సూపర్ స్టార్ మహేశ్ బాబు జీవితంలో ఉన్న రెండు కలలు నెరవేరే టైం వచ్చినట్టుంది. ఆల్రెడీ వారణాషి మూవీతో గ్లోబల్ సూపర్ స్టార్ గా మారబోతున్నాడు. అలాంటి తనకి జేమ్స్ బాండ్ మూవీ చేయాలనేది ఒక డ్రీమ్ అయితే, లార్డ్ కృష్ణుడి పాత్ర వేయాలనేది మరో కల... కాకాపోతే ఆ పాత్రలు వేయటం కాకుండా, ఆ పాత్రలు వేసేలా కత్తిలాంటి కథ పడాలి.. అది తనకి నచ్చాలి.. ఇదే ఎప్పుడు జరుగుతుందా అన్న ఎదురుచూపుకి ఫుల్ స్టాప్ పడుతోంది. వారణాసి తర్వాత ఏంటి అన్న ప్రశ్నకి ఒకటి కాదు, రెండు సమాధానాలు ఆల్ మోస్ట్ రెడీ అయ్యాయి.. ఒకటి సుకుమార్ డైరెక్షన్ లో అయితే,మరొకటి ప్రశాంత్ నీల్ మేకింగ్ లో... నిజానికిడ్రాగన్ తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ తో మహేశ్ బాబు సినిమా అంటూ ప్రచారం మొదలైంది. అవన్నీ రూమర్లే అన్న రెస్పాన్స్ కూడా వచ్చింది. కట్ చేస్తే సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణావతారం ఎత్తే టైం వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది.. ఎప్పుడు? ఎలా? ఎవరి డైరెక్షన్ లో ?
సూపర్ స్టరా్ మహేశ్ బాబుని కృష్ణుడిగా ఊహించుకోండి... వెండితెర వెలిగిపోతుంది.. ఆల్రెడీ శివుడిగా, రాముడిగా వారణాసి మూవీలో కనిపించబోతున్నాడు. ఇక మిగిలిన మరో కల, లార్డ్ కృష్ణ పాత్ర... ఇది కూడా తన ఎకౌంట్ లో పడే టైం వచ్చింది. వారణాసి తర్వాత మహేశ్ బాబు ఏ సినిమా చేస్తాడు? ఎవరితో కాంబినేషన్ సెట్ అవుతుందనే ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ.. ఈ ముగ్గురి డైరెక్షన్ లో మహేశ్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో స్పెక్కులేషన్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో ప్రశాంత్ నీల్ మాట వచ్చేసరికి మైథాలజీ తూటా పేలుతోంది. అదే దేవ దేవుడు లార్డ్ కృష్ణ... గ్యాంగ్స్ స్టర్ మూవీస్ కి ఫుల్ స్టాపెట్టి, ఎప్పటినుంచో అనుకుంటున్న మైథాలజీ డ్రామా తీయాలనుకుంటున్నట్టు తేల్చాడు ప్రశాంత్ నీల్.
అది సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనే అన్నట్టు కొత్త ప్రచారం జరుగుతోంది. ఐతే నిజానికి ప్రశాంత్ నీల్, తోనే మహేవ్ బాబు నెక్ట్స్ మూవీ అన్న ప్రచారంలో నిజం లేదని ప్రశాంత్ నీల్ టీం అంటోంది. ఎందుకంటే తను డ్రాగన్ తోనే ఫుల్ బిజీ అయ్యాడు. ఆతర్వాత సలార్ 2ని మొదలు పెట్టబోతున్నాడు. అదయ్యాకే తన మైథలాజికల్ డ్రామా మొదలౌతుందట..కాబట్టే, మహేవ్ బాబు నెక్ట్స్ మూవీ మాత్రం ప్రశాంత్ నీల్ తో కాదని తేలిపోతోంది. కాకపోతే, ఆతర్వాత అంటే వారణాసి తర్వాత సుకుమార్ తో మహేశ్ బాబు సినిమా తీశాక, అప్పుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు. అదే కృష్ణుడి పాత్రతో సాలిడ్ మైథలాజికల్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే, వారణాసితో పాటు మహేశ్ బాబు కెరీర్ లో మూడు వింతలు వరుసగా జరిగినట్టౌతుంది.ఎందుకంటే ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ రోల్స్ చేయాలనేది మహేశ్ బాబు కల.. దాంతోపాటు రాముడు, కృష్ణుడి లాంటి పాత్రలంటే తనకెంతో ఇష్టం.. అందులో రాముడిగా, శివుడిగా వారణాసిలో కనిపించబోతున్నాడు. అలాంటి టైంలో ఒకవైపు సుకుమార్ మేకింగ్ లో జేమ్స్ బాండ్ రోల, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో లార్డ్ కృష్ణ పాత్రతో సినిమా... ఇది నిజంగా కథలు, పాత్రల పరంగా సూపర్ అద్రుష్టమే.. అదే 2027, 2028 లో జరిగేలా ఉన్నాయి.