మెగా పవర్ స్టార్ స్టామినా.. పెద్ది ముందు పెద్ద టార్గెట్.. US రేంజ్ చూస్తే మైండ్ బ్లాక్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా పెద్ది.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 2:42 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా పెద్ది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు.. చరణ్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఓ పవర్-ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే చరణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికా అంటే యుఎస్ ప్లస్ కెనడా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద సుమారు 7 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 63 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఒక తెలుగు హీరో సోలో సినిమాకు, అదీ ఇంకా పూర్తిస్థాయి టీజర్ కూడా రాకముందే ఈ స్థాయి బిజినెస్ జరగడం నిజంగా విశేషం. రామ్ చరణ్ కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ, సోలో హీరోగా ఆయన మార్కెట్ స్టామినాను పెద్ది బిజినెస్ స్పష్టంగా చూపిస్తోంది. గతంలో చరణ్ నటించిన సోలో సినిమాలతో పోలిస్తే, ఇది హయ్యెస్ట్ US టార్గెట్. గేమ్ చేంజర్ ఫలితంతో సంబంధం లేకుండా, చరణ్ బ్రాండ్ వాల్యూ, బుచ్చిబాబు కంటెంట్‌పై డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకానికి ఈ డీల్ నిదర్శనంగా నిలుస్తోంది. కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. బుచ్చిబాబు ఎమోషన్స్‌ని పండించడంలో దిట్ట. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, ఎమోషనల్ కనెక్ట్ కుదిరితే మాత్రం ఓవర్సీస్‌లో ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకుల అంచనా.

కంటెంట్ క్లిక్ అయితే.. ప్రీమియర్స్ నుంచే రికార్డుల మోత మోగించడం ఖాయం. పైగా చరణ్ మేకోవర్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు బలాలు. మొత్తానికి పెద్ది టార్గెట్ పెద్దదే అయినప్పటికీ.. రామ్ చరణ్ బాక్సాఫీస్ పవర్ ముందు అది చిన్నబోవాల్సిందే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ. 63 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల బాట పట్టాలంటే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ కంపల్సరీ. మరి ఈ భారీ టార్గెట్‌ను ఛేదించి, ఓవర్సీస్ గడ్డపై చరణ్ మరోసారి తన జండా పాతేస్తాడేమో చూడాలి. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది విడుదల కానుంది. ఈ సినిమాపై ఇండియాలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాదు.. హిందీలో కూడా భారీ బిజినెస్ చేస్తుంది పెద్ది. నార్త్ ఇండియాలో ఈ సినిమాను 50 కోట్లకు పైగానే అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Published : 
  • 11 February 2026, 3:15 PM IST