స్పిరిట్ మాయలో పడి… కల్కీ 2 డేంజర్ మరిచారా…?

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా లెవల్లో ఎవరైనా మర్చిపోలేని కటౌట్ అంటే బాహుబలి.. పాన్ ఇండియా ట్రెండ్ నే సెట్ చేసిన ఆ పాత్ర

Post Published By: dialnews
Updated : 11 March 2026, 8:15 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా లెవల్లో ఎవరైనా మర్చిపోలేని కటౌట్ అంటే బాహుబలి.. పాన్ ఇండియా ట్రెండ్ నే సెట్ చేసిన ఆ పాత్ర, ఆ రోల్ వల్ల షేక్ అయిన పాన్ ఇండియాబాక్సాఫీస్ రికార్డు..మరో ఇరవైఏళ్లైనా మర్చిపోరు.. కాకపోతే ఇక్కడ మరో విషయం మాత్రం రెబల్ ఫ్యాన్సే కాదు, ఇండియన్ ఇండస్ట్రీ కూడా మర్చిపోతోంది. అదే కల్కీ మూవీ.... ఇది నిజం... అంతా స్పిరిట్ మాయలో పడ్డారు.. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ మూవీ అనగానే, అదెప్పుడొచ్చినా, హై వోల్డేజ్ కరెంట్ పాస్ అయినట్టే అన్న అంచనాలున్నాయి.

అందులో నిజం ఉంది కూడా... అలా అంచనాలు పెంచేసే కాంబినేషనే వీళ్లది.. కాని ఇక్కడ మ్యాజిక్ లాంటి లాజిక్ ఏంటంటే, బాహుబలి రేంజ్ ఉన్న మూవీ మళ్లీ ప్రభాస్ చేశాడంటే అదికల్కీనే.. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ లో బాహుబలి బిగినింగ్ కూడా 1200 కోట్లు రాబట్టలేదు.. బాహుబలి 2 తోనే 1850 కోట్లొచ్చాయి... ఆతర్వాత మళ్లీ 1000 కోట్లు దాటింది కల్కీకే.. అది కూడా హిట్ మూవీకి సీక్వెల్ కాదు.. ఇదే ఇంత రాబడితే, దీని సీక్వెల్ ఎంత రాబట్టొచ్చు.. కనీసం 2400 కోట్లు, కాలం కలిసొస్తే 3 వేల కోట్లు.. ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ సీక్వెల్ మీద ఎందుకు చాలామందిలో సవతి ప్రేమ అన్న భావన కలుగుతోంది?

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మొదటి భాగం పేరు తెస్తే, రెండో భాగా పాన్ ఇండియా కింగ్ గా తన పేరుని హిస్టరీలో వినిపించేలా చేసింది. అయితే బాహుబలి రెండో భాగానికి ఇప్పుడు కల్కీతో లింక్ పెట్టడానికి 1200 కోట్ల కారనాలున్నాయి. ఔను బాహుబలి మొదటి భాగం వచ్చినప్పుడు 580 కోట్ల వసూళ్లు వస్తే, రెండో భాగం ది కన్ క్లూజన్ వచ్చాక 1850 కోట్ల రికార్డు దక్కింది.కాని కల్కీ మొదటి భాగమే 1200 కోట్లు రాబట్టింది.. ఇదే చాలా ఇంట్రస్టింగ్ అలానే ఎగ్జైటింగ్ నెంబర్. ఎందుకంటే, ఒక సినిమా హిట్టయ్యాక, సీక్వెల్ వస్తే అది మొదటి భాగం కంటే డబుల్ వసూళ్లు రాబడుతుందని ఆల్ మోస్ట్ చాలా సినిమాలతో ప్రూవ్ అయ్యింది.

కేజీయఫ్ 450 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది. పొన్నియన్ సెల్వం కూడా అంతే మొదటి భాగానికి రెట్టింపు రెండో భాగం రాబట్టింది. ఇక కాంతారా అయితే 450 రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేస్తే, దానిప్రీక్వెల్ 900 కోట్ల షాక్ ఇచ్చింది. ఇలా ఎలా చూసినా రెండో భాగం , మొదటి భాగం కంటే డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటం కామన్ అయిపోయింది.అలా చూస్తే కల్కీ మొదటి భాగమే 1200 కోట్లు రాబడితే, రెండో భాగం అంటే దాని సీక్వెల్ ఇంకెంత రాబట్టొచ్చు.. డబుల్ లెక్కేసుకున్నా 2400 కోట్ల వసూళ్లు కనిపిస్తున్నాయి. నిజానికి కల్కీ అసలు కథంతా కల్కీసీక్వెల్ లోనే ఉందన్నారు.. అదేనిజమైతే, ఈ సీక్వెల్ సినీ సునామీ అవటం పెద్ద విషయమే కాదు. 2400 కోట్లు కాకుండా కాలం కలిసొస్తే 3 నుంచి 4 వేల కోట్ల వసూళ్లు అంచనా వేయొచ్చు..

ఇక్కడ టాపిక్ ఏంటంటే, కల్కీ అంతగా కలిసొచ్చినా, ఎందుకు దాని సీక్వెల్ విషయంలో ఇంతకాలం డిలే జరగింది. దిరాజా సాబ్, ఫౌజీ, లేదంటే స్పిరిట్ ఇలా కల్కీ సీక్వెల్ కి బ్రేకులేసేందుకు మూడంటే మూడు మూవీలు ముందుకొచ్చాయి. ది రాజాసాబ్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఫౌజీ, స్పిరిట్ వల్లే కల్కీ సీక్వెల్ మరింత లేటౌతోందన్న టైంలో, కల్కీ టీం వేగం పెంచింది.. కొన్ని సార్లు గొప్ప సినిమా అంటే సరిపోదు.. దాని మీద జనాల్లో ఉన్న ఎగ్ఝౌట్మెంట్ తగ్గేలోపు సీక్వెల్ తీసి, వసూళ్ల వరద తేవాలి.. అలా వేడి మీదున్నప్పుడే దాడి చేయాలి.. లేదంటే ఇలానే డిలే అవతూ ఉంటే, 1200 కోట్ల వసూళ్ల రికార్డు, మరో రికార్డుకి పెట్టుబడిగా మారే ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్టౌతుంది.

Published : 
  • 11 March 2026, 8:15 PM IST