వెయ్యికోట్ల కోసం వందలకోట్లు బడ్జెట్ పెట్టడం కామనైన ఈరోజుల్లో, 1000 కోట్ల వసూళ్లని కామన్ గా మార్చే పని చేస్తోంది వారణాసి బ్యాచ్. 1400 కోట్ల బడ్జెట్ ని 10 వేల కోట్ల రాబడిగా మార్చే పనిలో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా 2 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల అంచనాతోనే వస్తోంది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, రెండూ కూడా సీక్వెల్స్ తో ప్లాన్ చేసిన మూవీలే.. రెండ్లీంట్లో కూడా హీరో ఒక్కడే కాని వేస్తున్న పాత్రలు మాత్రం రెండు.. లేదంటే అంతకుమించి. అంటే 1000 కోట్ల వసూళ్లని మించాలంటే ఇలాంటి సినిమాల్లో హీరో ఒక్క అవతారం లో వస్తే చాలదా? అందుకే రాకాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడా? కల్కీ లో ప్రభాస్ ఒక్కడు కాదు.. సో ఇక్కడ వెయ్యికోట్ల రేంజ్ బడ్జెట్ మూవీలన్నీంట్లో హీరో ఒకడే కాని పాత్రలు కనీసం రెండైనా ఉండితీరాలా?
పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ మూవీ అంటే హీరో ఒక్కడు కాదు, కనీసం ఇద్దరు ఉండితీరాల్సిందే. అలాని అన్ని సార్లు మల్టీస్టారర్ అంటే కుదిరే పనికాదు.అది హిట్ అయినా ఎవరి ఎకౌంట్ లో పడుతుందో కూడా చెప్పలేం. అలాని హీరో ఒక్కడే అంటే పాన్ ఇండియా, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మూవీలకు డోసు సరిపోతుంది. అందుకే ఒకే హీరో రెండు పాత్రలు, లేదంటే ఒకే హీరో మూడు పాత్రలు.. ఇది 2000 కోట్లు రాబట్టే ఫార్ములా అంటున్నారు.అందుకు డ్రాగన్ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడు కాదు.. ఇద్దరు.. తాతా మనవడు.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్న విధానం ప్రకారం, తాతా మనవడిగా రెండు డ్రాగన్స్ ని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.. ఆల్రెడీ దేవరలో తండ్రి కొడుకుల కాన్సెప్ట్ 670 కోట్ల వసూళ్ళని రాబట్టింది. ఇప్పుడు తాతా మనవడి కాన్సెప్ట్ తో పాన్ ఇండియా కాదు, పాన్ ఆసియా మూవీగా రాబోతోంది డ్రాగన్..
కట్ చేస్తే వారణాసిలో హీరో కూడా ఒక్కడే కాని, వేసేది మూడు పాత్రలు.. రాముడు, రుద్రుడు, శివుడు.. అది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా. ముందు ఒకటే పార్ట్ అన్నారు. తర్వాత రెండు భాగాలుగా స్ప్లిట్ చేస్తున్నరంటున్నారు.. ఏదేమైనా డ్రాగన్ రెండు భాగాలు, వారణాసి రెండు బాగాలు... ఇక హీరో కూడ ఒక్కడు కాదు ఐతే ఇద్దరు లేదంటే ముగ్గురుగా కనిపించబోతున్నారు.బాహుబలి లాంటి మూవీలో ఇద్దరిగా కనిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్... యానిమల్ లో కూడా రణ్ బీర్ కపూర్ ఒక్కడే అయినా వేసింది రెండు పాత్రలు.. ఇక కల్కీలో కర్ణుడిగా, భైరవగా కనిపించిన ప్రభాస్ 1200 కోట్లు కొల్లగొట్టాడు.. బాహుబలితో 1850 కోట్లు రాబట్టాడు. సో పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్లు రాబట్టాలంటే ఈ మాత్రం డోసు ఉండి తీరాల్సిందే.
మరి పాన్ ఇండియా సినిమాకే ఇలా అయితే, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మూవీల పరిస్థితేంటి? సో అక్కడ కంటెంట్ ఎంత తోడున్నా, డ్యూయెల్ రోల్స్ డెఫినెట్ గా వరల్డ్ ఆడియన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టే, డ్రాగన్, వారణాసి, స్పిరిట్ లో డ్యూయెల్ రోల్స్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ క్లబ్ లో రాకా చేరింది. మ్రుగంగా మారిన మనిషి, అలానే మనిషిగా మిగిలిన హీరో, ఇలా రెండు పాత్రలు వేయబోతున్నాడ హీరో. కాకాపోతే మ్రుగంగా మారిన మనిషి ముందు ఉన్న పాత్ర కూడా అగ్లీగా ఉండటంతో, ఒక గుడ్, రెండు బ్యాడ్, అగ్లీ పాత్రల్లో బన్నీ కనిపిస్తాడని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ పాన్ వరల్డ్ మూవీలన్నీ ఇలా ఒకే హీరో రెండు పాత్రల ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుంది.