మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఇంకా గాడ్ ఆఫ్ వార్ మూవీ తాలూకు మోసం వెంటాడుతోందా? త్రివిక్రమ్ చేసిన పనికి కోపంతో రగిలిపోయిన ఎన్టీఆర్, సంక్రాంతి పండగ తర్వాత జరిగిన పంచాయితీతో మెత్తబడ్డాడన్నారు.. త్రివిక్రమే వచ్చి సారి చెప్పడంతో అంతా కూల్ అయిపోయిందన్నారు. ఇక వెంకటేష్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా పూర్తికాగానే, లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో రెడీ చేసిన గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్నారు.. అంతవరకు బానే ఉంది. కాని చేసిన మోసం, మళ్లీ చేయడని ఏం నమ్మకం..ఇలాంటి మాటలే ఎన్టీఆర్ ని వెంటాడుతున్నాయా? అందుకే త్రివిక్రమ్ ని నమ్మే పరిస్థితి లేదా? ఈ డౌట్లు రావటానికి ఒకటే రీజన్.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ పెట్టిన కండీషన్... ఆ కండీషన్ పరంగా విక్టరీ వెంకటేషే ఇప్పుడు త్రివిక్రమ్ ని కాపాడాలి.. ఎన్టీఆర్ కి దగ్గర చేయాలి... అదే ప్రయత్నం జరుగుతోందా? ఇంతకి వెంకీ మామ ఎందుకు రంగంలోకి దిగాడు? ఈ గొడవ ఇప్పట్లో తేలదా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, తో త్రివిక్రమ్ పంచాయితీ క్లియర్ అయ్యిందన్నారు. సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ కి గట్టిగా క్లాస్ పడిందన్నారు.. మాటల మాంత్రికుడే సారి చెప్పి మొత్తంగా ఎన్టీఆర్ కోపాన్ని తగ్గించి ప్రసన్నం కూడా చేసుకున్నాడన్నారు. కాని పరిస్థితి చూస్తుంటే నివురు కప్పిన నిప్పుడు ఆ మోసం ఇంకా ఎన్టీఆర్ ని దహించి వేస్తున్నట్టే ఉంది.నిజానికి బన్నీ కోసం అనుకున్న కథే అది.. కాని తను అప్పట్లో చేస్తానని చెప్పి చేయకుండా, త్రివిక్రమ్ ని పక్కన పెడితే, ఎన్టీఆర్ కి ఆ కథ చెప్పాడు త్రివిక్రమ. దీంతో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పటం, తన టీం రంగంలోకి దిగి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయటం, ఫైనల్ గా స్క్రిప్ట్ రెడీ అవటం జరిగిందట. ఆతర్వాతే ఫైనల్ స్క్రిప్ట్ ఎందుకు చెప్పాడో కాని, బన్నీకి త్రివిక్రమ్ చెప్పటంతో సడన్ గా మాటల మాంత్రికుడు రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టు మారాడనే కామెంట్స్ వచ్చాయి.
కట్ చేస్తే ఎన్టీఆర్ ఈ మోసాన్ని భరించలేకపోయాడు. లక్కీగా ఈ సినిమా కథ తాలూకు రైట్స్ తానే సొంతం చేసుకోవటం వల్ల, ఈ కథని త్రివిక్రమ్ బన్నీతో తీయాలనుకున్నా తీయలేని పరిస్థితి.. మరి ఇన్ని తెలిసి అలా ఎలా ఎన్టీఆర్ ని మాటల మాంత్రికుడు మోసం చేసి, బన్నీకి ప్రాజెక్ట్ ని షిఫ్ట్ చేయాలనుకున్నాడో కాని, ఫైనల్ గా ఆ కథే తను ముట్టుకోలేని పరిస్థితివచ్చింది.అందుకే మళ్లీ ఎన్టీఆర్ గూటికే తను చేరాడు.. కాళ్లబేరానికి వచ్చాడు. క్షమించమన్నాడు కాని... అదే కథ తాలూకు రైట్స్ ఎన్టీఆర్ తీసుకోకపోయుంటే, ఈ పాటికి బన్నీతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదనే అభిప్రాయముంది.. ఆ ఆలోచనవల్లే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సారిని మనస్పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడట. మరో దర్శకుడితో ఆ సినిమాను పట్టాలెక్కిస్తే, జీవితాంతం తివిక్రమ్ ఒక చీటర్ గా మిగిలిపోతాడనే అభిప్రాయం, ఆ మచ్చని చెరిపేసుకునేందుకే ఎన్టీఆర్ వెంటపడి, క్షమాపన చెప్పి సమస్య సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశాడనే మాట వినిపిస్తోంది.
అసలే అగ్నాత వాసి టైంలో ఇలానే ఫ్రెంచ్ కథని, సీన్ టు సీన్, క్లైమాక్స్ లో కత్తితో సహా కాపీ చేస్తే, ఫ్రెంచ్ డైరెక్టర్ వాల్ల భాషలో గట్టిగా ఇచ్చిపడేశాడు. దాంతోనే త్రివిక్రమ్ ఛాప్టర్ క్లోజ్ అన్నారు. కాని ఆ ఎపిసోడ్ మరుగున పడింది.. ఇప్పుడు ఇది కొత్త ఎపిసోడ్ గా మారుతోంది. ఏదేమైనా గాడ్ ఆఫ్ వార్ మూవీ కథని త్రివిక్రమే తెరకెక్కించాలంటే, వెంకటేష్ తో ఆదర్శకుటుంబం హిట్ అవ్వాలి.. అక్కడ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా, త్రివిక్రమ్ బదులు మరో దర్శకుడితో సినిమా చేస్తాననే కండీషన్ ఎన్టీఆర్ పెట్టడంతో, ఇప్పుడు త్రివిక్రమ్ ఫేట్ వెంకటేష్ మూవీ మీద డిపెండ్ అయ్యింది. వెంకినే ఇప్పుడీ మాటల మాంత్రికుడిని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది.