మాస్ చరిత్రలో చూడని సినిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చూపించబోతున్నాడా? అసలు డ్రాగన్ నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ ని ఏ ధైర్యంతో వదిలారు? రిలీజ్ కి ఏడాది టైం ఉన్నాకాని, ఇంత లెంథీ గ్లింప్స్ తో ఆల్ మోస్ట్ కథంతా ఎందుకు ముందే చెప్పేశారు..? సినిమా మీద ఎంతో నమ్మకం, ధైర్యం లేకపోతే ఇంత రిస్క్ ఎవరూచేయరు. అసలు గ్లింప్స్ అంటేనే వినిపించీ వినిపించనట్టు డైలాగ్స్, కనిపించీ కనిపించనట్టు హీరో లుక్స్ చూపిస్తారు.. అలాంటి గ్లింప్స్ లో ఇంత స్టఫ్ ఏడాది ముందే ఇచ్చారు.. అందుకే డ్రాగన్ కథ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇంత రిస్క్ ని టీం కూడాచేయదు.. కాని చేసింది.. అందుకే ఇది ఎన్టీఆర్ కెరీర్ లో కల్ట్ మూవీ అవబోతోందా? త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్ ని గ్లోబల్ గా ఫోకస్ చేయొచ్చు.. కాని మహేశ్ కి పోకిరి, ప్రభాస్ కి బాహుబలి లా, ఎన్టీఆర్ కి డ్రాగన్ మారబోతోందా? తన ఫేటే ఈ సినిమాతో మారేలా ఉందా?
మ్యాన్ ఆఫ్ మాస్ చరిత్రలో డ్రాగన్ ఒక మలుపు తిప్పే మూవీనా? ఎన్టీఆర్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ గా మారబోతోందా? ఈ డౌట్లకు రీజన్, ఎన్టీఆర్ స్టామినాకు తగ్గ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు.. స్టూడెంట్ నెంబర్ 1, సింహాంద్రి, ఆది, ఇలా అరవింద సమేత వీరరాఘవ వరకు ఎన్టీఆర్ ఎకౌంట్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు పడ్డాయి. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గుర్తింపు హిట్ రూపంలో దక్కింది.ఇంత జరిగినా? ఇంతవరకు ఎన్టీఆర్ తలరాత మార్చే ఇండస్ట్రీ హిట్టేపడలేదనే అభిప్రాయంముంది.. ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా ఉండాలి? త్రిబుల్ ఆర్, దేవర కూడా ఇండస్ట్రీ హిట్స్ అనలేమా? అంటే అనే అవకాశం లేదు.. ఎందుకంటే త్రిబుల్ ఆర్ రాజమౌళి మూవీ, అందులోనూ మల్టీస్టారర్ ప్రాజెక్ట్.. ఇక దేవర మాస్ హిట్ అయినా, అలాంటి హిట్లు, అలాంటి పాత్రలు ఎన్టీఆర్ కి కొత్తేం కాదు.
ఇండస్ట్రీ హిట్ అంటే, హీరో తలరాతనే మార్చే పాత్రతో సినిమా రావాలి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుని పోకిరి ఎలా మార్చేసింది... బాహుబలితో ప్రభాస్ వేవ్ ఎలా దేశాన్ని ఊపేసింది... పుష్పరాజ్ గా బన్నీ స్టామినా ఎంత ఎత్తుకి పెరిగింది.. అందుకే అలాంటి బ్లాక్ బస్టర్లు, హీరో స్టామినాని ప్రపంచానికి తెలిసేలా చేసే పాత్రలు ఇవన్నీ కలిసి ఎటాక్ చేస్తేనే అది ఇండస్ట్రీ హిట్ అనుకోవాల్సి వస్తుంది.నిజం చెప్పాలంటే త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పీక్స్.. అంతకంటే ఎక్కువే పెర్ఫామెన్స్ టెంపర్ లో ఇచ్చాడు.. విచిత్రం ఏంటంటే అరవింద సమేత వీరరాఘవలో నేమో సూపర్ సాలిడ్ మాస్ పాత్ర పడింది.. ఇదే అసలు సమస్య.. ఒక్కో మూవీలో ఒక్కో అంశం ఉంది.. కాని తలరాత మార్చే ఇండస్ట్రీ హిట్ అంటే, పైన చెప్పిన మూడు ఒకే మూవీలో ఉండాలి.
టెంపర్ లో ఎన్టీఆర్ షాకిచ్చే పెర్పామెన్స్ ఉన్నట్టు పాత్ర వెరైటీ గా ఉండటం, అరవింద సమేత వీరరాఘవలో హీరో పాత్ర మొత్తం సినిమా భారం మోసినట్టు... త్రిబుల్ ఆర్ లో ఉన్నట్టు భారీ తనం.. ఇవన్నీ ఒక్క మూవీలో కనిపించినా; అలా బాక్సాఫీస్ షేక్ అయినా, ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ కి తిరుగుండదు. అదే డ్రాగన్ తో సాధ్యం అయ్యేలా ఉంది.లేదంటే ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గ్లింప్స్ ఇప్పుడే రావటం ఏంటి; అది కూడా నాలుగున్నర నిమిషాల లెంథీ గ్లింప్స్ లో కథంతా చెప్పడమేంటి? సినిమాలో ఎంత మ్యాటర్ ఉంటే, ఇంత మ్యాటర్ ని గ్లింప్స్ రూపంలో వదులుతారు.. ఇక హీరో పాత్ర, అందులో ఎన్టీఆర్ లుక్, పెర్పామెన్స్ చూస్టుంటే, ఇది తన కెరీర్ లో ఫస్ట్ కెరీర్ టర్నింగ్ కల్ట్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉణ్నాయి. ఏమాత్రం యావరేజ్ టాక్ వచ్చినా ఇండస్ట్రీ హిట్టే, ఇక పాజిటివ్ టాక్ వస్తే, బ్లాక్ బస్టరే.. అంతేకాదు సలార్ తో సోసోగా పేరుతెచ్చుకున్నాడు కాబట్టి ప్రశాంత్ నీల్ కి కూడా, డ్రాగన్ హిట్టైనా, ఎక్కువ క్రెడిట్ దక్కకపోవచ్చు... అలా చూసినా ఎన్టీఆర్ స్టామినాతో రాబోతున్న డ్రాగన్ గానే ఈ సినిమాకు గుర్తింపు దక్కేలా ఉంది. అదే తన ఫేల్ మార్చేలా ఉంది.