ఇలా కూడా భయపెట్టొచ్చా.. కొత్త హీరోయిజం…!

హీరోయిజం అంటే, విలన్లు వనికి పోవాలి.. అలా జరగాలంటే హీరో కండలు తిరిగి పోయుండాలి...త్రిబుల్ ఆర్ లో భీమ్, అందులోనే రామ్, ఇక బాహుబలిలో ప్రభాస్, యానిమల్ లో రణ్ బీర్ ఎవరిని చూసినా హీరో అంటే కండలు తిరిగి, విలన్

Post Published By: dialnews
Updated : 7 March 2026, 3:04 PM IST

హీరోయిజం అంటే, విలన్లు వనికి పోవాలి.. అలా జరగాలంటే హీరో కండలు తిరిగి పోయుండాలి...త్రిబుల్ ఆర్ లో భీమ్, అందులోనే రామ్, ఇక బాహుబలిలో ప్రభాస్, యానిమల్ లో రణ్ బీర్ ఎవరిని చూసినా హీరో అంటే కండలు తిరిగి, విలన్ మెడలు వంచాలి... అలాకాకుండా కూడా బక్కపలుచగా ఉంటే హీరోగా కన్సిడర్ చేస్తారా? ఎముకల గూడులా, పక్కటి ఎముకలు కూడా కనిపించేంత పలుచగా హీరో కనిపిస్తే, అందులో హీరోయిజం ఎలివేట్ అవుతుందా? అలాంటి రిస్కే డ్రాగన్ టీం చేస్తోందా? ఔను దీనికి ప్రేరణ కూంగ్ ఫూ మాస్టర్ బ్రూస్లీనే.. తనేం కండలు తిరిగి, పెద్ద బాహుబలిలా ఉండడు.. కాని కొండలను కూడా పిండిచేస్తాడంటే నమ్మేలా ఉంటాయి తన సినిమాలు.. తన పక్కటెముకలు కూడా కనిపించేంత బక్క పలుచగా ఉన్నా, తను పంచ్ వేస్తే, ఆరున్నర అడుగుల వ్యక్తి కూడా కుప్పకూలాల్సిందే... అలాంటి లుక్ తో డ్రాగన్ గా ఎన్టీఆర్ ని మనం చూడబోతున్నామా? బ్రూస్లీ అంటే కూంగ్ ఫూ మాస్టర్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు.. బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ సన్నబడితేనే ఒప్పుకోలేదు.. అలాంటిది మరీ బక్కపలుచగా బ్రూస్లీ స్టైల్లో ఎంట్రీ ఇస్తే, చైనా, కొరియా సరే, ఇక్కడి జనం కన్విన్స్ అవుతారా?

వోల్వా బస్సొచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుంది... అలా హీరోయిజం చూపించాలి... అలానే హీరో ఉంటే బాగుంటుందనేలా జనం కూడా ఫిక్స్ అయ్యారు. కాని అందుకు రివర్స్ లో స్కూటరే వచ్చి వోల్వో బస్సుని గుద్దితే... స్కూటరే డ్యామేజ్ అవుతుంది.. అలా కాకుండా వోల్వో బస్సే బద్దలైతే...ఇలా సినిమాలోనే జరుగుతుందనే కామెంట్సే వస్తాయి.. కాని రియలిస్టిక్ గా అది సాధ్యం అని చూపిస్తే, డెఫినెట్ గా అదే సెన్సేషన్ అవుతుంది.అదే డ్రాగన్ విషయంలో జరగబోతోంది. డ్రాగన్ టైటిల్ బ్రూస్లీగా మారుతుందో లేదో కాని, ఇందులో హీరో వేసే పాత్ర బ్రూస్లీ మల్లీ పుట్టాడనేలా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి కాస్త కండ పట్టి ఉండటమే అందం... అలాని మరీ బొద్దుగా కాకుండా, మరీ బక్కపలచగా కాకుండా టెంపర్ లో ఉన్న లుక్ డెఫినెట్ గా తన హీరోయిజానికి సరిగ్గ సరిపోతుంది.

కాని ఇప్పుడు ఎముకల గూడులా, పక్కటి ఎముకలు ముందుకు తన్నుకుని వచ్చేలా కనిపించబోతున్నాడు. అలాని ఏదో ఆకలితో తిండి తిప్పలు లేని కరువు వ్యక్తి పాత్ర వేస్తున్నాడనుకోవటానికి లేదు. పక్కా మాస్ రోల్.. డేంజరస్ రోల్.. ప్రపంచాన్నే కుదిపేసిన బ్రూస్లీ మూవీ ఎంటర్ ది డ్రాగన్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఆ సినిమా వచ్చే వరకు ఒక ఫైటర్ ఇళా చీపురు పుల్లలా ఉండి కూడా కుమ్మేయొచ్చా అని ఎవరూ ఊహించలేదు.కాకపోతే కూంగ్ ఫూ వీరుడిగా, సన్నగా ఉన్నా సిక్స్ ప్యాక్స్ తో కనిపించాడు బ్రూస్లీ.. ఆలుక్కు, ఆపాత్ర ఇవే ప్రేరణగా, డ్రాగన్ మూవీ తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే తన ఫేస్ లో కల తప్పేంత ప్రమాధం ఉన్నా, పాత్ర నచ్చే ఎన్టీఆర్ రోజు రోజుకి చిక్కిపోతూ, తన పాత్ర కోసం బక్కచిక్కాడని లేటుగా తెలుస్తోంది. నిదానంగా సమాచారం అందుతోంది.

హీరో అంటే బక్క పలుచగా ఉండి కూడా, బొక్కలు విరిచే వీరుడిగా కనిపించొచ్చని, ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సినిమా నిరూపిస్తుందా? ఈ డౌట్ ని ఒకరితో కాదు ఇద్దరితో ప్రూవ్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఔను డ్రాగన్ మూవీలో తాతా, మనవడిగా ఇలా రెండు పాత్రలేస్తున్నాడో? లేదంటే తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడో కాని, ఒక పాత్ర బక్కగా ఉంటే, మరో పాత్ర పక్కటెముకలు కనిపించేంత బక్క పలచగా ఉంటుందట.. కాని టెన్ ప్యాక్స్ యాబ్స్ మాత్రం కామన్... అందుకే ఎన్టీఆర్ కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ హీరోయిజం ఈ సినిమాలో చూడబోతున్నామన్న ప్రచారం ఊపందుకుంది.

Published : 
  • 7 March 2026, 3:04 PM IST