వైరల్ అవుతున్న బుచ్చిబాబు…!

'ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకర్స్ ముంబైలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Post Published By: dialnews
Updated : 21 May 2026, 1:02 PM IST

'ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకర్స్ ముంబైలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వేడుకలో హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు, రామ్ చరణ్ డెడికేషన్ గురించిన ముచ్చట్లు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టేజ్ ఎక్కిన జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనాపై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. సరదాగా మాట్లాడుతూనే ఆయన వర్కింగ్ స్టైల్‌ను బయటపెట్టింది. "బుచ్చిబాబు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ.. నిజానికి ఆయన చాలా డేంజర్. ఇండియాలోనే పెద్ద రౌడీ డైరెక్టర్" అంటూ నవ్వేసింది.

సినిమా కోసం ఆయన ఎంతగా కష్టపడతారో, నటీనటుల నుండి పర్‌ఫెక్ట్ అవుట్‌పుట్ రాబట్టడానికి ఎంత డీటెయిలింగ్‌గా పని చేయిస్తారో జాన్వీ వివరించింది. అయితే ఈ 'రౌడీయిజం' అంతా కేవలం షూటింగ్ సమయంలో, సీన్ బాగా రావడం కోసమేనని.. సెట్స్‌లో మాత్రం ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయే వ్యక్తి అని ప్రశంసించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే ఒక పక్కా లోకల్, మాస్ మరియు హై ఎనర్జీ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదని ఆమె తెలిపింది.
"నాలుక ఇలా తిప్పు, లంగా ఇలా పట్టుకో, ఈ స్లాంగ్‌లో ఇలా మాట్లాడాలి.. అంటూ బుచ్చిబాబు గారు ప్రతి విషయంలోనూ నాకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇచ్చిన డైరెక్షన్‌ను నేను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా సరికొత్త అనుభూతిని ఇచ్చింది" అని జాన్వీ పేర్కొంది.

అంతేకాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత తన నటన బాగున్నా, బాలేకపోయినా ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి ‘పెద్ది’ సినిమా కోసం జాన్వీ ఎంతగా కష్టపడిందో అర్థమవుతోంది. హీరో రామ్ చరణ్ గురించి కూడా జాన్వీ కపూర్ ఎంతో గొప్పగా మాట్లాడింది. "చరణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం" అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఒకప్పటి ఎమోషనల్ బాండింగ్‌ను ఆమె గుర్తు చేసుకుంది. గతంలో తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మరియు మెగాస్టార్ చిరంజీవిల కాంబినేషన్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారి వారసులుగా తామిద్దరం కలిసి నటించడం ఒక 'కాస్మిక్ కనెక్షన్' లా అనిపిస్తోందని జాన్వీ చెప్పడం మెగా అభిమానుల్లో సరికొత్త ఎమోషన్‌ను క్రియేట్ చేసింది. వెండితెరపై చిరంజీవి-శ్రీదేవి జంట సృష్టించిన మ్యాజిక్, ఇప్పుడు చరణ్-జాన్వీల రూపంలో మళ్లీ రిపీట్ అవుతుందనే ఆశలు పెరిగాయి. ముంబైలో నివసిస్తున్నప్పటికీ, తనకు తెలుగు రాష్ట్రాలే సొంతిళ్లు అని జాన్వీ చెప్పడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.

స్టేజ్ పైనే "అందరికీ నమస్కారం" అంటూ అచ్చతెలుగులో మాట్లాడి అక్కడున్న అభిమానులను ఆకట్టుకుంది. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తిని కూడా వ్యక్తం చేసింది.మరోవైపు, ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేతికి గాయంతో కనిపించడం చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనమంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ప్యాకేజీగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందా? లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Published : 
  • 21 May 2026, 1:02 PM IST