RRR రిపీటైతే పూనకాలే..? మరో నాటు కొట్టుడు..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేస్తే, గ్లోబ్ షేక్ అయ్యింది. నాటు నాటు పాటకి హాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఆపాటకి ఆస్కార్ కూడా దక్కింది. అవతార్, జురాసిక్ పార్క్ ని తీసిన దర్శకులని కూడా ఈ మూవీ ఫిదా చేసింది.

Post Published By: dialnews
Updated : 19 April 2026, 8:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేస్తే, గ్లోబ్ షేక్ అయ్యింది. నాటు నాటు పాటకి హాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఆపాటకి ఆస్కార్ కూడా దక్కింది. అవతార్, జురాసిక్ పార్క్ ని తీసిన దర్శకులని కూడా ఈ మూవీ ఫిదా చేసింది.  కట్ చేస్తే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి కటౌట్లను కలిపి సినిమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేస్తే, గ్లోబ్ షేక్ అయ్యింది. నాటు నాటు పాటకి హాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఆపాటకి ఆస్కార్ కూడా దక్కింది. అవతార్, జురాసిక్ పార్క్ ని తీసిన దర్శకులని కూడా ఈ మూవీ ఫిదా చేసింది.మా తీయాలంటే అది రాజమౌలికే సాధ్యం.. తను కాబట్టి, తన మీదున్న నమ్మకంతో ఈ ఇద్దరు కలిసి నటించారు.. కథ పరంగా, మేకింగ్ పరంగా రాజమౌళికి ఏదైనా కూడా సాధ్యమే అన్న విశ్వాసమే త్రిబుల్ ఆర్ కి కారణం.. కట్ చేస్తే మళ్లీ ఈ కాంబో కుదిరేలా కనిపిస్తోంది..2030 కి ఆ ప్రాజెక్ట్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తుందా?.. ఈ స్పెక్కులేషన్ కి కూడా రాజమౌళినే కారణమా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఒకరు నందమూరి నట వారసత్వం.. మరొకరు మెగా వారసత్వం.. ఇలా రెండు పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన చాలా పెద్ద స్టార్ హీరోలని ఒకే స్క్రీన్ మీద చూపించాలంటే, కథలో దమ్ముండాలి... పాత్రల్లో పవరుండాలి.. ఈ రెండీంటిని బ్యాలెన్స్ చేసేలా మేకర్ దగ్గర మ్యాటర్ ఉండాలి.. అది ఉంది కాబట్టే రాజమౌళి త్రిబుల్ ఆర్ తీశాడు.నిప్పుని, నీటిని కలిపి వెండితెరమీద తుఫాన్ క్రియేట్ చేశాడు. దెబ్బకకి 1400 కోట్ల వసూళ్లొచ్చాయి.. వరల్డ్ వైడ్ గా నాటు పాటకి అమెరికన్లు, యూరోపియన్లు క్యూ కట్టే పరిస్థితులొచ్చాయి.. హాలీవుడ్ స్టార్లు, టెక్నీషియన్లు అయితే త్రిబుల్ ఆర్ మేకింగ్ కిఫిదా అయ్యారు. అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరున్, జూరాసిక్ పార్క్ మేకర్ స్పిల్ బర్గ్ ఇలా అంతా త్రిబుల్ ఆర్ కి పడిపయారు.

ఇంత రచ్చ చేసిన త్రిబుల్ ఆర్ కాంబినేషన్ మల్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది. అలాంటిదేదైనా ఉంటే, ఈపాటికే వార్త వైరలవ్వాలి.. కాని అలాంటిదేం వినిపించట్లేదు. కనీసం త్రిబుల్ ఆర్ సీక్వెల్ కూడా పట్టాలెక్కేలా కనిపించట్లేదు. మరెలా మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తారు.. దానికి కూడా కారణం రాజమౌలినే... ఔను వారణాసి తర్వాత తన లెక్కలు మారేలా ఉన్నాయి.వారణాసి రెండు భాగాలుగా రిలీజ్ అవటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అనంటున్నారు. అలాని బాహుబలి 1, వచ్చిన 2 ఏళ్లకు బాహుబలి 2 వచ్చినట్టు కాకుండా, వారణాసి 1, వారణాసి 2 వెంట వెంటనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. 2027 ఏప్రిల్ లో గ్లోబ్ ట్రాటర్, 2028 ఏప్రిల్ లో టైం ట్రాటర్ రావొచ్చు... ఆతర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబనేషన్ లో ఇంకేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి నెక్ట్స్ మూవీ అని ప్రచారం జరిగింది. కాని ఏం లెక్కలు మారాయో మొత్తానికి, చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి రాజమౌలి నుంచి కబురు అందినట్టుంది.. వారణాసి టీం సాంగ్ షూట్ తర్వాత మే నెలంతా వేసవి సెలవులు తీసుకోబోతోంది. ఆతర్వాతే సాలిడ్ ఎనౌన్స్ మెంట్ అంటే, చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ మీదే కావొచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

Published : 
  • 19 April 2026, 8:30 PM IST