పిరిట్ షూటింగ్ తో సమస్య వచ్చే చాన్స్ ఉంది. కాబట్టే రెండీంటికి ఇబ్బంది కాకుండా, తన లుక్ ని న్యూట్రల్ గా ఉండేలా చేసుకున్నాడని తెలుస్తోంది.ఎలా చూసినా ఒక్కో మూవీలో ఒక్కో పాత్రకోసం డ్రెస్ మార్చినంత తేలిగ్గా, తన బాడీ వేయిట్ తగ్గించటం, పెంచటం, కండులు పెంచటం, తగ్గించటంలాంటివి చేస్తున్నారు పార్ ఇండియా స్టార్స్. ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా కండలు పెంచే ప్రాసెస్ లోనే ఉన్నారు తప్ప, సన్నబడే పాత్రల వరకు వాళ్లింకా వచ్చినట్టు లేరు.. ఏదేమైనా, ఎన్టీఆర్,మహేశ్, ప్రభాస్ ఈ ముగ్గురు సినిమాలతో ప్రయోగాలు చేసే ప్రాసెస్ లో వాళ్ల వాళ్ల శరీరాలు, ఆరోగ్యాలతో ప్రయోగాలు చేసేస్తున్నారు.

Published : 
  • 3 March 2026, 8:45 PM IST