ఇది మురుగన్ దండయాత్ర.. షణ్ముఖుడి దండయాత్ర…!

గాడ్ ఆఫ్ వార్... షణ్ముఖుడు, కార్తికేయ... మురుగన్.. టైటిల్ ఏదైనా ఎన్టీఆర్ బ్యాటిల్ మాత్రం ఫాంటసీ జోనర్ లోనే ఉండబోతోంది. ఐతే మాటల మాంత్రికుడి తో ఎన్టీఆర్ కమిటైన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలౌతుంది? డ్రాగన్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ బిజీ

Post Published By: dialnews
Updated : 15 April 2026, 7:15 PM IST

గాడ్ ఆఫ్ వార్... షణ్ముఖుడు, కార్తికేయ... మురుగన్.. టైటిల్ ఏదైనా ఎన్టీఆర్ బ్యాటిల్ మాత్రం ఫాంటసీ జోనర్ లోనే ఉండబోతోంది. ఐతే మాటల మాంత్రికుడి తో ఎన్టీఆర్ కమిటైన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలౌతుంది? డ్రాగన్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ బిజీ... వెంకీతో ఆదర్శకుటుంబం రెడీ చేస్తున్నాడు త్రివిక్రమ్... గత వివాదాలు ఎలా ఉన్నా, మురుగన్ బేస్ చేసుకుని తెరకెక్కాల్సిన ప్రాజెక్ట్ కి అన్నీ క్లియరెన్స్ లు దొరికినట్టే అనంటున్నారు. వింటానికి బాగున్నా, ఇంతకి ఈ ఫాంటజీ వార్ ఎపిక్ కి కిక్ స్టార్ట్ ఎప్పుడు? ఎలా? ఇదే పెద్ద ప్రశ్న.. డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ జోలికి పోరా? లేదంటే ఏదైనా సర్ ప్రైజ్ ఉందా? మరి ఈ సర్ ప్రైజ్ ఏంటో తెలిసేది ఎన్టీఆర్ బర్త్ డేరోజేనా? మే 20కి డ్రాగన్ అప్ డేట్ ని మించేలా గాడ్ ఆఫ్ వార్ ఎనౌన్స్ మెంట్ తూఫాన్ క్రియేట్ చేసేలా ఉందా?

ఎన్టీఆర్ షణ్ముఖుడుగా మారే టైం వచ్చిందా? దసరాకు ఏదో సెన్సేషన్ జరగబోతోందా? త్రివిక్రమ్ తో తనకి కథ విషయంలో జరిగిన వివాదం, ఆల్ మోస్ట్ గతం గతహా అనే పరిస్తితి వచ్చిందంటున్నారు. ఆ సంగతి అటుంచిదే, ఇంకెప్పుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకెళుతుందనే ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది.గాడ్ ఆఫ్ వార్ టైటిల్ తోనే వస్తుందా? లేదంటే ఇది క్యాప్షన్ మాత్రమేనా? ఇది మే 20న తేలబోతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 1000 కోట్ల ఎనౌన్స్ మెంట్ వచ్చేఛాన్స్ కనిపిస్తోంది. అంటే బడ్జెట్టే 1000 కోట్లు పెట్టి లార్డ్ సుబ్రహ్మణ్యం బ్యాక్ డ్రాప్ లో ఓ ఫాంటజీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కథ మూలం అందరికి అందుబాటులోనే ఉంది.

తారకాసురుడనే రాక్షసుడి నుంచి దేవతలను కాపాడేందుకు జన్మించిన కార్తికేయుడు, శివుడి ఫైర్ నుంచి పుట్టడం, తనని గంగ తీసుకెళ్లి ఆరు క్రుత్తికల ద్వారా పెంచటం, అందుకే తనకి షణ్మఖుడనే పేరు రావటం జరిగింది. ఏదైనా సమస్య వస్తే జనం గుడికెళతారు. దేవుళ్లని పూజిస్తారు.. అలాంటి దేవుల్లకే కష్టం వస్తే... వాళ్లకోసం మురుగన్ ఫైట్ చేస్తాడు..ఇది లార్డ్ సుబ్రహ్మణ్య కథలో ఉన్న సాలిడ్ హీరోయిజం... అదే కథా వస్తువుగా, త్రివిక్రమ్ భారీ ఫాంటజీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడట. మరి ఆ మూల కథని వాడుకుని ఎలాంటి కథని రాశాడో కాని, అదెప్పుడు పట్టాలెక్కుతుందా అన్న ఉత్సుకత ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. ఐతే ప్రజెంట్ వెంకితో ఆదర్శకుటుంబం మూవీ తీస్తున్న త్రివిక్రమ్, దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఇక డ్రాగర్ రెండు బాగాల షూటింగ్ దసరాలోగా పూర్తవుతుందట. అప్పుడే దేవర 2 సెట్స్ పైకెళ్లే ఛాన్స్ఉండటంతో, త్రివిక్రమ్ మూవీ ఆతర్వాత సంక్రాంతికి అంటే, వచ్చ ఏడాదికి మొదలవ్వొచ్చనుకుంటున్నారు. కాని ఇది కూడా దసరా సీజన్ లోనే లాంచ్ అయ్యేలా కనిపిస్తోంది. అందుకే షణ్ముక టైటిల్ తో ఒక పోస్టర్ ని ఎన్ఠీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతోందట త్రివిక్రమ్ టీం. అలా రెడీ చేసిన పోస్టర్ మ్యాటర్ లీకయ్యే, సడన్ గా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడన్న వార్త వైరలౌతోంది.

Published : 
  • 15 April 2026, 7:15 PM IST