ఎన్టీఆర్ మాస్ జాతరకి టైం దగ్గర పడుతోంది. మే 20 న డ్రాగన్ గర్జించబోతోంది.. ఇది ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న ప్రచారం. ఆల్రెడీ ఫిల్మ్ టీం ఈ సినిమా పోస్టర్ డిజైన్లతో ఫుల్ బిజీ గా ఉంది. ఫస్ట్ లుక్ ని రివీల్ చేయటానికి సిద్దమైంది. ఇది కాకుండా గ్లింప్స్, టీజర్ కి టైం వచ్చిందా? మే 20 న ఎలాగూ డ్రాగన్ టీజర్ వస్తుందనేది అందరికున్న అంచనానే... ఇక తేలాల్సింది రెండో సర్ ప్రైజ్ ఏంటనేది..? మే 20కి అంటే ఎన్టీఆర్ బర్త్ డేకి కనీసం 19 రోజుల ముందు అసలు సర్ ప్రైజ్ ఉండేలా ఉంది. అదే డ్రాగన్ గ్లింప్స్.. 20 రోజులు గ్యాప్ లో ఒకటి కాదు రెండు ప్రోమోలతో డ్రాగన్ టీం దుమ్ముదులిపేలా ఉంది. ఆల్రెడీ ఉగాదికి ఏదో గట్టిగానే పోస్టర్ ని లాంచ్ చేస్తారనే అంచనాలున్నాయి.. ఇలాంటి టైంలో, నెల గ్యాప్ లో మళ్లీ ఇలా రెండు ప్రోమోలంటే పూనకాల రావాల్సిందే.
మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. డెఫినెట్ గా ఈ పుట్టిన రోజుకి డ్రాగన్ టీం సర్ ప్రైజ్ ఇస్తుందనేది అందరికి క్లారిటీ ఉన్న అంశమే. కాని 20 రోజుల గ్యాప్ లో రెండు భారీ సర్ ప్రైజులు, రెండు నెలల గ్యాప్ లో ఫస్ట్ లుక్ షాకులు మాత్రం నిజంగా ఎవరి ఊహకందనివి... అలాంటి ప్రమోషన్ చేయాలంటే, సినిమారిలీజ్ డేట్ దగ్గర్లో ఉండాలి.కాని 2027 సంక్రాతికే డ్రాగన్ రిలీజ్ అనంటున్నారు. కాబట్టి ఇంకా 10 నెలల టైం ఉంది.. ఈలోపే ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్లు రాబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇక మే 20న ఎలాగూ టీజర్ వస్తుంది. అది అందరూ ఊమించేదే.. కాకపోతే మే 1న అంటే ఎన్టీఆర్ బర్త్ డేకి కనీసం 19 రోజులు ముందు, డ్రాగన్ గ్లింప్స్ వదలాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అని తెలుస్తోంది.
మే డే కి డ్రాగన్ గ్లింప్స్ ని, అలానే ఎన్టీఆర్ బర్త్ డేకి డ్రాగన్ టీజర్ ని వదలటానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆవిసయాన్ని ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలి ఫిల్మ్ టీం కూడా ఈ రెండు అప్ డేట్స్ ని ఆ పోస్టర్ లో తేల్చేయబోతోందట. ఆ పోస్టర్ కూడా రెగ్యులర్ మూవీ ప్రమోషన్ లా కాకుండా గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.ఇంతకి మేడే రోజు డ్రాగన్ గ్లింప్స్ ప్లాన్ చేయటానికి రీజనేంటి? ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది.. ఒక కార్మికుడి కర్కోటకమైన జర్నీనే డ్రాగన్ కథని తెలుస్తోంది. సో ఆ కనెక్షన్ వల్లే కార్మికుల రోజైన మేడే కి డ్రాగన్ గ్లింప్స్ ని వదిలి, తర్వాత మే 20 కి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా డ్రాగన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఇక ఆగస్ట్ 15 కి మరో సర్ ప్రైజ్ గా పాటల తూటాలు పేల్చటం మొదలు పెడతారట.దసరాకు ట్రైలర్ లాంచ్ చేయాలనే కండీషన్ ఓటీటీ సంస్తనుంచి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇలానే ఉగాది నుంచి సంక్రాంతి వయా దసరా అన్నట్టే డ్రాగన్ ప్రమోషనల్ జర్నీ సాగుతుందా అన్నది, ఉగాదికొచ్చే సర్ ప్రైజ్ తనే తెలుస్తుంది. తేలుతుంది.