ప్రస్తుతం ఎన్టీఆర్ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘దేవర2' కోసం’ వర్కౌట్స్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో అనౌన్స్ అయిన #NTRNeel సినిమా షూటింగ్ షెడ్యూల్స్ రద్దయ్యాయని, లుక్ టెస్ట్‌లు సరిగ్గా రాలేదని కొన్ని వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. దీంతో తారక్ అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.అయితే, ఈ పుకార్లకు చెక్ పెడుతూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఈ సినిమా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. షూటింగ్ షెడ్యూల్స్ ఏవీ రద్దు కాలేదు. ప్రస్తుతం కేవలం ఒక రొటీన్ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే ఉంది," అని మేకర్స్ స్పష్టం చేశారు.సోషల్ మీడియా వేదికగా వారు స్పందిస్తూ.."సినిమా షూటింగ్ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మకండి. అధికారిక సమాచారం కావాలంటే మా సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఫాలో అవ్వండి. ఏ అప్డేట్ ఉన్నా మేమే నేరుగా తెలియజేస్తాం అని ప్రొడ్యూసర్స్ ఓపెన్ అయ్యారు.దీనిని బట్టి అర్థమవుతున్నదేంటంటే, సినిమా అనుకున్న సమయానికే పట్టాలెక్కనుంది.
కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనుల వల్ల చిన్న గ్యాప్ వచ్చిందే తప్ప, ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌ను మాస్ యాక్షన్ అవతార్‌లో చూడాలని కోరుకునే వారికి ఈ వార్త పెద్ద ఊరటనిచ్చింది. సలార్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్, ఎన్టీఆర్ లాంటి పర్ఫార్మర్ను ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుకార్లు కామన్. కానీ, అభిమానులు ఎప్పుడూ అధికారిక ప్రకటనలనే నమ్మడం మంచిది. సో, నందమూరి ఫ్యాన్స్.. గెట్ రెడీ! తారక్ - నీల్ కాంబోలో రాబోయే సునామీకి ఇంకా సమయం ఉంది కానీ, అది రావడం మాత్రం ఖాయం అని సినీ విశ్లేషకులు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.