మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని రాజమౌళి కేవలం ఫ్రెండ్ షిప్ వల్లే కలుస్తున్నాడా? త్రివిక్రమ్ వెన్నుపోటుకు సరైన పంచ్ ఇచ్చిన ఎన్టీఆర్, సడన్ గా జక్కన్న సాయం తీసుకుంటున్నాడా? అసలే ఒక వైపు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమా జూన్ లోగా పూర్తవుతుందని తేలింది. దర్శకుడే ఆవిషయం చెప్పాడు.. దీంతో రాజమౌళి నెక్స్ ఎవరితో సినిమా చేస్తాడనే డిస్కర్షన్ జరుగుతోంది. ఐతే ఎన్టీఆర్ తో లేదంటే, రెబల్ స్టార్ ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ని రాజమౌళి కలుస్తున్నాడా? కలిశాడా? ఈ రెండీంట్లో ఏది నిజమని తేలినా, భూమి భద్దలే... ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోంది రాజమౌళి ఇలా మరో హీరోని కలవడ.... ఆల్రెడీ స్టూడెంట్ నెం.1 నుంచి త్రిబుల్ ఆర్ వరకు ఈ కాంబినేషన్ నాలుగు సార్లు సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఇప్పుడు ఐదో సారి పాంచ్ పటాకా కన్ఫామా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌలి నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఎక్కడా ఎనౌన్స్ మెంట్ లేదు. ఎలాంటి సౌండ్ లేదు. కాని సమ్ థింగ్ ఫిషీ.. రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ ని కలిశాడని ఒక వార్త.. లేదు కలవబోతున్నాడని మరో వార్త.. రెండూ అన్ అఫీషియలే.. కాని ఏదో రూమర్ లా మాత్రం ఇది కనిపించట్లేదు.. ఎందుకంటే, వారణాసి మూవీ షూటింగ్ 50శాతం పూర్తైంది. జూన్ కల్లా మిగతా సగం పూర్తవటమే కాదు, అదే జూన్ కల్లా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తవుతుంది.
ఆల్రెడీ 70శాతం పోస్ట్ ప్రొడక్షణ్ ని, గ్రాఫిక్స్ కి మొదటి నుంచే ప్యార్ లల్ గా పూర్తి చేస్తున్న వచ్చిన రాజమౌళి, జులై నుంచి వారనాసి ప్రమోషన్ కోసమే 6 నెలలు కేటాయించాడు.. అలాంటప్పుడు ఎన్టీఆర్ తో సినిమా ఇప్పుడప్పుడే ఎలా ప్లాన్ చేస్తాడానేది అందరికి వచ్చే డౌట్.. కాని ఒక సినిమా పట్టాలెక్కినప్పడే, నెక్ట్స్ మూవీ కోసం ఓ స్టోరీలైన్ అనుకుని, దాని మీద కూర్చోమని తన తండ్రికి చెప్పే రాజమౌళి, ఇప్పుడు అదే పనిచేస్తున్నాడా?ఔను రాజమౌళి నుంచి ఆల్రెడీ తన తండ్రి విజయేంద్రప్రసాద్ కి స్టోరీలైన్ మీద చర్చలు, దాన్ని డెవలప్ చేయమని ఆర్డర్లు జరిగిపోయినట్టుతెలుస్తోంది. కాకపోతే ఆ కథ ఎన్టీఆర్ కోసమా? లేదంటే ప్రభాస్ కోసమా అన్న డౌట్లు వినిపించాయి. మధ్యలో బన్నీ కోసం రాజమౌళి అడుగు ముందుకేసేలా అల్లు అరవింద్ చక్రం తిప్పుతున్నాడన్నారు.
కాని తన సెట్లో హీరోలెవరున్నా, తానే హీరో అన్నది రాజమౌైళి కాన్సెప్ట్.. అందుకే బన్నీ అప్రోచ్ నచ్చని రాజమౌళి, తనతో ఇంతకాలం సినిమా తీయలేదు, తీయట్లేదు అని కూడా ప్రచారం జరిగింది. అందులో నిజం ఎంతున్నా, ప్రస్తుతానికి ఎన్టీఆర్, రాజమౌళి మీటింగే సమ్ థింగ్ ఫిషీ... రాజమౌైళి పిలిస్తే, సినిమా షూటింగ్ సగంలో ఉన్న వచ్చి వాలిపోయేంత స్నేహం ఎన్టీఆర్ ది..ఈ ఇద్దరి జర్నీ కూడా ఆల్ మోస్ట్ ఒకేసారి మొదలైంది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ అన్నీ సాలిడ్ బ్లాక్ బస్టర్లే.. అన్నీ కూడా ఆల్ మోస్ట్ మాస్ జోనర్ లో వచ్చిన ట్రెండ్ సెట్టర్సే..కాని ఇంత అర్జెంట్ గా ఎన్టీఆర్ ని రాజమౌలి కలవటమో, కలవబోతుండటమో జరగటానికి రీజన్, రాజమౌలి, ఎన్టీఆర్ కి ఎప్పటి నుంచో నచ్చిన ఒక స్టోరీలైన్ లో వచ్చిన డెవలప్ మెంటే... అది కూడా దర్శకుడు దేవా కట్టా సలహాతో వచ్చిందని తెలుస్తోంది... ఏదేమైనా చాలా త్వరగా ఏదో మాసీ సాలిడ్ అప్ డేట్ వచ్చేలా ఉందని మాత్రం కన్ఫామ్ గా తెలుస్తోంది.