ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ డ్రాగన్. ఇదిప్పుడు సడన్ గా 1200 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బీస్ట్ ధురందర్ మోడ్ లో కెళ్లింది... అంటే డ్రాగన్ పార్ట్ 1, డ్రాగన్ పార్ట్ 2 రెండూ కూడా కేవలం అంటే కేవలం 90 రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అవటం.. ఔను అచ్చంగా ధురందర్ టీం ప్లాన్ చేసినట్టే డ్రాగన్ టీం డబుల్ ధమకా ప్లాన్ చేస్తోంది. ఇలాంటి టైంలో ఈ సినిమాకు 120 కోట్ల ఓటీటీ రైట్స్ అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి... ఒకవైపు వారణాసి మూవీకి 1000 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్ తోనే వస్తుంటే, రెండు పాన్ ఇండియా హిట్లున్న హీరో తో మూడు పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడి సినిమాకు 120 కోట్లేనా? ఇది అందరికి వస్తున్న షాకింగ్ డౌట్.. కాని చూడ్డానికి నెంబర్ చిన్నగా అనిపించినా, దాని వెనక 1000 కోట్ల బరువుంది... ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆలోచన అదిరిపోతోంది. డ్రాగన్ 120 కోట్ల ఓటీటీ రైట్స్ ఒక దేశానికే పరిమితం.. అంటే ఒక్కో దేశంలో ఒక్కో లా రైట్స్ సేల్ చేస్తే, ఆ లెక్క ఎక్కడికిపోతుంది? ఇంతకి ఇదేం స్ట్రాటజీ? ఎందుకు వరల్డ్ వైడ్ గా టోటల్ ఓటీటీ రైట్స్ అమ్మకూడదు..? మరి ఇలా అమ్మితే నిజంగా ఓటీటీ రైట్స్ 1000 కోట్లని రీచ్ అయ్యేలా ఉన్నాయా?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఓటీటీ రైట్స్ కేవలం అంటే కేవలం 120 కోట్లనే వార్త అందరిని షాక్ కి గురిచేస్తోంది. పాన్ ఇండియా సినిమాలేవి కూడా 150 నుంచి 250 కోట్ల మధ్య ఓటీటీ రైట్స్ సేల్ అవుతున్నాయి. వారణాసి అయితే 1000 కోట్ల ఓటీటీ డీల్ కి దగ్గరైంది. నెట్ ఫ్లిక్స్ కూడా అంతటి ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఉగాదికల్ల భారీ ఎనౌన్స్ మెంట్ రావచ్చని కూడా అంటున్నారు.రాజమౌళితో పోలిస్తే ప్రశాంత్ నీల్ ది కూడా అదే స్తాయి ఇమేజ్,స్ట్రాటజీ.. అలాంటి డైరెక్టర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అంటే పాన్ ఇండియా ఊగిపోవాలి... కాని 120 కోట్లేడ్రాగన్ ఓటీటీ రైట్స్ అంటే నమ్మశక్యంగా లేదు. అయితే అక్కడే కథలో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ ఇండియా వరకు మాత్రమే పరిమితమయ్యే ఓటీటీ రైట్స్ 120 కోట్లు.
అది కూడా అన్ని భాషల రైట్స్ కాదు.. కేవలం దక్షిణాది భాషల రైట్స్ మాత్రమే. హిందీ వర్షన్ రైట్స్ 80 కోట్లు.. అలా చూసినాటోటల్ 200 కోట్లు.. ఇదేం పెద్ద నెంబర్ కాదు.. డ్రాగన్ లాంటి క్రేజీ సినిమాకు 350 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ డీల్ జరుగుతుందనే అంచనాలున్నాయి. కాని తీరా చూస్తే 120 కోట్ల నుంచి 200 కోట్ల డీలే సెట్ అయ్యిందన్న వార్త షాకిస్తోంది.అయితే అక్కడితోనే కథ అయిపోలేదు.. ముందుంది అసలు మార్కెటింగ్ ఆట... ఇండియాలో నెట్ ఫ్లిక్స్ కి డ్రాగన్ చెల్లించే ఎమౌంట్ 200 కోట్లు.. కాని ఇదే మూవీ యూఎస్ లో ఉన్న వాళ్లు చూడాలంటే, అదే కంటెంట్, అమేజాన్ లో అక్కడ అందుబాటులో ఉంటుంది.. సో యూఎస్ వరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ 110 కోట్లని తెలుస్తోంది. ఇక కెనెడా లోని ఓటీటీ సంస్థలకి 50 కోట్లు. ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, యూరప్, మిడిల్ ఈస్ట్, శ్రీలంక, కొరియా, ఇండోనేషియా, మలేషియా, చైనా, జపాన్ ఇలా ఒక్కో దేశంలో ఒక్కో ఓటీటీ సంస్థకి మినిమమ్ 20 నుంచి మ్యాగ్జిమమ్ 200 కోట్ల వరకు రైట్స్ సేల్ చేస్తోంది డ్రాగన్ టీం.
విచిత్రంఏంటంటే ఇలా అన్నీ కలిపి ఒక సంస్థే ఓటీటీ రైట్స్ తీసుకోవచ్చు కదా, అంటే అలానే నెట్ ఫ్లిక్స్ 380 కోట్లు ఆఫర్ చేస్తే, డ్రాగన్ టీం తిరస్కరించిందట. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో ఓటీటీ సంస్తతో డీల్ సెట్ చేసుకోవటంతో, 650 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ రూపంలోనే డ్రాగన్ కి దక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇదే స్ట్రాటజీ వారణాసి కూడా ఫాలో అయ్యుంటే, 1000 కోట్లకు మించిన నెంబరే దక్కేదనంటున్నారు. ఏదేమైనా డ్రాగన్ టీం ఓటీటీ రైట్స్ రూపంలోనే మార్కెటింగ్ స్ట్రాటజీతో కుదిపేస్తోంది... ఇక థియేట్రికల్ మార్కెటింగ్ ఎలా ఉంటుందోచూడాలి.