సోషల్ మీడియాలో అతని క్రేజ్ వీరలెవల్…!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోంది. ఇండియన్ సినిమాలోనే క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా భావిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్

Post Published By: dialnews
Updated : 11 March 2026, 1:55 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోంది. ఇండియన్ సినిమాలోనే క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా భావిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమా గురించి అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం అనౌన్స్‌మెంట్‌తోనే ఇంత హైప్ తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి లేదని చెప్పాలి.

ప్రొడక్షన్ హౌస్ వివరాల ప్రకారం1.5 మిలియన్లకు పైగా రీల్స్ మరియు షార్ట్స్ కేవలం అనౌన్స్‌మెంట్ థీమ్ మీద క్రియేట్ చేయబడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ప్లస్ రీల్స్, యూట్యూబ్ లో 505K ప్లస్ షార్ట్స్ చేయబడ్డాయి. ఒక సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ సాంగ్‌కు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. లోకేశ్ కనగరాజ్ తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన యూనివర్స్‌ని సృష్టించారు. #AA23 కూడా ఆ యూనివర్స్‌లో భాగమవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

పోస్టర్‌లో అల్లు అర్జున్ గుర్రంపై స్వారీ చేస్తూ సూర్యాస్తమయం నేపథ్యంలో కనిపిస్తున్నారు. ఇది ఒక పీరియడ్ డ్రామా లేదా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మ్యూజిక్ బిట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్‌కు గ్లోబల్ రీచ్ ఇచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు లోకేశ్‌తో కలిసి అంతకు మించిన ప్లానింగ్‌లో ఉంది.బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్‌ను చూపించబోతున్నారు.

Published : 
  • 11 March 2026, 1:55 PM IST